సంక్రాంతికి కోడి పందేలు ఆడడం ఇప్పడు మొదలైన సంగతి కాదు. దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అయితే స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో చిన్న స్థాయిలో జరిగేవి ఇవి. కాలక్రమంలో ఇంతింతై అంతతై అన్నట్టుగా ఎదిగి వందల కోట్ల రూపాయల వేడుక అయిపోయింది.
కొన్నేళ్ళ వరకు కోడిపందేలంటే గోదావరి జిల్లాలే కేంద్రంగా ఉండేవి. కానీ ఈ ఏడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడ పడితే అక్కడ ఆడేశారు. కొన్ని చోట్ల కోళ్లతో ఆగకుండా పందుల పందేలు కూడా నిర్వహించారు. బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాసారు, మందు సేవించారు, విందారగించారు, నానారకాల డ్యాన్సులు చేసారు. ఒక చోట లేడీ బౌన్సర్లని పెట్టారు. వాళ్లెందుకో మరి. మొత్తానికి ఆడ, మగ తేడా లేకుండా ఈ “చట్టవ్యతిరేకమైన సాంస్కృతిక కార్యమం”లో పాల్గొన్నారు. కోట్లు కుమ్మరించారు.
ఎప్పటినుంచో ఉన్న వ్యవహారం కాబట్టి “సాంస్కృతికం” అనాలా లేక దీనికి చట్టబద్ధత లేదు కాబట్టి “చట్టవ్యతిరేకం” అనాలా? అందుకే ప్రస్తుతానికి “చట్టవ్యతిరేకమైన సాంస్కృతిక కార్యక్రమం” అని చెప్పుకుందాం.
భారతదేశంలో గ్యాంబ్లింగ్ నేరం. మరి పేకాట క్లబ్బులున్నాయి కదా అని అడగొచ్చు. అక్కడ చట్టబద్ధంగా ఆడగలిగేది రమ్మీ ఒక్కటే. ఎందుకంటే అది మూడుముక్కలాట లాగ పూర్తిగా “బై చాన్స్” గెలిచే ఆట కాదు. బుర్ర వాడాలి కనుక దానికి “స్కిల్ గేం” కేటగరీలో పెట్టడం జరిగింది. ఇక కేసినోల సంగతి ఏంటంటే…భారతప్రభుత్వం గోవా, సిక్కిం, దామన్ లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. పర్యాటకులతోనే సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఆ ప్రాంతాలకి ఉంది కనుక గ్యాంబ్లింగ్ ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఆ ప్రాంతలకు మాత్రమే పరిమితం చేసారు.
ఇప్పుడు కోడి పందేలకి వద్దాం. ఇది స్కిల్ గేం కాదు. రెండు కోళ్ళల్లో ఒకటి గెలుస్తుంది, మరొకటి చస్తుంది. కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ మీద బెట్టింగ్ కాసే ఆట. అందుకే ఇది గ్యాంబ్లింగ్ కిందకు వస్తుంది. అయినా సరే ఈ సారి ఆంధ్రప్రదేశులో చట్టం కళ్లు మూసుకుని కూర్చుంది. అంతే కాదు ఇది సంక్రాంతి సంస్కృతి అని చెప్పి పోలీసులు, న్యాయమూర్తులు అటువైపు వెళ్లకుండా గౌరవించారు. ఇదే కార్యక్రమం వైకాపా ప్రభుత్వంలో జరిగినప్పుడు సుమోటో కేసులు, అరెస్టులు..ఇప్పుడవేవీ లేవు.
“గత ప్రభుత్వంలోలా కాదు. పోలీసులొచ్చి లెమ్మంటారనే భయం లేదు. ప్రజలు మనస్ఫూర్తిగా కోడిపందేలు జరుపుకున్నారు” అంటూ సదరు తెదేపా మానసపత్రిక చారిత్రాత్మకమైన వాక్యం కూడా రాసింది.
ఇదిలా ఉంటే, ఒక చోట ఒక పోలీసు టైమైంది లెమ్మంటే కోడిపందేల రాయుళ్లు అతనిపై దాడిచేసారట. దీనిపై కూడా ఎటువంటి చర్య తీసుకున్నట్టు లేదు.
ఇంత పవిత్రంగా జరుగుతున్న కోడి-పంది పందేలని చట్టబద్ధం చేసే దిశగా కూటమిప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే బాగుంటుంది. కోరుకుంటే అడ్డు చెప్పని కేంద్రప్రభుత్వం తమ పంచనే ఉందాయె! చట్టబద్ధత ఎందుకు చేయాలంటే…వందలాది, వేలాది కోట్ల రూపాయలు ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం మొత్తం క్యాష్ తో నడిచింది. అంటే ఎంత బ్లాక్ మనీ పారిందో చూడండి.
