తమన్ ఆవేదన.. చిరంజీవి ఓదార్పు

తమన్ స్పీచ్ వైరల్ అయింది. ఎంతోమంది ఆలోచింపజేస్తోంది. చిరంజీవి కూడా ఆ స్పీచ్ విన్నారు. తమన్ మాటలు తన హృదయాన్ని తాకాయన్నారు.

స్టేజ్ పై సరదాగా మాట్లాడే తమన్ ఎమోషనల్ అయిపోయాడు. అదేదో తన గురించి లేదా తన సినిమా గురించో కాదు. తెలుగు సినిమా గురించి. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తుంటే, మనం మాత్రం కొట్టుకు ఛస్తున్నాం అన్నాడు. నెగెటివ్ ట్రోలింగ్స్ లో పడి కొట్టుకుపోతున్నామన్నాడు.

డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఈ సంగీత దర్శకుడు.. ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ పై తన మనసులో ఉన్న ఆవేదన మొత్తాన్ని బయటపెట్టాడు. మనమే మన సినిమాను చంపేస్తున్నామని, నిర్మాతను చంపేస్తున్నామని, వరస్ట్ బతుకు బతుకుతున్నామని అన్నాడు.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ చూసి సిగ్గు పడుతున్నానని.. అదే టైమ్ లో ఎక్కడ నిర్మాతలు మాయమైపోతారని భయంగా ఉందన్నాడు. తమన్ స్పీచ్ వైరల్ అయింది. ఎంతోమంది ఆలోచింపజేస్తోంది. చిరంజీవి కూడా ఆ స్పీచ్ విన్నారు. తమన్ మాటలు తన హృదయాన్ని తాకాయన్నారు.

“నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన చూసి నాకు ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో కదా.” అంటూ తమన్ పై తన అభిమానాన్ని చూపించారు చిరు.

విషయం సినిమా అయినా సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల ప్రభావం ఎదుటి వ్యక్తుల మీద ఎలా పడుతుందనే విషయాన్ని ఆలోచించి కామెంట్ చేయాలని పిలుపునిచ్చారు చిరంజీవి. మనం పాజిటివ్ గా ఉంటే, ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇంతకీ తమన్ బాధ, ఆవేదన దేని గురించి..!

తెలుగు సినిమాలపై నెగెటివ్ ట్రెండ్స్, ట్రోలింగ్స్ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవి కావు. ఎప్పట్నుంచో ఉన్నాయి. ఇకపై కూడా వాటిని ఆపలేం. సమాజం, సోషల్ మీడియా అలా తయారయ్యాయి. అలాంటప్పుడు తమన్ పనిగట్టుకొని ఇప్పుడే ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేశాడు.

గేమ్ ఛేంజర్ సినిమాపై నడుస్తున్న నెగెటివ్ ట్రోల్స్ తమన్ ను బాధపెట్టాయా?… ఆ సినిమా పైరసీ అవ్వడం తట్టుకోలేకపోయాడా?.. లేక డాకు మహారాజ్ సినిమా స్టెప్పులపై నడిచిన వివాదం, ఇతర అంశాలు తమన్ ను ఇబ్బంది పెట్టాయా? ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాన్ వార్స్ చూసి కలత చెందాడా?

వీటితో సంబంధం లేకుండా ఓవరాల్ గా సోషల్ మీడియా పోకడ చూసి తమన్ అలా రియాక్ట్ అయ్యాడా? ఏదేమైనా తమన్ మాత్రం తన మాటలతో అందర్నీ ఆకట్టుకున్నాడు.

11 Replies to “తమన్ ఆవేదన.. చిరంజీవి ఓదార్పు”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. Producer maayamaipithe veediki dabbulu raavu , heros ki dabbu raadhu. Prekshakulu maayamaipithe ippudu vunna ticket rates ki? Appudu producer M ayipothaadu. Prekshakula gurinchi koodaa aalochinchandi.

  3. ఎందుకు భయ్య కొత్త మ్యూజిక్ … మెగా పవర్ లాగా రిమేక్స్ చేసుకో .. చాలా హాయిగా ఉంటుంది

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. Producers ni champedi trollers kadu herolu directorle. Endukante pusha2 ki vachchianata negative trolls deniki raledu aina kuda aa cinema producer chachipoledu, bomma block buster aindi. Combinations meeda pettina shradda content meeda pedite producer always safe

  6. Mari Thaman Sarileru Neekevvaru gurinchi Ala Vaikunthapuramulo function lo troll chesaduga? It all started by film peopel only. Now it has spread to pubic. That’s all. Let them shut the fk up and suffer

  7. ఈల్ల ఏడుపులు సూస్తంటే నా లోనున్న psy కో నిద్ర లేసి డ్రాన్స్ చేస్తున్నాడు

Comments are closed.