లోకేశ్‌కు ఫుల్ ప్ర‌చారం.. ప‌వ‌న్ ఘ‌న‌తే!

మంత్రి లోకేశ్ గురించి టీడీపీ ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.

మంత్రి లోకేశ్ గురించి టీడీపీ ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. లోకేశ్ ఘ‌న‌త గురించి ఊరూవాడా తెలిసేలా టీడీపీ ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టింది. అంతెందుకు, టీడీపీకి కోటి మంది స‌భ్య‌త్వం లోకేశ్ ఘ‌న‌తే అని ఫుల్ పేజీల వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని ఇవాళ్టి టీడీపీ ప‌త్రిక‌ల్లో చూడొచ్చు.

మ‌రోవైపు లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేస్తార‌న్న ప్ర‌చారం కూడా విస్తృతంగా సాగుతోంది. సీఎం చంద్ర‌బాబుకు వ‌య‌సు పైబ‌డుతున్న రీత్యా, ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా లోకేశ్‌కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించాల‌నే డిమాండ్స్ టీడీపీ శ్రేణుల నుంచి పెరుగుతున్నాయి.

మ‌రీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, ప్ర‌భుత్వం అంటే తానే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ప‌వ‌న్‌కు చెక్ పెట్టాలంటే లోకేశ్‌కు మ‌రింత ప్రాధాన్యం ఇవ్వ‌డం ఒక్క‌టే ప‌రిష్కార మార్గంగా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ కామెంట్స్ ప్ర‌భుత్వానికి రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయి.

ప‌వ‌న్ తీరుతో టీడీపీ కూడా అప్ర‌మ‌త్తం అయ్యిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే లోకేశ్‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తోంది. ప్ర‌భుత్వం త‌ర‌పున ఇస్తున్న వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో సైతం లోకేశ్‌కు సంబంధం లేక‌పోయినా, ఆయ‌న ఫొటోను వాడుతున్నారు. ఇదంతా లోకేశ్‌ను భావి నాయ‌కుడిగా తెలియ‌జేయండ‌లో భాగంగానే చూడాల‌ని టీడీపీ శ్రేణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నాయి.

కూట‌మి పాల‌న సాఫీగా సాగుతుంటే, లోకేశ్ గురించి ఇప్ప‌ట్లో ఇలా ప్ర‌చారం చేసేవాళ్లు కాద‌ని అంటున్నారు. ఎప్పుడైతే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌తంగా త‌న ప‌ర‌ప‌తి పెంచుకోడానికి ప్ర‌య‌త్నాల్ని మొద‌లు పెట్టారో, అప్పుడే మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం వుండాల‌ని టీడీపీ నేత‌లు కూడా అప్ర‌మ‌త్తం అయ్యార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

లోకేశ్‌కు ప‌ట్టాభిషేకం చేసే క్ర‌మంలో నెమ్మ‌దిగా ఆయ‌న రాజ‌కీయ‌, పాల‌నా సామ‌ర్థ్యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డానికి మొద‌ట ప్రాధాన్యం ఇవ్వాల‌ని టీడీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే లోకేశ్ వ‌ల్లే ఫ‌లానా మంచి ప‌నులు జ‌రుగుతున్నాయంటూ వార్తా క‌థ‌నాలు, అలాగే వాణిజ్య ప్ర‌క‌ట‌న రూపంలో టీడీపీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాన్ని త‌ల‌కెత్తుకుంది.

10 Replies to “లోకేశ్‌కు ఫుల్ ప్ర‌చారం.. ప‌వ‌న్ ఘ‌న‌తే!”

  1. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది..అందరూ హర్ట్ అవుతారు..తగలెట్టయ్యండి సర్..నిరంజన్ గారు..తగలెట్టయ్యండి..:)

  2. మమ్మల్ని , ఈ తెలుగు గడ్డ ని మీరు విడిచి వెళ్లి 30 ఏళ్ళు కాదు.. 300 ఏళ్ళు అయినా సరే..మేము మాత్రం మీ జ్ఞాపకాలను, మధుర స్మృతులు లని , ఆశయాలని ఎన్నటికీ విడవం..మరువం..మీ జెండాను ని ఎప్పటికి వదలం..జోహార్ NTR, జై తెలుగుదేశం💐

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. అంటే.. రాష్ట్ర ప్రజలందరూ.. ఇప్పుడు లోకేష్ గురించో.. పవన్ కళ్యాణ్ గురించో మాత్రమే చర్చించుకొంటున్నారన్నమాట..

    వీళ్ళిద్దరూ కాకుండా.. ఇంకొకడు ఉండేవాడు.. వై నాట్ 175 అంటూ కామెడీ చేసేవాడు.. వాడి పేరు మర్చిపోయాను.. జనాలు కూడా మర్చిపోయారా..?

    సాక్షి లో కూడా టీడీపీ యాడ్ లే వస్తున్నాయి.. అంటే అక్కడ కూడా మనదే డామినేషన్ అంటావా..?

    కిక్కు రెడ్డీ .. కిక్కూ…

  5. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  6. డిప్యూటీ సీఎం కంటే ముందు ఆయనను పార్టీ అధ్యక్ష డు గ చేయాలి 2029 ఎలక్షన్ లో లోకేష్ గారే సీఎం కాండిడేట్ గ పార్టీ ని బాబు గారు భువనేశ్వరి గారు నడిపించాలి ఇక్కడ భువనేశ్వరి గారు ఎందుకంటే ఆవిడది లక్కీ హ్యాండ్ మొన్న ఎలక్షన్ లో దిగితే ఎలాగుంటదో చూసేము

Comments are closed.