ఈ యాక్టివిటీని చట్టబద్ధం చేస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి కూడా వెసులబాటు ఉంటుంది. అలాగే క్యాష్ తో భారీ బెట్టింగ్ కట్టిన వాళ్ల వివరాలు ఐటీ శాఖకి అందుతాయి. అది వేరే విషయం. అలాగని భయపెట్టకుండా, బ్లాక్ మనీని వైట్ చేసుకునే సువర్ణ అవకాశాన్ని కల్పించి నల్లధనాన్ని సిస్టంలోకి తీసుకొచ్చే ప్రణాళికలు ప్రభుత్వం చేయొచ్చు. మరింత గొప్పగా ప్రచారం చేసి విదేశీయుల్ని కూడా ఆకట్టుకోవచ్చు. సంక్రాంతికి ఆంధ్రాకి గోవాకళ తీసుకురావొచ్చు. సంబరానికి సంబరం, మన సంస్కృతి ఇది అని ప్రపంచానికి చాటడం, డబ్బుకి డబ్బు…ఎన్ని ఉపయోగాలున్నాయి!!
సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, అపర కుబేరులు ఎంతో మంది వచ్చి సందడి చేస్తారు. కోడిపందేలని లీగలైజ్ చేసి లైసెన్సులు ఇవ్వడం వల్ల, ఎందరికో చట్టబద్ధమైన ఉపాధికూడా దక్కుతుంది. గోవాలాగ అన్ని రకాల క్యాసినో ఆటలకి పర్మిషన్ ఇచ్చేయాలని కాదు. ఆంధ్రప్రాంత సంస్కృతిని ఆదరిస్తూ ఒక్క సంక్రాంతి సీజన్ వరకు వారమో, పక్షమో కోడిపందేలు నిర్వహించుకునేలా లీగలైజ్ చేస్తే ఆ కళే వేరు. విదేశీ రొక్కం కూడా వచ్చిపడి, దేశానికి ఆదాయం బాగుందనిపిస్తే ఏడాదిపొడవునా నిర్వహించేసుకునేలా సిగ్నల్ ఇవ్వచ్చు. అప్పుడు “పందెం కోడి ఫారములు” కూడా ప్రత్యేకంగా వెలుస్తాయి. ఈ దిశగా మన కూటమి ప్రభుత్వం వారు ఆలోచిస్తే బాగుంటుంది.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు..ప్రభుత్వానికి ఆదాయం మెరుగ్గా వస్తుందని క్రేజ్ ఉన్న సినిమా తాలూకూ టికెట్ల రేట్లు పెంచుకోమని అనుమతిచ్చారు. హార్వార్డ్ యూనివెర్సిటీలో ప్రసంగాలిచ్చే స్థాయి ఉన్న ఆయనకి తప్ప ఈ సూత్రం ఎవ్వరూ పట్టుకోలేదు ఇన్నేళ్లూ! అందుకే సినిమాలంటే ఎక్కువ క్రేజ్ కోడిపందేలకి కూడా ఉంది కనుక, అక్కడ కూడా ప్రభుత్వం ఆదాయం సంపాదించుకునే మార్గం ఉంది కనుక, ప్రధానికి చెప్పి ఆంధ్రాలో కోడిపందేలని లీగలైజ్ చేసే పని పెట్టుకుంటే ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన ఘనతని చరిత్ర కోడై కూస్తుంది.
హరగోపాల్ సూరపనేని
They should legalize if they can’t stop it. Only problem is it will not stop with festival and it will continue throughout the year
రేయ్ లఫుట్. ఆంధ్ర డెవలప్ అవుతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు రా. డెవలప్మెంట్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో వుంది. పబ్లిక్ చాలా హ్యాపీగా వున్నారు. ఇక ఏడుపు ఆపేయి.
ఒరే లఫుట్. ఆంధ్ర డెవలప్ అవుతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు రా. డెవలప్మెంట్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో వుంది. పబ్లిక్ చాలా హ్యాపీగా వున్నారు. ఇక ఏడుపు ఆపేయి.
ఆంధ్ర డెవలప్ అవుతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు రా. డెవలప్మెంట్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో వుంది. పబ్లిక్ చాలా హ్యాపీగా వున్నారు. ఇక ఏడుపు ఆపేయి.
Make it legal and call for private tenders in the lines of liquor policy. Good way for creating wealth.
ja*** , కొడాలి నాని ఎప్పుడో మారుమూల పల్లెలు కు సైతం క్యాసినోస్ తెచ్చి గోవా కన్నా ఎక్కువగానే డెవలప్ చేశారు, ఇంక ఇప్పుడు చేసేది ఏముందిలే!!
