రేఖాచిత్రం: ఆల్ట్ర‌నేటివ్ హిస్ట‌రీతో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ!

ఒక‌వైపు ఓటీటీలో సూక్ష్మ‌ద‌ర్శిని అనే మ‌ల‌యాళీ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ డ్రామా వ్యూస్ తో దూసుకుపోతూ ఉండ‌గా, థియేట‌ర్ల‌లో ఇంకో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ఆస‌క్తిని రేపుతూ ఉంది.

ఒక‌వైపు ఓటీటీలో సూక్ష్మ‌ద‌ర్శిని అనే మ‌ల‌యాళీ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ డ్రామా వ్యూస్ తో దూసుకుపోతూ ఉండ‌గా, థియేట‌ర్ల‌లో ఇంకో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ఆస‌క్తిని రేపుతూ ఉంది. జ‌న‌వ‌రి రెండో వారంలో విడుద‌లైన ఆ సినిమా పేరు ‘రేఖాచిత్రం’. ఇది కూడా స‌గ‌టు మ‌ల‌యాళీ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ డ్రామానే కానీ, క‌థ‌ను చెప్పే ఎత్తుగ‌డ‌కు ఆల్ట్ర‌నేటివ్ హిస్ట‌రీని క్రియేట్ చేసుకోవ‌డం, ఆ క‌థ‌లో భాగంగా మ‌రో సినిమా ప్ర‌స్తావ‌న‌ను క‌లిగి ఉండ‌టం ఆస‌క్తిదాయ‌కం. ప్ర‌త్యేకించి మ‌ల‌యాళీ సినిమా ల‌వ‌ర్స్ ను ఎంగేజ్ చేస్తుంది ఆ ఆల్ట్ర‌నేటివ్ హిస్ట‌రీ.

ఒక అడ‌విలోకి వెళ్లి ఫేస్ బుక్ లో లైవ్ ఇస్తూ త‌న‌ను తాను గ‌న్ తో షూట్ చేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు ఒక వ్య‌క్తి. చ‌నిపోయే ముందు జీవితంలో త‌ను ఎవ‌రికీ ప‌ట్ట‌కుండా పోయాన‌ని, అందుకు కార‌ణం త‌ను చేసిన పాపాలే అంటాడు. త‌ను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి వ‌చ్చిన ఆ చెట్టు కింద‌నే న‌ల‌భై యేళ్ల కింద‌ట ఒక అమ్మాయిని పాతి పెట్టామ‌ని, ఆమె ఎవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని, త‌న‌తో పాటు ఆమెను గోతిలో క‌ప్పి పెట్టిన మ‌రొక‌రి పేరును చెప్పి, ఇంకో ఇద్ద‌రి పేర్ల‌ను దాచి పెట్టి అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోతాడు.

అప్ప‌టికే ఆన్ లైన్ ర‌మ్మీ ఆడుతూ దొరికిపోయి స‌స్పెండ్ అయిన ఒక పోలీసాఫీస‌ర్ కు ఆ ప్రాంతంలో పోస్టింగ్ దొరికి ఉంటుంది. ఈ కేసు విచార‌ణ‌ను మొద‌లుపెట్టిన అత‌డు ఆ చెట్టు చుట్టూ త‌వ్వ‌గా ఒక మ‌హిళ ఎముక‌లు దొరుకుతాయి. ఆమె ఎవ‌రు? అనేది త‌నకు కూడా తెలియ‌ద‌ని, కేవ‌లం ఆమెను పూడ్చిపెట్ట‌డంలోనే త‌ను భాగం అయ్యాన‌ని, ఆమె కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న‌ప్పుడు తాము ఆమెనుపూడ్చిపెట్టామంటూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న వ్య‌క్తి చెప్పి ఉంటాడు. అలాగే అందులో భాగ‌స్వామి అయిన వ్య‌క్తుల్లో ఒక‌రు ప్ర‌స్తుతం ఒక పెద్ద గోల్డ్ షాప్ య‌జ‌మాని అని కూడా చెప్పి ఉంటాడు. దీంతో ఈ కేసుపై అంద‌రి ఆస‌క్తి నెల‌కొంటుంది. స‌ద‌రు ధ‌నికుడు కూడా ఇన్వెస్టిగేష‌న్ త‌న వ‌ర‌కూ రాకుండా ఉండేందుకు లోపాయికారీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తాడు.

