తాము కేవలం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లే కాదు, యాక్షన్ థ్రిల్లర్లు కూడా తీయగలమని మలయాళీలు కొత్తగా నిరూపించుకోవాల్సిన పనిలేదు కానీ, యాక్షన్ పేరుతో రొటీన్ దార్లు తొక్కకుండా వెస్ట్రన్ స్టైల్ కు వెళ్లి లైటర్ వెయిన్ లో ఒక ఆసక్తిదాయకమైన సినిమాతో రావడం విశేషం. కొంతకాలం కిందట థియేటరికల్ రిలీజ్ పొందిన మలయాళీ సినిమా రైఫిల్ క్లబ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.
డార్క్ కామెడీ థ్రిల్లర్ తరహాలో సాగే ఈ సినిమా వీకెండ్ లో ఓటీటీలో వీక్షించడానికి తగిన సినిమాగా నిలుస్తోంది. ఓటీటీ సూపర్ హిట్ సినిమాలతో అందరికీ పరిచయం ఉన్న మలయాళీ తారలే ఈ సినిమాలో కనిపిస్తారు. దిలీష్ పోతన్, దర్శనా రాజేంద్రన్, విజయరాఘవన్ వంటి వారితో పాటు తెలుగు వారికి సుపరిచితమైన వాణీ విశ్వనాథ్ ఒక ఆసక్తిదాయకమైన పాత్రలో అగుపిస్తుంది. వీరికి తోడు బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కు తనదైన శైలికి తగినట్టుగా ఆయుధ డీలర్ గా మంచి రోల్ దొరికింది.
చాలా సింపుల్ కథతో మంచి యాక్షన్ సినిమాను తీసినందుకు మలయాళీలను అభినందించవచ్చు. యాక్షన్ సినిమా అంటే ఒక పవర్ ప్యాక్డ్ హీరో, ట్విస్టులు, ఐటమ్ సాంగ్స్ ఇలా కాదు, తెరపై కనిపించే ప్రతిపాత్రకూ తగినంత ప్రాధాన్యతను ఇస్తూ ఒక ఫ్యామిలీ ప్యాక్ తో కూడా యాక్షన్ సినిమా ఎలా తీయొచ్చు రైఫిల్ క్లబ్ చూపిస్తుంది. హాలీవుడ్ లో వచ్చే వెస్ట్రన్ స్టైల్ సినిమా ఇది. దీన్ని ఒప్పుకోవడానిక కూడా రూపకర్తలు సినిమాలోనే మొహమాటపడలేదు. వెస్ట్రన్ స్టైల్ తో కథ, కథనంతో సాగి మెక్సికన్ స్టాండప్ తో సినిమా ముగస్తుంది.
వాస్తవానికి మన దగ్గర గన్ కల్చర్, రైఫిల్ క్లబ్ లు వంటివి ఉండవు. అయితే పూర్తిగా కల్పిత కథే అయినా, వెస్ట్రన్ ఘాట్స్ లో ఉండిన ఒక రైఫిల్ క్లబ్ అని 90లలో సాగే కథగా సినిమాను తీశారు. సింపుల్ థ్రెడ్ లాంటి కథ ఇంట్రడక్షన్ కు కాస్త సమయం తీసుకున్నా, రైఫిల్ క్లబ్ లోని సభ్యుల ఇంట్రడక్షన్ అంతా సరదాగా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా, ఇండియనైజ్ చేసిన ఒక వెస్ట్రన్ మూవీని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. రైఫిల్ ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ చూడచక్కగా ఉంటుంది.
ఇలాంటి సినిమాను తీయడానికి మన తెలుగు దర్శకరత్నాలైతే ఎంత సమయం తీసుకుంటారో కానీ, అసలు తెలుగు వారు ఇలాంటి సినిమా ఒకటి తీయగలరని కూడా ఇప్పుడప్పుడే ఆశించలేం. మన దగ్గర సంక్రాంతి పండగ సినిమాలు అని, దసరా పండగ సినిమాలు అని, వాటికో ఫార్మాట్ అని, అవి అలానే ఉండాలని దర్శకనిర్మాతలు తీర్మానించేసుకోవడంతో పాటు, ఆ వెకిలి కామెడీలనే ఫ్యామిలీ సినిమాలుగా వీక్షిస్తూ రాజీ పడిపోతున్నారు తెలుగు ప్రేక్షకగణం. ఇలాంటి పరిస్థితుల్లో రైఫిల్ క్లబ్ లను, సూక్ష్మదర్శినిలను మనం ఎక్కడ తీయగలం!
Well said
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Thuuuuu……
…
Okavela theesina.. Nuvvu untaavu kadhaa vaatini champeyyadaniki Nee Modd***a lo Review la tho..
Kadhaa??
ఇంతకు ముందు ఆరవ పైత్యం అనే వాళ్ళు ఇప్పుడు మలయాళీ పైత్యం అని అనాల్సివస్తుందేమో
ఒకప్పుడు చాలా మంచి సినిమాలు తీసిన మల్లువుడ్ ఇప్పుడు నాసిరకం సినిమాలు తెలుగు వాళ్ళ మీద వదిలి ఈ సినిమాలంటేనే వెగటు పుట్టేలా చేస్తున్నారు
వాళ్ళు గొప్ప మిస్టరీ సినిమాలు తీస్తున్నామని భ్రమలో ఉంది తలనొప్పి కలిగించే సినిమాలు తీసే ఫ్యాక్టరీలుగా మారిపోయారు…
అలాంటి వాటిలో నేను చూసిన కొన్ని:
కిష్కింధ కాండం, Rorschach, తలవన్, గోళం, Anweshippin Kandethum , పెంగ్విన్
Substandard Malayali action movie.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