గొవాలొ కొడి పందాలు ఆడరురా! క్యాసినొలని,పెకాటం, జూదం చట్టబద్దం చెద్దాంల లె! అప్పుడు అచ్చు గొవానె!
పాపం! ఆ అబిరుద్ది కొసం మన గుడ్కా నాని కూడా తెగ ప్రయత్నించాడు!
Jaggadu
పేకాట ఆడితే ఏమవుద్ది? నా అనుచరులు, తమ్ముడు ఉంటె ఎమౌద్ది? ఎమన్న ఉరి శిక్ష వెస్తారా? పట్టుకుంటె ఫైన్ కడతారు, వెళ్తారు మళ్ళా అడతారు! దీనికి ఎమ్మనా ఉరి శిక్షలు ఉన్నయా!
.
ఈ మాటలు అన్న Y.-.C.-.P మంత్రి ఎవరొ మరిచి పొయావ గురువిందా??
ప్రభుత్వం లో ఎవరు వున్నా దీన్ని ఆపడం కష్టం..
మూడురోజుల కోసం ఇంత చించుకోవడం అనవసరం..
దీపావళి కి ముందు ప్రపంచం లో ఎక్కడా లేని పొల్యూషన్ మన పండగ వల్ల వస్తోంది అని గుడ్డలు చించుకుంటారు. అన్ని దేశాల్లో ఫైర్ వర్క్స్ ఉంటాయి.. ఇది కూడా అలాంటిదే..
వైసీపీ హయాంలో కూడా ఇలాగే ఉంది.. నేను 2023 లో వెళ్ళాను
వేశ్య వృత్తి కూడా చేస్తే రేప్ లు తగ్గుతాయి.. ప్రభుత్వానికి కి డబ్బే డబ్బు…
వే శ్య వృత్తి కూడా చేస్తే రే ప్ లు తగ్గుతాయి.. డబ్బే డబ్బు…
ఇదే కార్యక్రమం వైసీపీ హయాంలో జరిగితే సుమోటుగా కేసులు నమోదు చేసి అరెస్ట్ లు చేసినట్టు అయ్యుంటే , గుడివాడ లో కొడాలి నాని అంత పెద్ద క్యాసినో ఎలా రన్ చేసాడు …
ఇది నిజం బాగా చెప్పారు .ఇలాంటి వాటిని ఆపాలెం ఎలాగు. సో చట్ట బద్ధం చెయ్యాలి. కానీ ఇలా పండుగలకే పరిమితం చెయ్యాలి లైసెన్సు ప్రభుత్వమే ఇవ్వాలి
Pandaga puta ayna annam thinnaraa leka family mottham eppatila Mega and CBN malam thinnaraa gaandu ga
This is development certainly honble courts are silent as they feel this is culture. But not gambling .honble judges are intellectual if they do not take these issues as sumotto it proves that they believe that these practices are fair.
Load ethe Ramana lanti vallu unte athegaa maree
Kodi pandala mida edichedi kevalam paarti nayakulu, partilu nadipe, partila kosam nadiche patrlikalu maatrme. prajalaku adi asalu pattinchukune vishayame kaadu. nachhina vallu veltaaru .dabbu gelavachhu pogottukovachhu..madhya taragati vaadu geliste o iravai velu pote o ayiduvelu anukuni veltaadu. simple.
avi ante nachhani vaadu intlo tv chustuu time pass chestaadu.
smasya anthaa adhikaaramlo leni partilu, vaalla patrikala edupu valla matrame…ee naalugu rojulu mi patrikalaku kudaa selava icchheyandi..
సన్నాసి కబుర్లు… పొగాకు మానెసెరా.. మధ్యం మానెసెరా.. అన్ని అంతె.
Good idea
“వాళ్ళు వెళ్లడం కాదు, మేమే ఒక నమస్కారం పెట్టి పొమ్మన్నాము.. ” ఈ డైలాగ్ ఎవరిదో గుర్తుందా? నాటి అదే జగన్ గారి హయాంలో సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల గారి ఉవాచ..
gajji gadi usenduku
u
అసలు 2019-24 ఇలాంటివి ఎక్కడ కూడా జరగలేదు అంటావ్ సోది ఆపు మీరు చేస్తే మంచి పని, మేము చేస్తే తప్పు ఇది ఎప్పటి నుంచో వస్తున్న పండగ సంప్రదాయం, చాలా చోట్ల ఇవి జరుగతూనే వస్తున్నాయి మేము ఎదో కొత్తగా పెట్టి దెగురుంది చేపించి నటు చెబుతున్నావ్ జనాలు బాగా పండగ చేసుకున్నారు పండగ
wealth creation….wealth creation…
టాపిక్ ఏదైనా చివరన పవన్ గారి మీద ఏడిస్తే గాని మనకి వ్యూస్ రావు కదా Ga