‘వైనాట్’ కాదు బాబూ.. స్టార్ట్ విత్ పులివెందుల!

కూటమి పార్టీల మధ్య విభేదాలు ఒక ఎత్తు. తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా కూడా అదే స్థాయి ముఠా కక్షలు చెలరేగుతూ ఉంటే అధినేత చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?

ఎన్నికలు జరిగిన సమయంలో.. రాష్ట్రంలో నూటికి నూరు శాతం సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తాం అంటూ చెప్పుకున్న చంద్రబాబునాయుడు.. ‘వైనాట్ పులివెందుల’ అంటూ ఒక నినాదాన్ని తీసుకున్నారు. పులివెందుల అనేది జగన్ సామ్రాజ్యం అని తెలుసు గానీ.. అక్కడ గెలవబోయేది లేదని నమ్మకం ఉంది గానీ.. ‘వైనాట్ పులివెందుల’ అనే పదం తమ కార్యకర్తలకు స్ఫూర్తి ఇస్తుందని బాబు గారు అప్పట్లో అనుకున్నట్టున్నారు.

పులివెందులను కూడా గెలవడం సంగతి ఏమో గానీ.. అధికారి చేజిక్కిన తర్వాత.. ఇప్పుడు ఆయన ‘స్టార్ట్ విత్ పులివెందుల’ నినాదాన్ని జపించాల్సిన అవసరం ఏర్పడేలా ఉంది. లేకుంటే పార్టీ మొత్తం మునిగిపోతుందనే భయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అధికారం దక్కిన తర్వాత ఎన్డీయే కూటమి పార్టీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరాటాలు నిత్యకృత్యం అయ్యాయి. పరస్పరం కొట్లాడుకుంటున్నారు. లిక్కర్, ఇసుక దందాలు వంటి వ్యాపారాల విషయంలో చాలా చోట్ల కూటమి పార్టీల నేతలు సిండికేట్ అయిపోయి పంచుకుంటున్నారు.

ఇతరత్రా పెత్తనం చెలాయించే విషయాల్లో తమ మాటే నెగ్గాలని, తమ మనుషులకే దక్కాలని నానా బీభత్సకాండలను సృష్టిస్తున్నారు. కూటమిని ఈసారి ఒకరు ఓడించాల్సిన అవసరం లేదు.. మేమే ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుని ఓడించుకుంటాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇవి ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో పరాకాష్టకు చేరుకున్నాయి. కూటమిని కాపాడుకోవాలంటే.. కనీసం సొంత పార్టీని ముఠా కుమ్ములాటల నుంచి కాపాడుకోవాలంటే.. పులివెందులలోనే చంద్రబాబు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి.

పులివెందులలో పార్టీకి ఠికానా లేదు గానీ.. తెలుగుదేశంలో ముఠాలు మాత్రం రాజ్యమేలుతున్నాయి. నియోజకవర్గంలో తమ పార్టీకి బలం లేకపోయినా సరే.. అనుచరుల ముసుగులో అన్ని వ్యవహారాల్లో అందినంత దోచుకోవాలనే వారి ఆత్రుత మాత్రం విపరీతం. ప్రధానంగా అక్కడ బీటెక్ రవి, రాంభూపాల్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

ఇప్పుడు ఇసుక టెండర్ల కోసం, రేషన్ డీలర్ దందాలను తమ అనుచరులకు ఇప్పించుకోవడం కోసం కొట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే.. చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం- జనసేన పార్టీల నాయకులు మంచి సయోధ్యతో, కలసి మెలిసి ఐక్యంగా ఉంటూ వాటాలు పంచుకుని.. తమ తమ దోపిడీ దందాలను కొనసాగిస్తున్నారు. లిక్కర్ దుకాణాల విషయంలో ఇరు పార్టీల సిండికేట్లే చెలరేగుతున్నాయి. అదే సమయంలో ముఠా కక్షలు చెలరేగుతున్న నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి.

కూటమి పార్టీల మధ్య విభేదాలు ఒక ఎత్తు. తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా కూడా అదే స్థాయి ముఠా కక్షలు చెలరేగుతూ ఉంటే అధినేత చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? పార్టీని సమైక్యంగా బలంగా ఉంచుకోవాలంటే.. ఆయన తన నష్టనివారణ చర్యలను పులివెందులనుంచే ప్రారంభించాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

15 Replies to “‘వైనాట్’ కాదు బాబూ.. స్టార్ట్ విత్ పులివెందుల!”

  1. సూర్యుడు మీద ఉమ్ము వేస్తున్నారు నువ్వు , నీ 420 బాస్, ముందు ముందు ఇంకా నికృష్టంగా ఉంటుంది మీ పరిస్థితి!!

