ప్రభాస్ పెళ్లి కూతురు ఊరు…!

ప్రభాస్ కు పెళ్లి కూతురు రెడీ అన్నది అసలు సిసలు పాయింట్. పైగా ఆ అమ్మాయిది వెస్ట్ గోదావరి గణపవరం అని తెలుస్తోంది

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్నది ఎవర్ గ్రీన్ క్వశ్చన్. అవకాశం దొరికినపుడల్లా ప్రభాస్ కు కావచ్చు. అతని సన్నిహితులకు కానీ ఇదే ప్రశ్న ఎదురవుతూ వుంటుంది. అన్ స్టాపబుల్ గత సీజన్ కు ప్రభాస్ వచ్చినపుడు ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ఈసారి సీజన్ కు రామ్ చరణ్ వచ్చారు. మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది.

అయితే ఈసారి చరణ్ నుంచి ఓ కొత్త సమాచారం బయటకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందిన అమ్మాయి అని చరణ్ వెల్లడించినట్లు తెలుస్తోంది.

నిజంగా ఇది పెద్ద క్లూ నే. ఏ ఊరు అమ్మాయి అన్నది కీలకం అనే కన్నా, ప్రభాస్ కు పెళ్లి కూతురు రెడీ అన్నది అసలు సిసలు పాయింట్. పైగా ఆ అమ్మాయిది వెస్ట్ గోదావరి గణపవరం అని తెలుస్తోంది అంటే పదహారు అణాల తెలుగు అమ్మాయి అన్న మాట. ఇంతకీ అన్ స్టాపబుల్ ఈ సీజన్ లో చరణ్ ఏమి చెప్పాడు అన్నది క్లారిటీగా బయటకు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ఫుల్ బిజీగా వున్నాడు సినిమాలతో. రాజాసాబ్, హనురాఘవపూడి సినిమా, సందీప రెడ్డి వంగా సినిమాలు వరుసగా లైన్ లో వున్నాయి. ఆ తరువాత చేయాల్సిన సలార్ 2, కల్కి 2 సినిమాలు వుండనే వున్నాయి. ఇంత బిజీగా వున్నారు ప్రభాస్. మరి ఈ బిజీ లైఫ్ లో పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారో మరి?

3 Replies to “ప్రభాస్ పెళ్లి కూతురు ఊరు…!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.