సే సారీ టు పూరీ.. క్ష‌మాప‌ణ చ‌ట్టం చేస్తే స‌రిపోతుందేమో!

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ఏపీలో అన‌ధికారికంగా క్ష‌మాప‌ణ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టే. ఇక చ‌చ్చేవారు చావొచ్చు, ఇబ్బంది ప‌డే వారు ప‌డొచ్చు.. ఆ పై సే సారీ!

తెలుగు భాష‌లో నాకు న‌చ్చ‌ని ఒకే ఒక మాట క్ష‌మించ‌డం! అంటాడు ఠాగూర్ సినిమాలో చిరంజీవి. మ‌రి మెగాస్టార్ అడుగుజాడ‌ల్లో వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు పొలిటీషియ‌న్ గా ఈ క్ష‌మాప‌ణ నాట‌కీయ‌త‌ను నెత్తికెత్తుకున్నారు! అయితే.. క్ష‌మించ‌మ‌ని అడ‌గాలంటూ ప‌వ‌న్ చెప్పుకురావ‌డం, త‌ను క్ష‌మాప‌ణ అడ‌గ‌డం, త‌న లాగా టీటీడీ చైర్మ‌న్, టీటీడీ స‌భ్యులు అంతా క్ష‌మించ‌మ‌ని అడ‌గాలంటూ వ్యాఖ్యానించ‌డం.. విన‌డానికి ఇవ‌న్నీ వింత‌గా ఉన్నాయి!

ప్ర‌జాస్వామ్యంలో.. ప్ర‌జాస్వామ్యిక వ్య‌వ‌స్థ‌ల్లో ఇలా బాధ్య‌తారాహిత్యంతో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను తీసిన త‌ర్వాత‌.. క్షమించ‌మ‌ని అడిగితే చాలా! మ‌న‌సులో ఏమున్నా, ప్ర‌జల ప్రాణాల‌పై లెక్క‌లేని త‌నం ఉన్నా, మరేం చేసినా.. క్ష‌మించండి అని అడిగితే స‌రిపోతుందా! బ‌హుశా ప‌వ‌న్ క‌ల్యాణ్ లెక్క‌లో స‌రిపోతుంది కాబోలు.

వెనుక‌టికి రైలు ప్ర‌మాదాలు జరిగిన‌ప్పుడు రైల్వే మంత్రులు రాజీనామా చేసేవాళ్లు. ఎప్పుడో స‌త్తెకాలంలో మొద‌లైంది ఆ సంప్ర‌దాయం. తీవ్ర‌మైన రైలు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు అందుకు బాధ్య‌త వ‌హిస్తూ రైల్వే మంత్రులు రాజీనామా చేసిన సంప్ర‌దాయాలున్నాయి. తాము మంత్రిగా ఫెయిల‌య్యామ‌ని, ప్ర‌మాదాన్ని నివారించ‌లేక‌పోయినందుకు బాధ్య‌త వ‌హిస్తూ వారు రాజీనామా చేసే వారు. ఒక శాఖాప‌ర‌మైన విచార‌ణ‌లు ఎలాగూ ఉండేవి.

అయితే ఆ సంప్ర‌దాయాన్ని కూడా క్ర‌మంగా తుంగ‌లో తొక్కేశారు. ఆ అవ‌స‌రం లేద‌ని గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఎంత‌టి దారుణాలు జ‌రిగినా రైల్వే మంత్రులు రాజీనామా చేసిన దాఖ‌లాలు లేవు. పైపెచ్చూ కుట్ర‌కోణం అన‌డం కొంత‌కాలంగా అల‌వాటైపోయింది. యాక్సిడెంట్ కు కార‌ణ‌మైన రైల్వే డ్రైవ‌ర్ మ‌త‌మేంటి, కుల‌మేంటి, ప‌క్క‌న ఏమైనా మైనారిటీ నిర్మాణాలున్నాయా.. ఇలాంటివి ఇప్పుడు చ‌ర్చ‌గా మారాయి.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఏపీలో ఇక క్ష‌మాప‌ణ చ‌ట్టం అమ‌లు అవుతుందేమో! అంటే వ్య‌వ‌స్థ‌వైఫ‌ల్యం కార‌ణంగా, పాల‌నా ప‌రమైన వైఫ‌ల్యం వల్ల ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డినా, ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నా.. సారీ, క్ష‌మాప‌ణ‌లు అంటే అదెలాంటి సంద‌ర్భంలో అయినా త‌ప్పు చెల్లిపోతుందేమో. క్ష‌మాప‌ణ‌లు చెప్పాంగా.. ఇంకేం కావాల‌న్న‌ట్టుగా .. వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు కాబోలు!