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. సొల్లు ఆపరా గురునాదం!

    Why Not 175? Why not kuppam? అని మొరిగింది ఎవరు?

    నీ సామ్రాజం అని చెప్పుకుంటున్న పులివెందెలలొ నీకు వచ్చిన మెజారిటీ 60 వేలు.

    1985 తరవాత ఎప్పుడూ గెలవని మంగలగిరిలొ లొకెష్ కి వచ్చిన మెజరిటీ 90 వేలు. పవన్ కి వచ్చిన మెజరిటీ 90 వేలు!

    .

    నియంత్రుత్వం, ఫ్యక్షన్, గూడాగిరి తొ నెగ్గుకు రావటమె కాని, సరిగ్గా సవ్యంగా ఎన్నికలు జరిగితె నీకు ఆ 60 వెల మెజారిటీ కూడా రాదు అన్నది అందరికీ తెల్సిందె!

  4. Why not kuppam? 

    కుప్పం లొ చంద్రబాబు గెలిస్తె రాజకీయాలు వదిలెసి అయన బూట్ పాలిష్ చెస్తూ ఆయన కాల్ల దగ్గరె పడి ఉంటా… అని చాలేంజ్ చెసిన కొడాలి నాని ఎక్కడ?

  5. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  6. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  7. జగన్ మోహన్ రెడ్డి: తిరస్కరించిన నాయకుడు, కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడమే లక్ష్యం

    జగన్ మోహన్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం ఇప్పుడు “గుడ్ నైట్ స్టోరీ” లా మారింది—మరి ఎవరూ వినడానికి ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల్లోనే ప్రజలు “ఇంకెప్పుడు వస్తావో చూడలేం” అని తలుపు మూసేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్న కారణం ప్రజాసేవ కాదు, కోర్టు కేసులనుంచి తప్పించుకోవడమే. తాను ముఖ్యమంత్రిగా ఉంటే కేసులు ప్రశ్నించవేమోనని ఆయన కలలు కంటున్నారు, కానీ ప్రజలు చెప్పేసారు: “కోర్టుకూ వెళ్తావు, ప్రజల తీర్పు కూడా చవిచూస్తావు.”

    ఆయన పథకాల సంగతేంటి? “అమ్మ ఒడి,” “రైతు భరోసా” లాంటి పెద్ద పేర్లు వినిపించాయి, కానీ ఫలితాలు మాత్రం ఆడిట్ రిపోర్టులో కూడా కనిపించలేవు. రైతులు, పేదలు, విద్యార్థులు ఇలా అందరూ నమ్మి జగన్ వైపే చూశారు, కానీ చివరికి తెలుసుకున్నారు: ఇతను భరోసా అనేది పేరు మాత్రమే, పని కాదు.

    ఇక మత రాజకీయాల సంగతి? ఆయన అన్ని మతాల ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు, కానీ చేతల్లో హిందూ దేవాలయాల్లో జోక్యం చేసుకోవడం, క్రైస్తవ మిషనరీలకు ప్రాధాన్యత ఇచ్చే పనులు మాత్రమే మిగిలాయి. ఆసలు మత సమైక్యత కల్పిస్తానని చెప్పిన నాయకుడే, మతాల మధ్య గోడలు నిర్మించడంలో బిజీగా ఉంటే, ప్రజల విశ్వాసం ఎలా దక్కుతుంది?

    మరి ఆయన పార్టీ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇప్పుడు ఆలోచిస్తున్నారు: “మేం జగన్ తో ఎందుకు ఉన్నాం?” పార్టీ లోపలే “జగన్ గారికి నాయకత్వం కన్నా కోర్టు డేట్‌ల గురించి ఎక్కువ భయమని” మాట్లాడుకుంటున్నారు. ఆయనను ఫాలో అవ్వడం అంటే, ఒక టైరున్న వాహనాన్ని నెట్టడం లాంటిదని అందరూ గుర్తించారు.

    ప్రజలు తేల్చేశారు: జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు నమ్మశక్యం కాని నాయకుడు. ప్రజలు కూడా ఆయన డ్రామాలు ఇక చూడటానికి ఇష్టపడడం లేదు. ఇప్పటి నుంచి జగన్ పేరు చరిత్రలో అవినీతి, మోసపూరిత పాలనకు ప్రతీకగా మాత్రమే మిగిలిపోతుంది. 🎭

Comments are closed.