అలాఅనకుంటే.. ఉన్నవారూ వెళతారని భయం!

భారాస పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. కేసీఆర్ పార్టీకి సారథ్యం వహిస్తున్నారో లేదో తెలియని స్థితి.

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ మళ్లీ ఉప ఎన్నికలు పాట ఎత్తుకుంది. ఇల్లలకగానే పండగ అయినట్టే అనుకునే సామెతను ఆ పార్టీ ఆచరణలో ప్రజలకు చూపిస్తోంది. భారాస నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించడానికి భారాస నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కాగా, అక్కడ ఢల్లీలో హరీష్ రావు సారథ్యంలో పిటిషన్ వేసిన వెంటనే ఇక్కడ తెలంగాణలో బహిరంగ సభల్లో మాట్లాడుతూ.. “ఇదిగో పది ఎమ్మెల్యే సీట్లలో ఉపఎన్నికలు వచ్చేయబోతున్నాయి” అంటూ కేటీఆర్ ప్రారంభించేయడం గమనార్హం.

పార్టీని వీడిపోయిన నాయకుల గురించి అనర్హత పిటిషన్ వేయడానికి భారాసకు నైతిక అర్హత ఉన్నదా? అనేది కొందరి అనుమానం. ఏది ఏమైనప్పటికీ.. హైకోర్టులో సుదీర్ఘ కాలం వారు కేసు నడిపారు. చివరికి ఈ విషయంలో నిర్ణయాన్ని పూర్తిగా స్పీకరు విచక్షణకు వదిలేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దాంతో అనివార్యంగా మిగిలిన ఏకైక మార్గాన్ని భారాస ఆశ్రయించింది. ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్, మిగిలిన ఏడుగురి మీద రిట్ పిటిషన్ వేశారు.

సుప్రీంలో పిటిషన్ వేసీ వేయకముందే, అంత ఉధృతంగా అప్పుడే ఉపఎన్నికల పాట ఎత్తుకోవడం వెనుక మర్మం ఏమిటి? అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఉప ఎన్నికలు వస్తున్నాయని.. తమ పార్టీ బలం పెరగబోతున్నదని.. ప్రచారం చేసుకోకపోతే గనుక.. భారాసలో ఇప్పుడు మిగిలి ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా కొందరు అధికార కాంగ్రెసులో చేరిపోయే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. అందుకోసమే భారాస నాయకులు, కేటీఆర్ తాపత్రయపడుతున్నారని అంటున్నారు.

భారాస పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. కేసీఆర్ పార్టీకి సారథ్యం వహిస్తున్నారో లేదో తెలియని స్థితి. మొత్తం కేటీఆర్ అన్నీ తానే అయి నడిపిస్తున్నారు. ఫార్ములా ఈ కేసు విచారణ ముందుకు వెళుతున్న కొద్దీ.. కేటీఆర్ అరెస్టు తప్పదనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. ఒకసారి అరెస్టు అయిన తర్వాత.. పార్టీ ప్రాభవం ఎలా ఉంటుందో అనే అనుమానం పలువురికి ఉంది.

ఇవేమీ ఉద్యమాలు, పోరాటాలకు సంబంధించిన కేసులు కాదు. అవినీతి కేసు. బెయిలు మీద బయటకు వచ్చినా సరే.. ప్రజలు ఆ నాయకులు చిత్తశుద్ధిని ఎంత నమ్ముతారనేది అందరికీ అనుమానం. అసలే కవిత కూడా ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ సన్నగిల్లుతుందనే అనుమానం ఉంది. ఇలాంటి భయాలతో పార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా జారుకుంటారని నాయకత్వం భయపడుతోంది. అందుకే ఉప ఎన్నికలు పదంతో ఊదరగొడుతోందని, అలా ఎన్నికలు వస్తే.. అన్ని సీట్లను మళ్లీ గెలుచుకుంటే.. పార్టీకి కాస్త ధైర్యం వస్తుందని కోరుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు.

6 Replies to “అలాఅనకుంటే.. ఉన్నవారూ వెళతారని భయం!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. మా అన్నయ్య ముందే చెప్పాడు పదవికి రాజీనామా చేశాకే పార్టీ కండువా కప్పుతా అని మా అన్నయ్య నీతి నిజాయితీ అలాంటిది అంటున్న 🐑

Comments are closed.