సినిమా దర్శకులు పలు రకాలు.. కొందరు
భారీ సినిమాలు చేస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో సీన్లు ఎత్తుకొస్తుంటారు. అవి కనుక్కునేసరికి సినిమాలు విడుదలై సక్సెస్ కొట్టేస్తుంటాయి. మూలాలు బయటకు వచ్చినా మేధావుల్లా మౌనంగా వుంటారు. విమర్శలకు సమాధానాలు ఇవ్వరు. ఇలాంటి వాళ్లు ఒక్కరు అని కాదు అందరూ ఎక్కువగా గెడ్డం పెంచుతుంటారు. మేధావితనానికి అది ఓ చిహ్నం.
మరి కొందరు
సినిమా ఎలా తీసినా కొందరు ఇండస్ట్రీకి నచ్చేస్తారు. డిజాస్టర్లు ఇస్తున్నా, ఎవరో ఒకరు సినిమా ఇస్తూనే వుంటారు. కోట్లు నష్టపోతూనే వుంటారు. ఇలాంటి వాళ్లు సర్కిల్ మెయింటెయిన్ చేస్తారు. కబుర్లు బాగా చెబుతారు. అలా కాలక్షేపం అయిపోతూ వుంటుంది. కబుర్లు ఎక్కువ.. పనితీరు తక్కువ టైపు.
ఇంకొందరు వుంటారు. వరుసగా హిట్ లు కొడుతుంటారు. కానీ అలాంటి వాళ్లను చాలా మంది తేలికగా చూస్తుంటారు. అదో సినిమానా? అతగాడో డైరెక్టరా అన్నట్లు కళ్లతో మాట్లాడేస్తారు. సోషల్ మీడియా మొనగాళ్లు కూడా క్రింజ్ డైరక్టర్ అనే ముద్ర వేసి సరదా పడుతుంటారు.
ఈ కోవలోకి వస్తారు అనిల్ రావిపూడి. అసలు అనిల్ రావిపూడి చేసిన సినిమాలేంటీ?
పటాస్.. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సినిమా. తరువాత సినిమా సుప్రీమ్. ఇది కూడా మాస్ యాక్షన్ సినిమా. రాజా ది గ్రేట్.. ఆల్ టైమ్ యాక్షన్ ఎంటర్ టైనర్.
ఈ మూడు సినిమాల విషయంలో ఫన్ కు కానీ, మాస్ ఎలిమెంట్స్ కు కానీ అస్సలు లోటు వుండదు. తరువాత వచ్చిన సినిమా ఎఫ్ 2. ఈ సినిమా ఫ్యామిలీ కామెడీ. అది కూడా క్లీన్ కామెడీ. అంతేగా.. అంతేగా… ఎంతుంటే అంత.. ఇలా రకరకాల క్యాచీ పదాలతో అతి పెద్ద హిట్ అయి కూర్చుంది.
అంటే నాలుగు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లు. ఎంత మంది తెలుగు దర్శకులకు వుంది రికార్డు? సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆరు నెలల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా. సూపర్ హిట్. అక్కడా కామెడీ ఎక్కడా తగ్గలేదు. పైగా ఎమోషన్ యాడ్ అయింది.
తరువాత ఎఫ్ 3. ఇక్కడ కొంచెం కామెడీ విషయంలో డివైడ్ టాక్ వచ్చింది. నచ్చిన వారు నవ్వారు. నచ్చని వారు క్రింజ్ అన్నారు. కానీ సినిమా సూపర్ హిట్. అయితే ఒకే దర్శకుడి ఖాతాలో వరుసగా ఆరో హిట్.
తన ట్రాక్ మార్చాలనుకున్నారు అనిల్ రావిపూడి. భగవంత్ కేసరి. ఆడపిల్లలను షేర్ లెక్క పెంచాలనే మెసేజ్ టచ్ చేస్తూ వెళ్లారు. కిట్టని వాళ్లు మాట్లాడే క్రింజ్ కు చోటే లేదు. సినిమా హిట్. అంటే ఏడో విజయం వరుసగా.
ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ ఫాస్ట్ గా తీయడం ఒక ఎత్తు. చిన్న చిన్న హీరోలతో సినిమాలు కూడా 30 కోట్లు అయిపోతుంటే వెంకటేష్ లాంటి హీరోతో 55 కోట్లతో సినిమాను లాంచ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా విడుదల ముందు మళ్లీ అదే మాట క్రింజ్..అంటూ. పబ్లిసిటీ చూసి అదే మాట.
