వైసీపీ విధ్వంసం.. బాబు విమ‌ర్శ వెనుక వ్యూహం!

చంద్ర‌బాబు హామీలు అమ‌లు చేయ‌కుండా, ఇంకా ప్ర‌తిప‌క్ష పార్టీపై విషం చిమ్మి రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డుపుకోవాల‌నే వ్యూహాల్ని జ‌నం ప‌సిగట్ట‌లేని అమాయ‌క స్థితిలో వుంటారా?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌ది మాట‌లు మాట్లాడితే, అందులో స‌గం గ‌త వైసీపీ ప్ర‌భుత్వ విధ్వంసం గురించే వుంటాయి. ఏడు నెల‌ల పాల‌న‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ పూర్తి చేసుకుంది. ఇంకా వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌పైనే కూట‌మి పాల‌కులు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ప్ర‌భుత్వ అనుకూల మీడియా కూడా వైసీపీ విధ్వంసం అంటూ విషం చిమ్ముతోంది. వ్య‌వ‌స్థ‌ల విధ్వంసం గురించి చంద్ర‌బాబు మాట‌లు జ‌నానికి విసుగు తెప్పిస్తున్నాయి.

అయిన‌ప్ప‌టికీ, నిత్యం విధ్వంస నామ‌స్మ‌ర‌ణే చేయ‌డం వెనుక వ్యూహం వుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ధ‌పా ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందింది. కేవ‌లం 11 ఎమ్మెల్యే సీట్ల‌కే ఆ పార్టీ ప‌రిమిత‌మైంది. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేని ప‌రిస్థితి. అయితే వైసీపీ రాజ‌కీయంగా ఇక లేవ‌ద‌న్న భ‌రోసా చంద్ర‌బాబులో లేదు. వైసీపీకి 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లు మాత్ర‌మే రావ‌డం కంటే, ఆ పార్టీ సాధించిన 40 శాతం ఓట్లే చంద్ర‌బాబును ఎక్కువ‌గా భ‌య‌పెడుతున్నాయి.

అందుకే చంద్ర‌బాబు అప్పుడ‌ప్పుడు ఆ 40 మంది కూడా వైసీపీకి ఓట్లు వేయ‌కూడ‌దని కోరుతుండ‌డాన్ని గ‌మ‌నంలో పెట్టుకోవాలి. ఇంత‌కంటే వైసీపీ రాజ‌కీయంగా దెబ్బ‌తినే ప‌రిస్థితి భ‌విష్య‌త్‌లో వ‌చ్చే ప‌రిస్థితి వుండ‌దు. అయితే కూట‌మికి ఇంత‌కంటే ఘ‌న విజ‌యం భ‌విష్య‌త్‌లో ద‌క్కే అవ‌కాశ‌మే లేదు. మ‌రీ ముఖ్యంగా రానున్న రోజుల్లో మూడు పార్టీలు మ‌ళ్లీ కూట‌మిగానే ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ‌తాయో, లేదో తెలియ‌దు.

ఒక‌వేళ కూట‌మిగా ఎన్నిక‌ల్లో పోటీ చేసినా, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త త‌ప్ప‌క మూడు పార్టీల‌పై ప‌డుతుంది. మ‌రీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథా అనుమానాస్ప‌దంగా వుంది. ఎప్పుడెట్లా వుంటారో ఆయ‌న‌కే తెలియ‌దు. ఇప్ప‌టికే ప‌వ‌న్ కామెంట్స్ రాజ‌కీయంగా కూట‌మి ప్ర‌భుత్వానికి న‌ష్టం తెస్తున్నాయ‌న్న విమ‌ర్శ వుంది.

ఈ నేప‌థ్యంలో ప‌దేప‌దే వైసీపీ పాల‌న విధ్వంసం సృష్టించింద‌నే విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా, ఆ పార్టీ అంటే జ‌నంలో భ‌యాన్ని నాటుకునేలా చేసే వ్యూహం చంద్ర‌బాబుది. రాజ‌కీయంగా ఆధిప‌త్యం సాధించేందుకు నాయ‌కులు ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల్ని అవ‌లంబిస్తుంటారు. చంద్ర‌బాబు గ‌త ప్ర‌భుత్వ విధ్వంస పాల‌న‌నే ప్ర‌ధానంగా న‌మ్ముకున్న‌ట్టున్నారు. అలాగే 40 శాతం వైసీపీ ఓటు బ్యాంక్ ఆయ‌న్ను వెంటాడుతోంది. దాన్ని మిగల్చ‌కుండా చేయాల‌నే వ్యూహంతో వైసీపీ విధ్వంస పాల‌న గురించి ప‌దేప‌దే చంద్ర‌బాబు జ‌నానికి గుర్తు చేయాల‌ని అనుకుంటున్నారు.

