మాస్ మహారాజా.. సూపర్ హీరో

సితార సంస్థలో మ్యాడ్, మ్యాడ్ 2 సినిమాలు అందించిన కళ్యాణ్ శంకర్ ఓ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో కూడిన లైన్‌ను ఫన్‌ బేస్డ్‌గా తయారు చేసి రవితేజకు చెప్పారు. అది ఆయనకు నచ్చేసింది.

సరైన హిట్ పడక చాలా రోజులు అవుతోంది మాస్ మహారాజా రవితేజకు. వరుసగా ఫ్లాపులు, నిర్మాతలకు కోట్లలో నష్టాలు. ఇప్పుడు లేటెస్ట్‌గా మాస్ జాతర అనే సినిమా సితార సంస్థలో చేస్తున్నారు. ఈ సినిమాతో రచయిత భాను దర్శకుడిగా మారుతున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది ఈ సినిమా.

సాధారణంగా ఏ హీరో అయినా, దర్శకుడు అయినా సితార సంస్థలోకి వస్తే వరుసగా సినిమాలు చేసేయడం ఆనవాయితీ. ఇప్పుడు ఈ ఆనవాయితీ రవితేజతో కూడా కొనసాగుతోంది.

సితార సంస్థలో మ్యాడ్, మ్యాడ్ 2 సినిమాలు అందించిన కళ్యాణ్ శంకర్ ఓ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో కూడిన లైన్‌ను ఫన్‌ బేస్డ్‌గా తయారు చేసి రవితేజకు చెప్పారు. అది ఆయనకు నచ్చేసింది. మాస్ జాతర తర్వాత సినిమాగా అదే తెరకెక్కబోతోంది. సూపర్ హీరో క్యారెక్టర్‌ను తీసుకుని ఎంటర్‌టైన్‌మెంట్ వేలో కథ చెప్పే ప్రయత్నం చేయనున్నారు.

కళ్యాణ్ చేస్తున్న మ్యాడ్ 2 మార్చి నెలాఖరులో విడుదలకు రెడీ అవుతోంది. మ్యాడ్ వన్ మంచి హిట్ కావడంతో మ్యాడ్ 2 మీద మంచి అంచనాలు ఉన్నాయి.

3 Replies to “మాస్ మహారాజా.. సూపర్ హీరో”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.