అలాగే అంత పెద్ద పెద్ద ప‌ద‌వుల్లో ఉన్న వారు, ఆ ప‌ద‌వుల్లో నామినేట్ అయిన వారే క్ష‌మాప‌ణ‌లు చెప్పారంటే ఈ జీవితానికి ఇంకేం కావాల‌న్న‌ట్టుగా చ‌చ్చిన వారు, గాయ‌ప‌డ్డ‌వారు, వారి స‌న్నిహితులు, కుటుంబీకులు అంతా ఆనంద భాష్పాల‌ను రాల్చిత‌రించ‌వ‌చ్చు! కాదంటే.. వారి అభిమానులు ఊరుకోరు. ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పారంటే చ‌చ్చిన వారి జీవితం కూడా ధ‌న్య‌మైపోయింద‌న్న‌ట్టుగా వారి ఎలివేష‌న్లున్నాయి.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ఏపీలో అన‌ధికారికంగా క్ష‌మాప‌ణ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టే. ఇక చ‌చ్చేవారు చావొచ్చు, ఇబ్బంది ప‌డే వారు ప‌డొచ్చు.. ఆ పై సే సారీ! కేసులు అక్క‌ర్లేదు, విచార‌ణ‌లు అక్క‌ర్లేదు, క‌మిటీల‌క్క‌ర్లేదు.. అయితే ప్రాయ‌శ్చిత దీక్ష‌, కాక‌పోతే సే సారీ టు పూరీ!

56 Replies to “సే సారీ టు పూరీ.. క్ష‌మాప‌ణ చ‌ట్టం చేస్తే స‌రిపోతుందేమో!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. వీడి అన్నకు క్షమించడం ఇష్టం లేదుగా… ఠాగూర్ సినిమాలో 10 మంచిని చంపాడు క్షమించమని వేడుకున్నకూడ

  3. Good writting..manushulani champesi kshamapana adigithe saripothadi,kutra ani oka maata ante chalu topic mottam divert ayipthadi..ah railway minister aithe darunam ayana time lo jarigina accidents mottam railway mottam kaalam lo jarigina accidents kante darunam ainavi kani resign cheyadu

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

    1. నీ సంబిడం బానే వింది.

      మా ఫ్యా*న్ పార్టీ పిల్లోడు ముచ్చటపడి ఫోన్ చేస్తే గగన్ అని పేరు చెప్పింది. ప్యాలస్ లో పికప్ అంట.

  5. క్షమాపణ అడగాలంటే అహం అడ్డు వస్తుంది, అది అందరు చెయ్యలేరు. క్రమ శిక్షణ చర్యలు తీసుకుని , మెరుగైన వైద్యం అందించి, పరిహారం ఇప్పించి, ఇంకా క్షమించమని అడగటం తప్పని పవన్ మీద పడ్తావేంటి? మీకు చేతనైతే టీటీడీ చైర్మన్ ని రాజీనామా చెయ్యాలని వైసీపీ దీక్షలు చెయ్యండి , లేకపోతే మూసుకోవాలి.

    1. Brother monna Ramcharan gaari movie eventlo one person died, so manam Ramcharan gaarini and PK gaarini arrest cheddaama, logic lekundaa maatlaadaddu, TTD chairman responsible anty, in that case even CBN, PK and whole government is responsible, they all should resign, is it sensible thing to do

  6. అంతే కదా..

    మన జగన్ రెడ్డి 1700 కోట్లు లంచం తీసుకుని FBI కి దొరికిపోతే.. శాలువా కప్పాలి.. సన్మానాలు చేయాలి అని డిమాండ్ చేసే బ్యాచ్ మనది..

    మన పేర్ని నాని పేదల బియ్యం దొబ్బేసి అమ్మేసుకుని.. దొరికిపోయాక .. నష్ట పరిహారం కడితే.. ఆహా .. ఓహో అన్న బ్యాచ్ మనది..

    ..

    ఒక ఆక్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్ జరిగితే.. తప్పు సరిదిద్దుకుంటాం.. క్షమించండి అనడం మాహా ఘోరం.. మహా పాపం..

    అస్సలు క్షమించకూడదు.. ఎందుకంటే.. మన జగన్ రెడ్డి కి అర్జెంటు గా అధికారం కావాలి.. అధికారం లేక మా జగన్ రెడ్డన్న దిగులుతో మంచం పట్టేలా ఉన్నాడు..

    అధికారం లో ఉంటె కోర్ట్ కి వెళ్ళక్కరలేదు.. సీఎం హోదాలో లండన్ ఆసుపత్రి కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లొచ్చు.. అడ్డం గా దోచుకోవచ్చు.. అన్నిటికన్నా అత్యవసరం.. రుషికొండ పాలస్ దొడ్లో ఉచ్చా పోసుకోవచ్చు..

