మింగలేక.. కక్కలేక.. బాలకృష్ణ

నిజంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే సినిమా ఉంటే బాలయ్య వెంటనే ఆ విషయాన్ని అక్కడే చెప్పేసేవారు.

కొడుకు మోక్షజ్ఞను గ్రాండ్ గా పరిశ్రమకు పరిచయం చేయాలనుకున్న బాలకృష్ణ ఆశలకు ఆదిలోనే స్పీడ్ బ్రేకర్ పడింది. ఆర్భాటంగా ప్రకటన ఇచ్చి, లుక్ కూడా రిలీజ్ చేసి, సరిగ్గా ముహూర్తం షాట్ కు వచ్చేసరికి మూవీ ఆగిపోయింది.

కారణాలేంటనేది ఎవ్వరికీ తెలియవు. కొందరేమో సినిమా పూర్తిగా ఆగిపోయిందంటారు. మరికొందరేమో, మార్పుచేర్పులతో మళ్లీ సెట్స్ పైకి వస్తుందంటారు. కొడుకు ఆరోగ్యం బాగాలేదని ఇటు బాలకృష్ణ, మోక్ష్ సినిమాపై వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ అటు ఎస్ఎల్వీ సినిమాస్ ప్రకటనలు ఇచ్చినప్పటికీ, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు డెబ్యూ ఉండకపోవచ్చని చాలామంది ఓ అంచనాకు వచ్చేశారు.

ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల ఆలోచనల నుంచి పక్కకు తప్పుకుంటున్న ఈ మేటర్ ను మరోసారి రామ్ చరణ్ తెరపైకి తెచ్చాడు.

చరణ్ తో బాలకృష్ణ చిట్ చాట్ కార్యక్రమం పెట్టిన సంగతి తెలిసిందే. అందులో పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్ డెబ్యూ గురించి అడిగారు బాలయ్య. దానిపై పెద్దగా స్పందించని చరణ్, ఆ వెంటనే మోక్ష్ డెబ్యూ ఎప్పుడంటూ రివర్స్ లో బాలయ్యను ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు బాలకృష్ణ ఫేస్ ఫీలింగ్స్ మారిపోయాయి. నవ్వుతూనే ‘అతి త్వరలో’ అనేశారు. నిజంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే సినిమా ఉంటే బాలయ్య వెంటనే ఆ విషయాన్ని అక్కడే చెప్పేసేవారు. ‘కొత్త ముహూర్తం’ అంటూ టాపిక్ ను కొనసాగించేవారు.

కానీ బాలకృష్ణ సమాధానం చూస్తుంటే, మోక్ష్ డెబ్యూ మళ్లీ మొదటికొచ్చినట్టుంది. ఈసారి దర్శకుడు ఎవరో..?

14 Replies to “మింగలేక.. కక్కలేక.. బాలకృష్ణ”

  1. అదేమైనా లైవ్ ప్రోగ్రామా ..?

    రెండు వారాల క్రితం రికార్డు చేసి పెట్టుకొన్నారు..

    ఆ ప్రశ్న ఇబ్బంది కలిగించేదే అయితే.. ఎడిట్ లో లేపేయడం నిమిషం పని..

    ఈ మాత్రం దానికి మింగేసి కక్కేయడం దేనికి..? బుర్ర తక్కువ రాతలు..

    ..

    అయినా రామ్ చరణ్ కి ఆ సినిమా స్టేటస్ తెలియక అడిగాడు అనుకొంటున్నారా..?

    టాలీవుడ్ హీరోల్లో రామ్ చరణ్ ఎక్కడ ఎలా ఎంతవరకు మాట్లాడాలో ఖచ్చితం గా తూకం వేసుకుని మాట్లాడగలిగే సామర్ధ్యం ఉన్న ఒకే ఒక్క హీరో.. రామ్ చరణ్..

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. ఎదొ బొడి గుండుకి మొకాలుకి లింక్ చెసి ఇలా రాసి ఎడవటం లొ మా GA గాడికి .. అదొ తుత్తి!

  4. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.