పవన్ సినిమా మళ్లీ వాయిదా?

కారణం ఏదైనా హరిహర వీరమల్లు వాయిదా పడిందనేది పక్కా. ఆ తేదీకి రాబిన్ హుడ్ రావడం అంతకంటే పక్కా.

అసలే పవన్ కల్యాణ్ కు వీరాభిమాని.. పవన్ పాటలు రీమిక్స్ చేయడమే కాదు, ఆయన మేనరిజమ్స్ కూడా అప్పుడప్పుడు ఫాలో అయిపోతుంటాడు. అలాంటి వీరాభిమాని నితిన్, పవన్ పై పోటీకు వెళ్తాడా? పవన్ సినిమాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తాడా? ఏ హీరో అంత సాహసం చేయడు, నితిన్ అస్సలు చేయడు.

ఇప్పుడిదంతా ఎందుకంటే, డిసెంబర్ లో రావాల్సిన రాబిన్ హుడ్ సినిమాను వాయిదా వేసి, సమ్మర్ కు షెడ్యూల్ చేశారు. మార్చి 28 రిలీజ్ అంటూ పోస్టర్ వదిలారు. ఇన్నాళ్లూ ఆ తేదీ పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు పేరిట ఉంది.

ఇప్పుడు ఉన్నఫలంగా అదే తేదీకి రాబిన్ హుడ్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే దీనర్థం, పవన్ సినిమా వాయిదా పడినట్టే. హరిహర వీరమల్లు యూనిట్ ను సంప్రదించకుండా, మైత్రీ మూవీ మేకర్స్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరు కదా!

ఇంతకీ హరిహర వీరమల్లు సినిమాకు ఏమైంది..?

“హరిహర వీరమల్లు సినిమా 8-9 రోజులు షూటింగ్ ఉంది. సినిమాకు సంబంధించి ప్రీ-విజువలైజేషన్ పని నడుస్తోంది. అది పూర్తయిన వెంటనే ఆ మూవీ షూట్ ముగుస్తుంది.” స్వయంగా పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.

8-9 రోజుల షూట్ అంటే మార్చి నెలాఖరుకు విడుదల చేయడం పెద్ద పని కాదు. అయినప్పటికీ సినిమాను వాయిదా వేశారంటే, ఇంతకంటే పెద్ద పని ఇంకేదో పెండింగ్ లో పడినట్టు అర్థం. లేదా రీషూట్స్ అయినా ప్లాన్ చేసి ఉండాలి.

కారణం ఏదైనా హరిహర వీరమల్లు వాయిదా పడిందనేది పక్కా. ఆ తేదీకి రాబిన్ హుడ్ రావడం అంతకంటే పక్కా.

2 Replies to “పవన్ సినిమా మళ్లీ వాయిదా?”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.