కొన్ని రోజులుగా సద్దుమణిగిందనుకున్న ‘మంచు’ వివాదం, కనుమ నుంచి కాక రేపుతోంది. మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న తన తాత, నాన్నమ్మ సమాధుల్ని దర్శించుకునేందుకు మంచు మనోజ్ ప్రయత్నించడంతో వివాదం మరోసారి తెరపైకొచ్చింది.
అలా తిరుపతిలో మరోసారి రాజుకున్న మంచు గొడవలు, ఇప్పుడు మరోసారి హైదరాబాద్ కు మారాయి. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని.. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు ఇప్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్ పల్లిలోని తన నివాసం నుంచి మంచు మనోజ్ ను వెల్లగొట్టడం ఈ ఫిర్యాదు వెనక ఉద్దేశం.
ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్, అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. సదరు నివాసం మోహన్ బాబుదే అని గుర్తించిన కలెక్టర్, మంచు మనోజ్ కు నోటీసులు జారీచేశారు. దీనిపై చర్చించేందుకు కలెక్టర్ ఆఫీస్ కు వచ్చాడు మనోజ్. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కలిసి వివరాలు తెలుసుకున్నాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు, తన అనుమానాల్ని కూడా నివృత్తి చేసుకున్నాడు.
బయటకొచ్చిన మనోజ్, మీడియాతో మాట్లాడాడు. “నాన్నగారిని నేను ఎప్పుడూ వ్యతిరేకించను. కేవలం నా అన్న, నాన్నను ముందుకుతోసి, వెనక నుంచి ఆడుతున్న నాటకం ఇది.” అంటూ ఆరోపించాడు. నివాసం ఖాళీ చేయమని కలెక్టర్ ఇచ్చిన నోటీసులపై లిఖితపూర్వకంగా స్పందిస్తానని, దాన్ని మీడియాకు కూడా విడుదల చేస్తానని అన్నాడు.
కొన్ని రోజులుగా మోహన్ బాబు, మంచు విష్ణు తిరుపతిలో ఉంటున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగంణంలో ఉంటూ, అక్కడే సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. జల్ పల్ నివాసం నుంచి మంచు మనోజ్ ఖాళీ చేసిన తర్వాతే మోహన్ బాబు తిరిగి అందులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ నివాసం మోహన్ బాబు పేరిట ఉంది కాబట్టి, చట్టప్రకారం ఆ నివాసాన్ని ఖాళీ చేయాల్సిందేనంటూ కలెక్టర్, మంచు మనోజ్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు ట్విట్టర్ లో మంచు విష్ణుకు పరోక్షంగా సవాల్ విసిరాడు మనోజ్. విస్మిత్ హ్యాష్ ట్యాగ్ తో విమర్శలు చేస్తున్న మనోజ్, మగాడిలా ప్రవర్తించాలని, దమ్ముంటే ముఖాముఖి చర్చలకు రమ్మని పిలిచాడు. తండ్రిని, స్టాఫ్ ను, మహిళల్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడొద్దని గట్టిగా చీవాట్లు పెట్టాడు.
endiraa ayya ee racha
నిజంగానే సిగ్గు లేని జన్మ. నీది కానీ ఆస్తి కోసం ఎందుకు రా ఈ ఏడుపు.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
వీరెవరండీ బాబూ
మోహన్ బాబు సినిమా టైటిల్ ఈ రకంగా సూట్ అయింది
ఎన్టీఆర్ ఆస్తులు -> లక్ష్మి పార్వతి నొక్కేసింది -> మోహన్ బాబు కి దాయమని చెప్పి ఇచ్చింది ->
ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మి పార్వతి కి పవర్ పోయేసరికి మోహన్ బాబు ఆ ఆస్తులు తానే తీసుకుని తాను వ్యాపారాలు మొదలు పెట్టారు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో లో టాక్. కానీ అబద్ధం.
Every one knows who invaded ntr assets
NTR ఆస్తులే కాదు. సౌందర్య ఆస్తులు, దాసరి ఆస్తులు కాజేశాడు అని చిరంజీవి అభిమానుల ప్రచారం. చిత్తూరు జిల్లా లో వేల ఎకరాలు జగన్ అండ తో ఆక్రమించాడు. మంచు మనోజ్ మంచివాడు. అతనికి అన్యాయం జరిగి పోతోంది. చిరంజీవి కి లెజెండ్ అవార్డు తప్పు అన్న మోహన్ బాబు మనిషే కాదు.
Tollywood lo Manchu Bali gadi families tho manchi entertainment
Eppudaithe button gaadini follow avvatam modalupettaado ah chuthiya vismith gaadu appatinunche magadila matladatam manesi button gaadi buddhulu tecchukunnaadu
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ఎన్ని మలుపులు తీసుకొని వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నా కన్నప్ప సినిమా చూడాలన్న ఆసక్తి ప్రేక్షకులకు కలగడం లేదు, ఇక ముందు కలగక పోవచ్చు కూడా