జేసీ క్ష‌మాప‌ణ‌తో సంతృప్తి చెంద‌ని సినీ న‌టి

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌తో సినీ న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త సంతృప్తి చెంద‌లేదు.

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌తో సినీ న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త సంతృప్తి చెంద‌లేదు. త‌నపై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ “మా”లో ఆమె ఫిర్యాదు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్ని తాడిప‌త్రిలో ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల కోస‌మే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నిర్వ‌హించ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

సినీ న‌టితో పాటు ఏపీ బీజేపీ నాయ‌కురాలు యామినీ శ‌ర్మ కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. వీళ్లిద్ద‌రితో పాటు త‌న బ‌స్సును కాల్చేశార‌ని బీజేపీ నాయ‌కుల‌పై తీవ్ర‌స్థాయిలో జేసీ విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం రాజ‌కీయంగా దుమారం రేపింది. అయితే మాధ‌వీల‌త‌పై ఆవేశంలో ఏదో మాట్లాడాన‌ని, బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌ని జేసీ ప్ర‌క‌టించారు.

ఇక అంతా స‌ర్దుమ‌ణిగింద‌ని అనుకుంటున్న త‌రుణంలో మాధ‌వీల‌త ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. హెచ్ఆర్సీ, పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు మాధ‌వీల‌త తెలిపారు. త‌న గురించి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి దారుణంగా మాట్లాడిన‌ప్ప‌టికీ, చిత్ర‌ప‌రిశ్ర‌మ స్సందించ‌లేద‌ని ఆమె వాపోయారు. అందుకే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు మాధ‌వీల‌త తెలిపారు.

త‌న ఫిర్యాదును మా అధ్య‌క్షుడు మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్తాన‌ని శివ‌బాలాజీ హామీ ఇచ్చిన‌ట్లు చెప్పారు.. సినిమా వాళ్ల వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ్డం దారుణ‌మ‌న్నారు. రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని ఆమె కోరారు.

2 Replies to “జేసీ క్ష‌మాప‌ణ‌తో సంతృప్తి చెంద‌ని సినీ న‌టి”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.