ఈస్ట్ డీఎస్పీపై బ‌దిలీ వేటు!

త‌న స్టేష‌న్‌కు రెగ్యుల‌ర్ సీఐని నియ‌మించుకోకుండా, త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని నిఘా వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి నివేదించిన‌ట్టు తెలిసింది.

తిరుప‌తి తొక్కిస‌లాటకు పోలీసుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ప్ర‌ధాన లోప‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్ర‌ధానంగా తిరుప‌తి ఈస్ట్ డీఎస్పీ వెంక‌ట‌నారాయ‌ణ తీరుపై పోలీస్‌శాఖ‌లో తీవ్ర ఆరోప‌ణ‌లున్నాయి. తిరుప‌తిలో ముగ్గురు సీఐలు వుంటే, ఏ ఒక్క‌రితోనూ ఆయ‌న‌కు పొస‌గ‌ద‌నే మాట వినిపిస్తోంది. త‌న స్టేష‌న్‌కు రెగ్యుల‌ర్ సీఐని నియ‌మించుకోకుండా, త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని నిఘా వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి నివేదించిన‌ట్టు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి ఈస్ట్ డీఎస్పీపై ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు బ‌దిలీ వేటు వేసింది. డీజీపీ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆయ‌న్ను ఆదేశించారు. ఈయ‌న ప‌రిధిలోని డి.రామానాయుడు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఐదుగురు మృతి చెందారు. అయితే అ సెంట‌ర్ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు వ‌హించిన డీఎస్పీ ర‌మ‌ణ‌కుమార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. అలాగే విష్ణునివాసంలో కూడా ఒక భ‌క్తురాలు మృతి చెందారు. ఈ కేంద్రం కూడా ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోకే వ‌స్తుంది.

స‌స్పెన్ష‌న్‌కు గురైన ర‌మ‌ణ‌కుమార్ జ‌న‌సేన సానుభూతిప‌రుడు. పైగా బ‌లిజ సామాజిక వ‌ర్గం. త‌న ప‌రిధిలో దారుణాలు జ‌రిగినా, ఎలాంటి చ‌ర్య‌ల‌కు లోను కాని పోలీస్ అధికారిగా డీఎస్పీ వెంక‌ట‌నారాయ‌ణ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. దీనికి కార‌ణం… ఈయ‌న చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం కావ‌డ‌మే అని పోలీస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈస్ట్ డీఎస్పీ బ‌దిలీ కావ‌డం సంతోష‌మే అయినా, స‌స్పెండ్ చేయ‌క‌పోవ‌డాన్ని పోలీసు వ‌ర్గాలే త‌ప్పు ప‌డుతున్నాయి. త‌న కిందిస్థాయి అధికారులు, పోలీసుల‌తో స‌రైన స‌మ‌న్వ‌యం చేసుకోకుండా, కేవ‌లం ఆదాయంపై మాత్రం దృష్టి సారించార‌ని, ఇందుకు భ‌క్తులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న శాఖ‌కు చెందిన వాళ్లే ఆరోపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

5 Replies to “ఈస్ట్ డీఎస్పీపై బ‌దిలీ వేటు!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. జగన్ మోహన్ రెడ్డి: తన కోసం నడిపిన షోని ఆపేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ప్రజల చేత “ది ఎండ్” అంటూ ముగించబడింది. గత ఎన్నికల్లోనే ప్రజలు స్పష్టం చేసి చెప్పారు: “ఇదిగో నిన్ను మా సినిమాలో నుంచి కట్ చేసాం.” ఆయన గొప్పగా చెప్పిన “ప్రజా సేవ” స్క్రిప్ట్ ఇప్పటికీ బాక్సాఫీస్ ఫ్లాప్. అసలు ఆయన తిరిగి అధికారంలోకి రావాలనుకోవడం ప్రజల కోసం కాదు, కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడానికే అని అందరూ తెలిసిపోయారు.

    అమ్మ ఒడి? అర్థంలేని కథ. రైతు భరోసా? థియేటర్ లోనే కాదు, బయట కూడా వర్కౌట్ కాలేదు. మతాలను కలుపుతానని చెప్పి, మతాల మధ్య గోడలే నిర్మించాడన్నది ప్రజలకు తెలుసు. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో వేసిన ఆయన ప్రయత్నాల గురించి చెబితే, అది మతాల్లో ఏకతానం కంటే కొత్త వివాదాలకే దారితీసింది.

    మరి పార్టీ సంగతి? పార్టీ సభ్యులు గ్లాసు చేతిలో పెట్టుకుని “మేం ఇక్కడే ఎందుకు ఉన్నాం?” అని తనతోనే అనుకుంటున్నారు. జగన్ నాయకత్వం అంటే టోర్నడోలో పడిన బోటు లాంటిదని అందరికీ అర్థమైపోయింది. ఒకరంటే ఒక్కరు కూడా ఆయన వెంటే రావడానికి సిద్ధంగా లేరు. “మేము ఇంకా మిగిలుంటే, మాకు నాయకులే అవసరం!” అని పార్టీ వాళ్లే అనుకుంటున్నారు.

    ప్రజలు మాత్రం ఓ అద్భుతమైన స్క్రిప్ట్ రాసేశారు: “జగన్ అవినీతి కోసం, తన కోర్టు కేసుల కోసం తన అధికారాన్ని వాడాడు. ఇప్పుడు ఆయనకు నమ్మకం లేదా మద్దతు ఏదీ మిగిలింది.” జగన్ బహుశా అధికారంలోకి రావాలని ప్రయత్నించవచ్చు, కానీ ఆ ప్రేక్షకులు థియేటర్ వదిలేశారు.

    జగన్ మోహన్ రెడ్డి ఇక రాజకీయ కటౌట్ మాత్రమే! ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకు వెళ్తున్నారు, ఆయన డ్రామాలు మరిచిపోయి. 🎭

Comments are closed.