పసలేని, లాజిక్ లేని సవాళ్లు ఇవి!

వారెవ్వా! ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాలు కేటీఆర్‌కు ఎలా వస్తాయో ఏమిటో మరి!

లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని చెప్పుకున్నంత మాత్రాన నిజాయితీపరుడిగా తేలడం కష్టం. కానీ అలాంటి అపోహలో కేటీఆర్ ఉన్నట్లు కనిపిస్తోంది. దబాయించి మాట్లాడడం ద్వారా తాము చెప్పేది నిజమని ప్రజలను నమ్మించవచ్చని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫార్ములా ఈ కార్ రేసు పేరిట జరిగిన అవినీతి పర్వం గురించి ఇప్పుడు ఏసీబీ, ఈడీ కేసుల విచారణలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈడీ విచారణకు కేటీఆర్ రెండు పర్యాయాలు హాజరయ్యారు. తెలంగాణ ఇమేజ్‌ను ప్రపంచంలో నెక్ట్స్ లెవెల్‌కి తీసుకువెళ్లే ప్రయత్నమే ఫార్ములా ఈ కార్ రేస్ అని కేటీఆర్ వాదన. ఎటొచ్చీ, అందులో పైసా అవినీతి కూడా జరగలేదని ఆయన తొలిరోజు నుంచి ఢంకా బజాయించి చెబుతూనే ఉన్నారు.

అయితే కేటీఆర్ విచారణ తీరుపై చేస్తున్న కొన్ని ఆరోపణలు, విమర్శలు మాత్రం తమాషాగా ఉంటున్నాయి. ఈడీ, ఏసీబీ ఇద్దరూ ఒకే తరహా ప్రశ్నలను మార్చి మార్చి అడుగుతున్నారని ఆయన అంటున్నారు. ఒకే నేరానికి సంబంధించి కదా విచారణ జరుగుతోంది. మరి ప్రశ్నలు ఒకే తీరుగా ఉండక వేరుగా ఎలా ఉంటాయి? అనే లాజిక్ కేటీఆర్‌కు తోచనట్లు లేదు.

అలాగే ఆయన లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని చెప్పడం ఇంకో కామెడీ. ఆ మాట చెప్పడంలో ఆయన ఒక మెలిక పెడుతున్నారు. తనతో పాటు రేవంత్ రెడ్డి కూడా లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోవాలట. నేరం-విచారణ కేటీఆర్‌కు సంబంధించి జరుగుతూ ఉండగా, ఆయన రేవంత్‌ను లై డిటెక్టర్ టెస్టు తీసుకోవాలని ఎందుకు కోరుతున్నారో అస్సలు అర్థం కాని విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవ రూపం దాల్చని విధంగా పెద్ద పెద్ద సవాళ్లు విసురుతూ ఉంటే ప్రజలు తనను నిజాయితీ పరుడు అనుకుంటారని కేటీఆర్ భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది.

వీటన్నింటికంటే గొప్ప ట్విస్ట్ కూడా కేటీఆర్ ప్రవచిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసును, తనను విచారించడం కోసం ప్రభుత్వానికి 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చవుతుందట. ఈ కేసును విచారించడానికి బదులుగా ఆ డబ్బును ప్రజల కోసం వినియోగిస్తే కనీసం కొందరు రైతులకు రైతు బంధు సాయం అందించవచ్చని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అంటే తనను విచారించకుండా ప్రభుత్వం డబ్బు మిగలబెట్టుకోవాలని అంటున్నారు.

వారెవ్వా! ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాలు కేటీఆర్‌కు ఎలా వస్తాయో ఏమిటో మరి!

4 Replies to “పసలేని, లాజిక్ లేని సవాళ్లు ఇవి!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.