రొటీన్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలా సాగే ఈ క‌థ‌కు, ఒక పాత సినిమాకూ ముడిప‌డుతుంది విచార‌ణ‌లో. 1985లో వ‌చ్చిన మ‌మ్ముట్టీ సినిమా ‘కాతోడు కాతోరం’ సినిమా షూటింగ్ కూ, ఆ ఈ హ‌త్య‌కూ సంబంధం ఉన్న‌ట్టుగా తేలుతుంది. ఆ సినిమాకూ ఈ హ‌త్య‌కూ సంబంధం ఏమిటి? ఆమె ఎవ‌రు? అనేది చాలా సేపు సాగే మిగ‌తా సినిమా.

మామూలుగా తీసి ఉంటే ఇది కూడా ఒక మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ అయ్యేది. అయితే ఆ మ‌ర్డ‌ర్ ను ఆల్ట్ర‌నేటివ్ హిస్ట‌రీ చుట్టూ తిప్ప‌డం అద‌న‌పు ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ప్ర‌త్యేకించి మ‌ల‌యాళీల‌కు ఆ క్లాసిక్ సినిమా తో ఈ సినిమా క‌థ‌ను ముడిపెట్ట‌డం అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఆ సినిమా షూటింగ్ ను రీ క్రియేట్ చేశారు ఈ సినిమా కోసం. లేటెస్ట్ టెక్నాల‌జీతో అప్ప‌టి మ‌మ్ముట్టీని చూపిస్తారు. ‘కాతోడు కాతోరం’ సినిమా తో ఈ సినిమా స్క్రిప్ట్ కు వేసిన ముడి స‌రిగా ప‌డ‌టంతో బోలెడంత క్యూరియాసిటీ జ‌న‌రేట్ అవ‌తుంది.

కాతోడు కాతోరం సినిమా తెలుగు వాళ్ల‌కు సంబంధం లేనిదే అయినా, చూడ‌టానికి అయితే ఆస‌క్తిదాయ‌కంగా ఉంటుంది. కాతోడు కాతోరం సినిమాలో స‌రిత న‌టించింది. అందులో పాట‌లు ఇన్ స్టాగ్ర‌మ్ రీల్స్ లో వైర‌ల్ అవుతూ ఉంటాయి. ఇన్ స్టా రీల్స్ లో అన్ని భాష‌ల పాట‌లూ, అంద‌రికీ రీచ్ అవుతున్నాయి కాబ‌ట్టి.. ఆ సినిమాలోని ‘పూ మాన‌మే..’ అనే రీమిక్స్ పాట ఒక‌టి ఆ మ‌ధ్య ట్రెండ్ అయ్యింది.

ఆల్ట‌ర్నేటివ్ హిస్ట‌రీని ఇది వ‌ర‌కూ అనేక సినిమాల్లో వాడుకున్నారు, ప్ర‌త్యేకించి హాలీవుడ్ లో. అయితే ఒక మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ క‌థాంశానికి ఇలాంటి స్క్రిప్ట్ రాసుకోవ‌డం ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌య‌త్నం అని చెప్పొచ్చు.

6 Replies to “రేఖాచిత్రం: ఆల్ట్ర‌నేటివ్ హిస్ట‌రీతో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ఇంతకు ముందు ఆరవ పైత్యం అనే వాళ్ళు ఇప్పుడు మలయాళీ పైత్యం అని అనాల్సివస్తుందేమో

    ఒకప్పుడు చాలా మంచి సినిమాలు తీసిన మల్లువుడ్ ఇప్పుడు నాసిరకం సినిమాలు తెలుగు వాళ్ళ మీద వదిలి ఈ సినిమాలంటేనే వెగటు పుట్టేలా చేస్తున్నారు

    వాళ్ళు గొప్ప మిస్టరీ సినిమాలు తీస్తున్నామని భ్రమలో ఉంది తలనొప్పి కలిగించే సినిమాలు తీసే ఫ్యాక్టరీలుగా మారిపోయారు…

    అలాంటి వాటిలో నేను చూసిన కొన్ని:

    కిష్కింధ కాండం, Rorschach, తలవన్, గోళం, Anweshippin Kandethum , పెంగ్విన్

    1. కిష్కింధ కాండం, పెంగ్విన్, Anweshippin Kandethum sollu cinemalu, boring,

      Inthakante Agent sai srinivas Athreya chala chala better…

  3. కిష్కింధ కాండం, పెంగ్విన్, Anweshippin Kandethum sollu cinemalu, boring,

    Inthakante Agent sai srinivas Athreya chala chala better…

  4. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.