భారత రాష్ట్ర సమితి మరింత అసహనానికి గురవుతున్నది. ఆపార్టీ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార కాంగ్రెసులో ఉన్నారు. అసలే ఒకవైపు పార్టీ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసులు.. దానికి తోడు.. పార్టీ ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరిపోతే ఏమీ చేయలేని నిస్సహాయత కలిసి వారిని అసహనానికి గురిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. తమను చిక్కుల్లోకి నెడుతున్న కేసుల విషయంలో చేయగలిగేది ఏమీ లేకపోగా.. కనీసం ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించడం ద్వారా.. కాస్త ఆత్మస్థైర్యం కూడగట్టుకోవాలని భారాస భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
నిజానికి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి మాట్లాడే నైతిక అర్హత భారాసకు లేదు. కానీ.. వారు నైతికత సంగతి పక్కన పెట్టి.. న్యాయపోరాటం మాత్రమే చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టుస్థాయిలో ఒక ఎదురుదెబ్బ తప్పలేదు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం పూర్తిగా స్పీకరుదేనని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేం అని హైకోర్టు తేల్చేసింది. తాజాగా.. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది భారాస. వారి ప్రయత్నం ఎలాగైనా ఉండవచ్చు గానీ.. ఈ విషయంలో భారాస నెగ్గడం అంత ఈజీ కాదని న్యాయనిపుణులు అంటున్నారు.
పదిమంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నప్పటికీ.. ఇప్పటిదాకా స్పీకరు నిర్ణయం తీసుకోలేదని భారాస వారి తాజా ఫిర్యాదు. నాలుగు వారాల్లోగా స్పీకరు నిర్ణయం తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలనేది ఈ పిటిషన్ ద్వారా వారి విజ్ఞప్తి. మూడునెలల్లోగా స్పీకరు నిర్ణయం తీసుకోవాలని చెబుతున్న కొన్ని పాత తీర్పలను ఉదాహరిస్తూ వారు వేటు వేయించాలని అనుకుంటున్నారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ లకు వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన భారాస, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ వేసింది.
అయితే న్యాయనిపుణులు చెబుతున్న దానిని బట్టి.. అనర్హత పిటిషన్ నెగ్గడం అంత సులువు కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటు వేయడం అనేది పూర్తిగా స్పీకరు విచక్షణాధికారం కిందకు వస్తుంది. పార్టీ ఫిర్యాదు చేసినంత మాత్రాన.. ఆ ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇచ్చి ఎఫ్పుడు విచారించాలి.. ఆ విచారణను ఎఫ్పుడు ముగించాలనేది పూర్తిగా స్పీకరు అధికారం కిందకు వస్తుంది.
స్పీకరు ను కోర్టు శాసించేలా ఉత్తర్వు ఇవ్వడం అంటే అది రెండు రాజ్యాంగబద్ధమైన ఉన్నత వ్యవస్థల నడుమ ప్రతిష్టంభన అవుతుంది. అలాంటి పరిస్థితిని కొనితెచ్చుకోవడానికి న్యాయస్థానాలు సుముఖంగా ఉండవు. ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోవడం అన్నట్టుగా వ్యవహరించడం సరికాదనే సిద్ధాంతానికే కట్టుబడి ఉంటాయి.
పైగా గత పాలనల కాలంలో.. కాంగ్రెసును దాదాపు ఖాళీ చేయించేంతగా.. భారాస ఫిరాయింపులను ప్రోత్సహించి వారికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టింది. ఇప్పుడు మాత్రం నీతివచనాలు చెబుతోందనే ప్రజల విమర్శ ఎటూ ఉండనే ఉంది.
Irrespective of anything, there should be something to stop this party jumping, its making mockery of democracy.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
ఏ పార్టీ తరపున గెలిచినా పార్టీ మారితే పార్టీ కోరితే అతన్ని తక్షణం పదవినుంచి తొలగించాలి దీనిమీద విచారణ అనవసరం పార్టీ మారే వాళ్లకు అంత నమ్మకం ఉంటే తిరిగి పోటీచేయడమే