అయితే చంద్ర‌బాబు హామీలు అమ‌లు చేయ‌కుండా, ఇంకా ప్ర‌తిప‌క్ష పార్టీపై విషం చిమ్మి రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డుపుకోవాల‌నే వ్యూహాల్ని జ‌నం ప‌సిగట్ట‌లేని అమాయ‌క స్థితిలో వుంటారా? అనేదే ప్ర‌శ్న‌. గ‌తంలో జ‌నాగ్ర‌హాన్ని రుచి చూసిన చంద్ర‌బాబు, ఇంకా త‌న మార్క్ పాలిటిక్స్‌ను అనుస‌రిస్తుండ‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

26 Replies to “వైసీపీ విధ్వంసం.. బాబు విమ‌ర్శ వెనుక వ్యూహం!”

  1. విశాఖ ఉక్కు కి 11500 కోట్ల భారీ ప్యాకేజి.. ఈ ముక్క రాయడానికి మాత్రం చేతులు రావట్లేదనుకొంటా..

    ఇన్నాళ్లు విశాఖ ఉక్కు ని మూసేస్తున్నారు అని ఏడ్చావు.. ఇప్పుడు జగన్ రెడ్డి పెంపుడు కుక్కలకి సౌండ్ లేదు..

    1. KanakayyaSrinow

      Mr.nameless joy, ekkada development? Pavala kalyani ki juttu gaddalu, chinna pappu gadiki base peragadamu tappa? Chandrika akka eppudu borla padukuni, malla telugu vadi athmabhimanam ani ntr statue ni etala takutadu ra? Shameless janalu ra ?

  2. ప్రతి వాడికి ఒక వ్యూహం ఉంటుంది. బాబు చెప్పిన విధ్వంసం ప్రజలు చూసారు కనుకే నమ్మమారు ఓట్లు వేశారు. ఒక సారి వాదు అని త్రిస్కరించిన పార్టీ నే నెత్తిన పెట్టుకున్నారు .మల్ల చూడాలి .ఇప్పుడయితే రోడ్ వేస్తున్నారు కంపెనీ లు వస్తున్నాయి పాత బకాయిలు తీరుస్తున్నారు .ప్రయాణం బాగుంది

      1. మీకు కనిపించ లేదేమో పల్లెలో చక్కగా రోడ్ వర్క్ లు చెక్డ్ డ్యాం లు అవుతున్నాయి . మద్యం దోపిడీ లేదు .ఇసుక బాగానే లభ్యం అవుతుంది . ఇక అనేక కంపెనీ లు.వస్తున్నాయి ఆంధ్ర కి . తమరికి కన్పించ లేదు.పోలవరం niravsithualki వెయ్యి కోట్లు వేశారు . ఇతర బకాయిలు క్లియర్ అయ్యాయి .కాంట్రాక్టర్లు ఉద్యోగులు బాగానే ఉన్నారు .

  3. మూడు నెలలు నుంచి అన్నియ ఒకటే ప్రెస్మెట్…. జనాలకి కూడా విసుగు వస్తోంది…

    రెండు మూడు నెలల్లో అధికారం.. లేదా జమిలి అంటాడు. జనాలు క్లోత్ తో నవ్వుతున్నారు

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  5. నవ గులక రాళ్ళు(అవేనండి నవ రత్నాలు )

    1 . ఇసక దోపిడీ

    2. మద్యం దోపిడీ

    3. మట్టి దోపిడీ

    4. భూమి దోపిడీ

    5. హత్యలు

    6. అత్యాచారాలు

    7. హూ కిల్డ్ బాబాయ్

    8. విప్పి చూపించాడు

    9. గంట అరగంట కథలు

    కొసరుగా

    1. ఎగ్ పఫ్ లు

    2. పంది కొవ్వు

    3. ఇనప కంచె

Comments are closed.