సాక్షికి ఎన్టీఆర్ వ‌ర్ధంతి యాడ్.. రెడ్డి గారి ఘ‌న‌త‌!

ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సాక్షి ప‌త్రిక‌లో ఒక యాడ్ క‌నిపించ‌డం విశేషం అయితే, అది కూడా ఫ‌స్ట్ పేజ్ లో ఫుల్ పేజీ లో ఈ యాడ్ రావ‌డం విశేషం.

ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సాక్షి ప‌త్రిక‌లో ఒక యాడ్ క‌నిపించ‌డం విశేషం అయితే, అది కూడా ఫ‌స్ట్ పేజ్ లో ఫుల్ పేజీ లో ఈ యాడ్ రావ‌డం విశేషం. ఇలాంటి ప్ర‌య‌త్నం చేసిన వ్య‌క్తి ఎవ‌ర‌నేది ఆరాతీయాల్సిన అవ‌స‌రం లేకుండా, అందులోనే ఫొటోల‌ను ప్ర‌చురించేశారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆయ‌న భార్య ఫొటొల‌తో ఈ యాడ్ అచ్చ‌య్యింది.

ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా తెలుగువారి ఆత్మ‌గౌర‌వం అంటూ రొటీన్ ప‌దాల‌తోనే ఈ యాడ్ అచ్చ‌వ్వ‌డానికి తోడు, తెలుగుదేశం పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం గురించి యాడ్ లో చెప్పుకురావ‌డం విశేషం.

నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో తెలుగుదేశం పార్టీ కోటి స‌భ్య‌త్వాల‌తో ఎన్టీఆర్ కు నివాళి ఘటిస్తోందంటూ ఇందులో పేర్కొన్నారు. స‌భ్య‌త్వ న‌మోదులో తెలుగుదేశం పార్టీ సాధించి వివిధ ఘ‌న‌త‌ల‌ను పేర్కొన్నారు. ఇదే యాడ్ ను త‌మ అనుకూల మీడియాలో ఇవ్వ‌డంలో వింత లేదు కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత ప‌త్రిక‌లో తెలుగుదేశం ఇలా ఫ‌స్ట్ టైమ్ ఫుల్ పేజీ యాడ్ ను ఇచ్చిన‌ట్టుగా ఉంది. ప‌త్రిక వ్యాపారంలో ఈ యాడ్ ను ప్ర‌చురించ‌డంపై కూడా సాక్షి మొహ‌మాట‌ప‌డిన‌ట్టుగా లేదు.

ఈ మొత్తం యాడ్ లో హైలెట్ అవుతున్న‌ది వేమిరెడ్డి ఫ్యామిలీ. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీల‌కంగానే ఉండి, ఇగో క్లాషెస్ తో పార్టీని వీడిన వేమిరెడ్డి ఇలా తెలుగుదేశం పార్టీ పై యాడ్ ద్వారా విధేయత‌ను చాటుకున్న‌ట్టున్నారు. వేరే తెలుగుదేశం నేత‌లు అయితే యాడ్ ను సాక్షి వ‌ర‌కూ తీసుకెళ్లే వారు కాదేమో, అయితే వేమిరెడ్డి రూటే వేరులాగుంది!

10 Replies to “సాక్షికి ఎన్టీఆర్ వ‌ర్ధంతి యాడ్.. రెడ్డి గారి ఘ‌న‌త‌!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు,

  3. జగన్ మోహన్ రెడ్డి: ప్రజలు తిరస్కరించిన నాయకుడు, కోర్టులనుండి తప్పించుకోవడమే లక్ష్యం

    జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం తుదిదశలో ఉంది. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను స్పష్టంగా తిరస్కరించారు, “మళ్లీ నువ్వు తలుపు తట్టవద్దు” అంటూ తేల్చిచెప్పారు. ప్రజలు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నారు—జగన్ తిరిగి అధికారంలోకి రావాలనుకోవడం రాష్ట్రాన్ని సేవించడానికే కాదని, తనపై ఉన్న కోర్టు కేసులనుంచి తప్పించుకోవడమే ప్రధాన లక్ష్యమని.

    ఆయన ప్రవేశపెట్టిన పథకాల సంగతేంటి? “అమ్మ ఒడి,” “రైతు భరోసా” అని పెద్ద పెద్ద పేర్లు పెట్టారు కానీ అవి కేవలం ఆడిటోరియంలో వినిపించే పెద్ద డైలాగుల్లా అయ్యాయి. అసలు అమలు అన్నదే లేకుండా, ప్రజలకు వాటి వల్ల ఉపయోగం లేదని స్పష్టమైంది. రైతులు, పేదలు, విద్యార్థులు జగన్ మీద నమ్మకంతో నిలబడ్డారు, కానీ ఇప్పుడు “ఆదుకోవాలి అనుకున్నవాడు మమ్మల్ని విసిగించాడు” అని అనుకోవడంలో తప్పులేదు.

    ఇంకా, మత రాజకీయాలు చెప్పుకోక తప్పదు. అన్ని మతాల ప్రజల కోసం పనిచేస్తానన్న ఆయన, మతాల మధ్య చీల్చడం, గోడలు కట్టడం, హిందూ దేవాలయాల్లో జోక్యం చేసుకోవడం వంటి చర్యలతో రాష్ట్రాన్ని మరింత కలకలం లోకి నెట్టాడు. ప్రజలు ఇప్పుడు ఆయన మతాలకు మించి ఓట్ల పట్ల ఉన్న ప్రాముఖ్యతను స్పష్టంగా గుర్తించారు.

    మరి పార్టీ పరిస్థితి? వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఇప్పుడు జగన్ నాయకత్వం చూసి “మేం ఇంకా ఈ పార్టీలో ఎందుకు ఉన్నాం?” అని ప్రశ్నిస్తున్నారు. ఆయన నేతృత్వం మేనేజ్‌మెంట్ కాదు, తన కోర్టు కేసుల రక్షణ కోసం తయారైన ప్రహసనమని తెలుసుకున్నారు.

    ప్రజలు తేల్చేశారు: జగన్ మోహన్ రెడ్డి అధికారానికి అనర్హుడు, తన లక్ష్యం ప్రజల కోసం పని చేయడం కాదు, తన తలపాలు కాపాడుకోవడం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ డ్రామాలకు చివరి పేజీ పెట్టి ముందుకు సాగుతున్నారు. జగన్ కేవలం చరిత్రలో ఒక తీయని గుణపాఠం మాత్రమే మిగిలిపోతాడు

Comments are closed.