ఎన్టీఆర్‌కు ఆ రెండూ చాలు

కండిషన్ ఒక్కటే – పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎమోషన్ మూవీ తీసే కెపాసిటీ వున్నవారు కావాలి.

ఆర్ఆర్ఆర్ తరువాత దేవర సినిమా చేసారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కు ముందు ఇచ్చిన మాట. నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకున్నారు. కానీ పాన్ ఇండియా హీరోగా లైనప్ ముఖ్యం. అది ఎన్టీఆర్ అయినా మరే హీరో అయినా. ఆ లెక్కన చూసుకుంటే ప్రభాస్ తరువాత లైనప్ బాగున్నది ఎన్టీఆర్‌కే.

ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందని, హీరోతో సమానంగా ఉంటుందా లేదా? అన్న అనుమానాలు పక్కన పెడితే, బాలీవుడ్ మాస్ యాక్షన్ సినిమా చేయడం అన్నది చాలా ప్లస్. నార్త్ బెల్ట్‌లో బలంగా వేళ్లూనుకోవడానికి చాన్స్ ఉంటుంది.

తరువాత చేసే సినిమా ప్రశాంత్ నీల్ ది. సలార్, కేజీఎఫ్ డైరక్టర్ సినిమా అంటే ఎలా ఉంటుంది క్రేజ్ అన్నది అందరికీ తెలిసిందే. కచ్చితంగా ఎన్టీఆర్ మాస్ కెరీర్‌కు పనికి వచ్చే సినిమా అవుతుంది.

దాని తరువాత చేసే సినిమా నీల్సన్ ది. జైలర్ సినిమా, జైలర్ 2 సినిమాల ప్రోమో చూస్తేనే చాలు, ఎలాంటి మంచి ఛాయిస్ అన్నది క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలు అన్నింటితో 2026 వరకు గడచిపోతాయి.

ఈ లోగా సరైన ఆప్షన్ ఏదో ఒకటి పట్టుకోగలగాలి. అది సుకుమార్ అయినా కావచ్చు. లేదా ఇంకెవరైనా కావచ్చు. కానీ కండిషన్ ఒక్కటే – పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎమోషన్ మూవీ తీసే కెపాసిటీ వున్నవారు కావాలి.

ఈ టోటల్ ఎపిసోడ్‌లో వినిపించే ప్రశ్న ఒకటి ఉంది. దేవర 2 సంగతి ఏమిటి? ఆ ఒక్కటీ అడగొద్దు అనుకోవాలేమో? ఎందుకంటే ఈ ఏడాది అంతా ప్రశాంత్ నీల్ సినిమాతో సరిపోతుంది. 2026లో నీల్సన్ సినిమా. అందువల్ల దేవర 2 అనేది ఎప్పటికీ వార్తల్లోనే వుండిపోతుందేమో?

8 Replies to “ఎన్టీఆర్‌కు ఆ రెండూ చాలు”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

    1. Umdha ledha Nuv Cheppedhi Kadhuraa kalame chebthumdhi ,Poi Google Lo Chuskoo Unna young Hero’s lo Best Actor yevaroo!!Oskar winner Yevaroo!!Best dancer,single Take Actor!!evaro thelusuko mundhu!!

Comments are closed.