ఆదాయం ద‌గ్గ‌ర కూట‌మి అంటే కుద‌ర‌ద‌బ్బా!

క‌డ‌ప నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి. ముఖ్యంగా కూట‌మికి చెందిన టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల మ‌ధ్య గొడ‌వ‌ల్ని గ‌మ‌నిస్తే, ఆదాయం ద‌గ్గ‌రే చిక్కంతా.

త‌మ్ముడు త‌మ్ముడే, పేకాట పేకాటే అని అంటుంటారు. కొన్ని చోట్ల బంధుత్వాల‌కు, అనుబంధాల‌కు చోటు లేద‌నేది ఈ నానుడి అర్థం. అలాగే ఆదాయం ద‌గ్గ‌రికొచ్చే స‌రికి ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి స‌ర్కార్ పాల‌న సాగిస్తోంది. స‌హ‌జంగానే కూట‌మి నాయ‌కులు ఆదాయ వ‌న‌రులు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో వెతుక్కుంటున్నారు. ఫ‌లానా ద‌గ్గ‌ర ఆదాయం వుంద‌ని తెలిస్తే చాలు, కూట‌మి నాయ‌కులు వాలిపోతున్నారు.

క‌డ‌ప నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి. ముఖ్యంగా కూట‌మికి చెందిన టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల మ‌ధ్య గొడ‌వ‌ల్ని గ‌మ‌నిస్తే, ఆదాయం ద‌గ్గ‌రే చిక్కంతా. క‌డ‌ప‌లో ఏకంగా క‌లెక్ట‌రేట్‌లోనే టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు గొడ‌వ ప‌డ్డారు. దేని కోసం అంటే… సిద్ద‌వ‌టం మండ‌లంలో ఇసుక రీచ్‌ను ద‌క్కించుకునేందుకు. స్థానికంగా త‌మ‌కే కావాల‌ని జ‌న‌సేన ప‌ట్టుబ‌డుతోంటే, అవ‌న్ని కుద‌ర‌వ‌ని, త‌మ‌కే కావాల‌ని పులివెందుల‌కు చెందిన బీటెక్ ర‌వి వ‌ర్గం తేల్చి చెప్పింది.

సంద‌ట్లో స‌డేమియా అంటే సిద్ద‌వ‌టానికి స‌మీపంలోకి క‌డ‌ప ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి వ‌ర్గీయులు తామేం త‌క్కువ అంటూ టెండ‌ర్ వేయ‌డానికి ముందుకొచ్చారు. ఉచిత ఇసుక అనే పేరే త‌ప్ప‌, ఇప్పుడంతా అమ్మ‌క‌మే. కోడి పందేలు ఆడించే ద‌గ్గ‌రి నుంచి ప్ర‌తి చోటా ఆదాయం పొందేందుకు టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉండ‌గానే సొంతింటిని చ‌క్క‌దిద్దుకోక‌పోతే, ఇంకెప్పుడు సాధ్య‌మ‌ని కూట‌మి నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఆదాయంలో ఎంతోకొంతైనా ఇవ్వాలి క‌దా? అంతా ఒక పార్టీ నాయ‌కులే తీసుకుంటామంటే ఎలా అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఆదాయం ద‌గ్గ‌రే కూట‌మి నేత‌ల మ‌ధ్య విభేదాల‌కు దారి తీస్తోంద‌న్న‌ది వాస్త‌వం. అధికారం అంటేనే, ప‌ది రూపాయిలు సంపాదించుకోవ‌చ్చ‌నే భావ‌న మ‌న‌సులో వుంటుంది. మ‌ద్యం దుకాణాల కోసం ఎలా గొడ‌వ‌లు ప‌డ్డారో, బెదిరింపుల‌కు దిగారో తెలిసిందే.

రానున్న రోజుల్లో కూట‌మి నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం వుంది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య స‌ఖ్య‌త ఉన్న‌ప్ప‌టికీ, కిందిస్థాయిలో త‌మ‌కేంటి? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. తామెలా బ‌త‌కాల‌ని అడుగుతున్నారు. అస‌లు రాజ‌కీయం అంటేనే, ఆదాయం కోస‌మ‌నే అర్థం స్థిర‌ప‌డిన కాలంలో, ఇలాంటి ర‌చ్చ‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మే.

7 Replies to “ఆదాయం ద‌గ్గ‌ర కూట‌మి అంటే కుద‌ర‌ద‌బ్బా!”

  1. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన కుళపోళ్ళే ఎవ్వరికీ ఇవ్వనవసరం లేకుండా మొత్తం దోచుకొని తిన్నారు. ఇప్పుడలా కుదరదు కదా! కూటమి ధర్మం ప్రకారం వాటాలు పంచుకోవాల్సిందే.

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.