లోకేష్ తేనెతుట్టెను కదుపుతున్నారు ఎందుకు?

జగన్ ఆ విషయంలో విఫలమయ్యారనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు నారా లోకేష్ కొత్తగా కనిపెట్టి చెప్పేదేమీ లేదు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక వర్గంలో వ్యతిరేకత ఏర్పడడంలో ఉద్యోగుల పెన్షన్ వ్యవహారం కూడా కీలకమైనదే. పాదయాత్ర సమయంలో వారందరూ కలిసి వచ్చి తనను అడిగారు గనుక, ముందు వెనుక చూడకుండా జగన్మోహన్ రెడ్డి వారికి వరం ప్రసాదించారు.

తాను అధికారంలోకి వస్తే వారం రోజుల వ్యవధిలోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ప్రాక్టికల్‌గా ఉండే ఇబ్బందుల గురించి సరైన అవగాహన లేకుండా జగన్ ఇచ్చిన మాట అది. దానిని నెరవేర్చడం అసాధ్యం అని అర్థమైన నేపథ్యంలో, మధ్యమార్గంగా ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనం కల్పించేలాగా జగన్ కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చినప్పటికీ ఆ వర్గం సంతృప్తి చెందలేదు. ఫలితం ఏమైందో అందరికీ తెలుసు.

చంద్రబాబు నాయుడు తెలివైన నాయకుడు గనుక సీపీఎస్ రద్దు గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించకుండానే ఎన్నికల పర్వాన్ని పూర్తి చేశారు. అధికారంలోకి వచ్చారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ గురించి తన ఎదుటకు డిమాండ్లు రాకుండా ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు ఇలా ఉండగా, మంత్రి నారా లోకేష్ మాత్రం ఈ సీపీఎస్ రద్దు అనే తేనె తుట్టెను కదపడం గమనార్హం.

నారా లోకేష్ విశాఖలో మాట్లాడుతూ అత్యంత సహజమైన శైలిలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. రొటీన్‌గా చెప్పే వైఫల్యాల వరకు ప్రస్తావించి ఊరుకుంటే సరిపోయేదేమో. అలా కాకుండా సీపీఎస్ రద్దు చేస్తారని హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారంటూ నారా లోకేష్ విమర్శించారు.

ఈ మాటలతో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే ఆలోచన ఏమైనా ఎన్డీఏ సర్కారు వద్ద ఉన్నదా అనే అభిప్రాయం, ఆశ ఉద్యోగ వర్గాల్లో కలుగుతున్నాయి. ఏ ఆలోచన లేకపోతే నారా లోకేష్ సీపీఎస్ అంశాన్ని ఎందుకు మాట్లాడతారని వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ ఆ విషయంలో విఫలమయ్యారనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు నారా లోకేష్ కొత్తగా కనిపెట్టి చెప్పేదేమీ లేదు. తమకు అలాంటి మేలు చేయగలిగే చిత్తశుద్ధి ఉంటేనే ఆ విమర్శలు చేయాలి లేదా మౌనంగా ఉండాలి. అంతే తప్ప ఆ అంశం గురించి మాట్లాడడమే అనవసరం కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

25 Replies to “లోకేష్ తేనెతుట్టెను కదుపుతున్నారు ఎందుకు?”

    1. హామీ ఇచ్చిన రెడ్డి నాయకుడు మాత్రం.. 99.99% హామీలు నెరవేర్చేశాము అని చెప్పుకొంటుంటే.. మనం శభాష్ అన్న సంగతి మర్చిపోతాం..

      అబద్ధం చెపుతున్నాడని తెలిసినా ఆ రెడ్డి నాయకుడిని మోస్తూనే బతుకుతుంటాం.. ఎందుకంటే.. పేరు చివరన రెడ్డి అని తగిలించుకొన్నాం కాబట్టి..

  1. జగన్ వైఫల్యాలని చెప్పకూడదా? చెపితె తెనె తుట్టెని కదిలించటమా? ఒక్క CPS రద్దె కాదు కదా!

    సంపూర్ణ నిద్యనెషెదం ఘొరమైన వైఫల్యం కాదా?

    మెగా DSC, కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ, ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్! ఇది వైఫల్యం కాదా?

    మోడి మెడలు వంచి ప్రతెక హొదా తెస్తా అన్ని గెలవాగె తూచ్చ్.. అన్నాడుగా!

    25 లక్షల పక్క ఇల్ల నిర్మానం చెస్తాం అని చెప్పి దొకా చెసింది ఎవరు?

    నారాసుర రక్థ చరిత్ర అని కదలు చెప్పి, బాబయి ని చంపిన వారిని వెనుకెసుకొస్తుంటె ధొకా కాదా?

    దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్, వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు అని చెప్పి మొసం చెసింది ఎవరు?

    రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు, ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు ఎవి?

    45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్ ఎక్కడ?.

    వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు ఎవి??

    రాజదాని నిర్మానం, పొలవరం దొకా చెసింది ఎవరు?

    1. మా జగన్ రెడ్డి 99.99% హామీలు నెరవేర్చేసాడు..

      మీరు చెప్పినవన్నీ.. ఇంకా ఏమైనా మిగిలితే.. ఆ మిగిలిన 0.01% లో వేసుకోండి..

      అసలు 100% అని చెప్పుకొనేవాళ్ళం.. అతి మంచితనం.. అతి నిజాయితీ కారణం గా.. 0.01% వదిలేశాం.. సంతోషించక మా మీద పడీ ఏడుస్తారే ..!

    2. ఈ సాల్తీని పొగడాల్సింది, శాలువ కప్పి సన్మానిచాల్సింది పోయి విమర్శిస్తారు ఏంటి సర్ మీరు?? 🤣🤣🤣

  2. లోకేష్ ఒక సాధారణ మంత్రి మాత్రమే… అదికూడా నాన్నారు కోటలో కానీ పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి…

    1. 11 కి పడిపోయినా.. ఈ కక్కుర్తి తెలివితేటలు మానలేదా..?

      అయినా మీకు ఇంతకన్నా వేరే మార్గం లేదులే..

      ఆ రెండు పార్టీలు విడిపోతే గాని మీకు ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేదు మరి..

      1. రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీకి మూడో స్థానం రావచ్చు.

  3. firsr Super six lo unna free bus, every kid ki 15000 rupees ivvamanu..idi discussions lone 4 years aypotaayi..teachers notlo sunnam migeledi..

    already this week teacher’s salary got late by 4 days..

  4. మనోడు మడమ + ‘గుద్ద తిప్పిన ఆ తేనె తుట్టే ని కదిపితే 2024 లో లెవెన్ మోహన్ అయ్యాడు, మళ్ళీ కదిపితే ఈసారి మన ..”సింగల్ సింహం.. సింగల్ digit” గాడు ఐతాడని భయమా గ్యాసు??

  5. ఈ వెబ్ పేజ్ ఏం చెప్పాలని అనుకుంటుంది… ఉద్యోగుల ఆశ కోసమా.. అంతైయితె వాళ్ళకి దమ్ము లేదు.. ఉన్నా వీళ్ళు అమలు పరిచే శక్తి లేదు…. ఇప్పుడు కంటిన్యు అవుతునా బురద జల్లుడు తప్ప..

  6. ఈ వెబ్ పేజ్ ఏం చెప్పాలని అనుకుంటుంది… ఉద్యోగుల ఆశ కోసమా.. అంతైయితె వాళ్ళకి దమ్ము లేదు.. ఉన్నా వీళ్ళు అమలు పరిచే శక్తి లేదు…. .

Comments are closed.