ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఓ క‌లేనా?

తాత దివంగ‌త ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న వ‌స్తుంద‌ని మంత్రి నారా లోకేశ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

తాత దివంగ‌త ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న వ‌స్తుంద‌ని మంత్రి నారా లోకేశ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతి, జ‌యంతి సంద‌ర్భాల్లో సీఎం చంద్ర‌బాబునాయుడు, ఇత‌ర టీడీపీ ముఖ్య నాయ‌కులు మాట్లాడిన‌ప్పుడ‌ల్లా భార‌త‌ర‌త్న త‌ప్ప‌క వ‌స్తుంద‌ని అంటుంటారు. ఇప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ టీడీపీ భాగ‌స్వామిగా ఉన్న ఎన్డీఏ ప్ర‌భుత్వ‌మే వుంది.

2014 నుంచి దాదాపు నాలుగేళ్ల‌పాటు కేంద్రంలో బీజేపీతో క‌లిసి టీడీపీ అధికారాన్ని పంచుకున్న సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ దివంగ‌త ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న మాత్రం ద‌క్క‌డం లేదు. పైగా ఎన్టీఆర్ కుమార్తె ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఏపీ బీజేపీ చీఫ్ కూడా. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్‌కు కేవ‌లం డిమాండ్‌గానే భార‌త‌ర‌త్న‌గా మిగిలిపోతోంది.

ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ద‌క్క‌క‌పోవ‌డానికి కార‌కులెవ‌ర‌నేది అర్థం కాని ప్ర‌శ్న‌గా మిగిలింది. ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టిస్తే, భార్య‌గా నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి స్వీక‌రిస్తుంద‌నే ఏకైక కార‌ణంతోనే అడ్డుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందులో నిజానిజాల సంగ‌తేమో గానీ, ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ల‌బ్ధి పొందుతున్న‌దెవ‌రో అంద‌రికీ తెలుసు. అయిన‌ప్ప‌టికీ ఆ దివంగ‌త నేత‌కు భార‌త‌ర‌త్న కోసం చిత్త‌శుద్ధితో ప‌ని చేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌కు బ‌లం క‌లిగించేలా కొంత మంది నాయ‌కుల ప్ర‌వ‌ర్త‌న వుంది. దీంతో ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఓ క‌ల‌గా మిగిలింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

8 Replies to “ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఓ క‌లేనా?”

  1. ఏంటి ఇవ్వలేదా.. ? ఇచ్చేశారనుకున్నానే….ఓహ్ సారీ.. ఆ ముక్క చెప్పింది బాబోరు కదా… చెప్పిన లక్షా తొంబై వేల హామీల్లో ఇదొకటి..

  2. చంద్రిక చక్రాలు తిప్పే రోజుల్లోనే ఇప్పించలేక పోయింది.

    చంద్రికాని తిప్పేవాళ్లు ఉన్న రోజుల్లో ఇప్పించగలదా?

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. జగన్ మోహన్ రెడ్డి: రాజకీయ వేదిక మీద తలుపులు మూసుకున్న నాయకుడు

    జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం చివరి అంకంలోకి చేరుకుంది. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను స్పష్టంగా తిరస్కరించారు, “మీ డ్రామాలు ఇంక మాకు వద్దు” అంటూ తేల్చి చెప్పారు. ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు—జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని ఉన్న తాపత్రయం రాష్ట్ర సేవ కోసం కాదు, కోర్టు కేసుల నుండి తప్పించుకోవడానికే!

    ఆయన హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు, “అమ్మ ఒడి,” “రైతు భరోసా,” మొదలైనవన్నీ కేవలం పెద్ద పెద్ద వాగ్దానాలుగా మిగిలిపోయాయి. అసలు ఫలితాలు? జీరో! “మేము నమ్మిన జగన్ మాకు భరోసా ఇవ్వలేదు” అని రైతులు, పేదలు, విద్యార్థులు బాధపడుతున్నారు. ఇలా చూస్తుంటే, ఆయన హామీలు డ్రీమ్ ప్రాజెక్టులు కాదు, డ్రీమ్‌లో ఉండే ప్రాజెక్టులే అని చెప్పాలి.

    ఇంకా మత రాజకీయాలు? ఆడవాళ్లు చీరలు కొట్టు కొట్టుకుంటే జగన్ మతాల మధ్య గోడలు కట్టడంలో బిజీగా ఉన్నారు. హిందూ దేవాలయాల్లో జోక్యం చేసుకోవడం, క్రైస్తవ మిషనరీలకు ప్రోత్సాహం ఇవ్వడం—ఇలా ప్రజలను విభజించడం తప్ప, ఏకతానానికి ఏమాత్రం దోహదం కాలేదు. ప్రజలు తేల్చి చెప్పారు: “ఇలా మతాలను అడ్డం పెట్టుకుని ఓట్లు దోచుకోవడం ఇక పనికి రాదు.”

    మరి ఆయన పార్టీ పరిస్థితి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇప్పుడు జగన్ వెనకాల ఉన్నారు అంటే అది రాజకీయ భవిష్యత్తు గ్లోబల్ వార్మింగ్ కంటే ఫాస్ట్‌గా కూలిపోతుందనే భయం. “మేము ఇంకా జగన్‌తో ఎందుకు ఉన్నాం?” అని తల పట్టుకుంటున్నారు. నిజానికి, పార్టీ అంతా “తన కోర్టు కేసుల షీల్డ్‌గా మమ్మల్ని వాడుకుంటున్నాడు” అని బయటపడింది.

    ప్రజలు తేల్చేశారు: జగన్ ఇక రాజకీయంగా కనీసం నమ్మకం కూడా ఉండని నాయకుడు. కోర్టులనుండి తప్పించుకునేందుకు ప్రజల మీద డ్రామాలు ఆడినా, ఈసారి ప్రేక్షకులు ధన్యవాదాలు చెప్పి బయటికి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది, జగన్ డ్రామాలు లేకుండా. 🎭

  6. moderator పేరుతో ప్రతీదీ ఫిల్టర్ చేయటం కాదురా. ముందు ఈ ప్లేబాయ్ ఎవడో ప్రతి న్యూస్ కీ పెడుతున్నాడు. కింద చూడు. దేవుడి గురించి నీ దొంగ బాధలు సరే. నీ పరువు పూర్తిగా పోతుంది.

Comments are closed.