భ‌క్తుడికి వ‌రం ఇవ్వ‌రా లోకేశ్‌?

లోకేశ్‌పై ఇంత‌గా ప్ర‌శంస‌లు కురిపించే బుద్దా వెంక‌న్న‌కు ఇంత వ‌ర‌కూ నామినేటెడ్ ప‌ద‌వి ఎందుకు ల‌భించ‌లేదో అర్థంకాని ప్ర‌శ్న‌.

కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రి నారా లోకేశ్ సిఫార్సుల‌కు అధిక ప్రాధాన్యం. ఈ సంగ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. లోకేశ్‌తో స‌న్నిహితులైన వాళ్ల‌కు ప‌ద‌వుల్లో పెద్ద‌పీట ల‌భించింద‌నే చ‌ర్చ కూడా వుంది. సీఎం చంద్ర‌బాబుకు స‌న్నిహితులైన వాళ్ల‌కు కూడా లోకేశ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తేనే.. ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో లోకేశ్‌పై ప‌దేప‌దే ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న బుద్దా వెంక‌న్న‌కు ఇంకా ఎలాంటి ప‌ద‌వి ల‌భించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. గ‌తంలో ఆయ‌న ఎమ్మెల్యే సీటు కోసం ర‌క్తాన్ని కూడా చిందించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసిన నాయ‌కుడిగా బుద్దా వెంక‌న్న‌ను టీడీపీ ప్ర‌త్యేకంగా చూస్తోంది. అలాగే ఎవ‌రి మెప్పు కోసం బుద్దా వెంక‌న్న అలా విమ‌ర్శ‌లు చేశారో కూడా అంద‌రికీ తెలుసు.

తాజాగా మ‌రోసారి నారా లోకేశ్ మ‌న‌సు చూర‌గొనేలా బుద్దా మాట్లాడారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు వార‌సుడు చంద్ర‌బాబు అయితే, ఆయ‌న‌కు వార‌సుడు నారా లోకేశ్ అని అన్నారు. టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్ అయితే, బ‌తికించింది మాత్రం చంద్ర‌బాబే అన్నారాయ‌న‌. భ‌విష్య‌త్‌లో టీడీపీకి నారా లోకేశ్‌ నాయకత్వం వహిస్తారన్నారు.

లోకేశ్‌పై ఇంత‌గా ప్ర‌శంస‌లు కురిపించే బుద్దా వెంక‌న్న‌కు ఇంత వ‌ర‌కూ నామినేటెడ్ ప‌ద‌వి ఎందుకు ల‌భించ‌లేదో అర్థంకాని ప్ర‌శ్న‌. ఇప్ప‌టికైనా బుద్దా భ‌క్తిని గుర్తించి, లోకేశ్ క‌టాక్షించి, త‌గిన ప‌దవి ఇస్తారో లేదో చూడాలి.

4 Replies to “భ‌క్తుడికి వ‌రం ఇవ్వ‌రా లోకేశ్‌?”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. జగన్ మోహన్ రెడ్డి: ప్రజల చేత తిరస్కరించబడ్డాడు, కోర్టు కేసుల భయంతో అధికార పిచ్చితో పట్టు

    జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి సమాప్తం దగ్గరపడింది. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను తిరస్కరించారు, ఆయన పాలన పట్ల తమ అసహనాన్ని స్పష్టంగా ప్రకటించారు. ప్రజలు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నారు—జగన్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది రాష్ట్రానికి సేవ చేయడం కోసం కాదు, తనపై ఉన్న కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడానికే.

    ఆయన పాలన ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలిగించలేదు. “అమ్మ ఒడి” వంటి పథకాలు, “రైతు భరోసా” వంటి హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. అవినీతి, అసమర్థత, మరియు ప్రాధాన్యతా రాహిత్యం ఇవే ఆయన పాలనను నిర్వచిస్తున్నాయి. రైతులు, పేదలు, మరియు విద్యార్థులు జగన్ మోహన్ రెడ్డిపై విశ్వాసం పెట్టి తీవ్రంగా మోసపోయారు.

    మత రాజకీయాలు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించాయి. మత విభజన ద్వారా ఓట్లు సాధించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, హిందూ దేవాలయాలపై జోక్యం చేసుకోవడం వంటి చర్యలు ప్రజల మనసులో గాఢమైన అసంతృప్తిని మిగిల్చాయి. ప్రజలు ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నారు: జగన్ మతాలను కలుపుకోవడానికి కాదు, వాటిని వాడుకుని తన ప్రయోజనాలను రక్షించుకోవడానికి ప్రయత్నించారు.

    ఇక ఆయన పార్టీ విషయం చూస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోనే ఆయన పట్ల అసహనం స్పష్టమైంది. నాయకత్వంలో తన స్వార్ధపూరిత ధోరణి, అధికారం తన చేతుల్లోనే కేంద్రీకరించడం వంటి చర్యలు ఆయన పార్టీ సభ్యుల్ని కూడా దూరం చేస్తున్నాయి. ఆయనపై ఉన్న నమ్మకం ఆ పార్టీ సభ్యుల్లో కూడా తగ్గిపోయింది.

    జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా రాజకీయంగా ఒంటరిగా నిలబడ్డాడు. ప్రజలు, పార్టీ, మరియు ఆయన స్వంత కుటుంబం కూడా ఆయనపై విశ్వాసం కోల్పోయారు. కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడమే తన ప్రధాన లక్ష్యంగా చూసిన ఆయన, ప్రజల నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను తిరస్కరించారు, ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేదని స్పష్టంగా చెప్పేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలన ఇక చరిత్రలో ఒక అవగాహనగా మాత్రమే మిగిలిపోతుంది—అది నెరవేర్చని హామీలకు, అవినీతి పాలనకు ప్రతీకగా ఉంటుంది

Comments are closed.