కానీ ఇప్పుడు అదే జనాలు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. రికార్డులు బద్దలు కొడుతున్నారు. వందల కోట్ల ఖర్చు తో తీసిన సినిమాలు చేయలేని పనిని ఈ మిడ్ రేంజ్ సినిమా చేసింది. గమ్మత్తేమిటంటే ఏడు బ్యాక్ టు బ్యాక్ హిట్ లు తీసి, ఎనిమిదో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి రెమ్యూనిరేషన్ ఇంకా 15 కోట్ల దగ్గరే వుంది.
బోలెడు ఫ్లాపులు తీసి, ఒకటో అరా హిట్ కొట్టి, మాస్ డైరక్టర్లం అనిపించుకున్న చాలా మంది రెమ్యూనిరేషన్ పరంగా అనిల్ రావిపూడిని దాటేసారు. ఖర్చు పెట్టించడంలో ఒకటికి మూడింతలు దాటేసారు. కానీ వాళ్లందరికీ మాస్ డైరక్టర్లుగా కితాబులు. అనిల్ అంటే మాత్రం ఎందుకో ఇంకా చిన్న చూపు కొందరికి.
కానీ ఇప్పుడు ఇక మారుతుంది. మారాలి. సినిమా కమర్షియల్ మీటర్ ఒడిసి పట్టిన దర్శకుడు. కళ్యాణ్ రామ్ నుంచి రవితేజ మీదుగా మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి ప్రతి ఒక్కరికీ బ్లాక్ బస్టర్లు ఇస్తూ వెళ్తున్నారు. మెగాస్టార్ తో జత కట్టబోతున్నారు. మరో హిట్ ఖాతాలో వేసుకుంటే
నవరత్నాల్లాంటి తొమ్మిది వరుస హిట్ లు ఇచ్చిన ఏకైక తెలుగు దర్శకుడిగా చరిత్రకు ఎక్కుతారు.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
“నవరత్నాలు” అనే word use చేశావంటే..మా “నవరంద్రం రెడ్డి” ని కుడిపించినట్టు, Next సినిమా
“పంగ నామాలే” (11). నాకు అది ఇష్టం లేదు
langa gadu nuvvu
neeku levaa randraalu kukkaaa
Ee Langa deenni kuda Jagan ki link pettesadu.
ఈ సారి మాత్రం నేటి జనులతో ఏకీభవించాలీ , వీడు నిజం గా cringe కాబట్టి…
All his movies except F3 including the movies that he said he wrote are copied from online sources (in some cases, print outs) and that are handed over to him by the production companies or those film hero managers itself. He knows that from his writing days. There is a team that works for him to “Copy” movie stories
Trinadha Rao nakkina also included in crinze list…
Rajamouli 10 varusa hits unnai,Dasari vi 1st 12 movies hits ani vinna.Vella tharvaths place lo Anil Ravipudi undachu
పటాస్ ఒక్కటే ఇతని మూవీల్లో చాలా నేచురల్ కామెడీ, మిగతావన్నీ forced comedy, కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం మూవీ కి కొంచెం బెటర్ వర్క్ చేశాడు, అక్కడ అక్కడ కొన్ని మెరుపులు కానీ చాలా చోట్ల ఈ మూవీలో కూడా forced comedy ఉంది
neeku F2 naccaleda?
త్తివిక్రమ్ నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను రైటింగ్స్ ఇప్పటికీ నవ్వు తెప్పిస్తాయి అలాంటి రైటింగ్ చూసేసిన టాలీవుడ్ కి, అంతా అతి హావ భావాలతో మిమ్మల్ని నవ్వించాం కాబట్టి నవ్వండి అనే కామెడీ ఆనదు, తన మొదటి సినిమా పటాస్ లో మంచి కామెడీ ఉంటుంది, గమనించండి.
Correct
ఇతను తక్కువ సమయం లో తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీయడం బాగా నచ్చింది. కానీ ఏటా ఒక్క సినిమా నే ఎందుకో.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
Good intelligent Director… Movie ni 70 rojullo theeyada mante 1980 ‘s Oka Krishna garitho , Oka ANR tho ,Oka NTR tho ne ayyedi.Ippudu Anil vallani gurthuku thesthunnadu.
అయిపోయే