      1. అవును.. అది ఘోరమైన తప్పిదం..

        ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి..

      2. నీ పాత కామెంట్స్ చూసా.. అవసరం లేకపోయినా జగన్ రెడ్డి భజన బ్యాచ్ లో నువ్వూ ఒకడివని అర్థమవుతోంది..

        అందుకేనా.. జగన్ రెడ్డి తప్పులు చెపుతుంటే.. తిరుపతి ఘటన గురించి చెప్పమని ఏడుస్తున్నావు..

        ..

        వివేకా హత్య గురించి అడిగితే.. ఎన్టీఆర్ వెన్నుపోటు అంటారు.. వివేకా గురించి మాత్రం ఎవరూ మాట్లాడకూడదు..

        2014 లో గోదావరి పుష్కరాల్లో చనిపోయారు అని వాదిస్తారు.. అవే కుక్కలు 2004 లో మహామేతగాడి హయాం లో కృష్ణ పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళ గురించి మాత్రం మాట్లాడకూడదు..

        ..

        మన జగన్ రెడ్డి తప్పులు మాయం.. చంద్రబాబు తప్పులు మాత్రం మహా పాతకం..

          1. కౌంటర్ ఇచ్చే విషయం లేకపోతే.. రిప్లై ఇవ్వడం మానెయ్..

            ఆడోళ్ళ పేర్లు తెచ్చి 11 కి పడిపోయారు.. ఇంకా పడిపోతే మీకే బతుకు ఉండదు..

  7. tirupathi రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 13 మంది చనిపోయారు, it’s not even accidental, it’s genocide !! దానికి ja*** గాడికి నడిరోడ్డు మీద ఉరి తీయాలి!!

    1. ఆ దుర్ఘటన గురించి ప్రెస్ కి డిటైల్డ్ గా చెప్పినందుకు.. ఆ మృతుల కుటుంబాలను అరెస్ట్ చేసాడు..

      ఇది బోనస్..

        1. మేము తప్పిదాల నుంచి పాఠం నేర్చుకొంటాం.. మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకొంటాం..

          జగన్ రెడ్డి లాగా నవంబర్ 19 న అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి 33 మంది చనిపోతే.. తీరిగ్గా డిసెంబర్ 2 న పరామర్శ కి వెళ్లే రకం కాదు..

          ఎవరు దారుణం గా ఉన్నారో నిజాలు తెలుసుకుని మాట్లాడండి..

          1. ఆడోళ్ళ పేర్లు ఎందుకు భయ్యా..

            11 కి పడిపోయారు..ఇక్కడితో ఆపేయ్..

          2. పాఠం నేర్చుకున్నాం కాబట్టే..

            గ్రీసుకు డబ్బుల్లేక గేట్లు కొట్టుకుపోయి 33 మందిని పొట్టనబెట్టుకున్న జగన్ రెడ్డి లాంటి నీచుడిని మళ్ళీ గెలిపించకూడదు అని నిరూపించుకొన్నాం..

            కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేశాం కదారా ..

            దేబ్బకు బెంగుళూరు లో పడ్డాడు.. కు క్క..

  8. From now on all Murders will be disguised as accidents and simply say sorry..

    no criminal case, criminals walkout free with sorry..

    I am not endorsing this perhaps this is how criminals will perceive it..

    what is needed is not sorry rather package for the families of lost lives…

    politicians package laaga poor people ki kuda package ivvachu..

    probably their package could be as much as 0.1% of his package from cbn..

    1. First understand the difference between Murder and accidents, it’s a mistake from TTD for not organising or arranging for the rush, What you said is true brother, biggest Murderer of his own kin is roaming around us and became CM and of course just the MLA now, we need to be very careful and make sure he is not becoming MLA again

  9. సారి చెప్పకపొతె.. కనీసం క్షమాపణ కూడా చెప్పలెదు అంటాడు. చెపితె… సారి చెపితె సరిపొతుందా అంటాడు! వీడు అంతె!

      1. అయితే ఏమి చేయమంటావ్…?

        ప్రభుత్వం దిగిపోతే పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా..?

        జగన్ రెడ్డి కి అధికారం ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా..?

        మరి రుయా ఆసుపత్రి లో చనిపోయిన పిల్లల ప్రాణాలను తీసుకొచ్చేయండి..

        అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 33 మంది చనిపోయారు.. వాళ్ళ ప్రాణాలు తెచ్చేయండి..

        LG పొలిమెర్స్ దుర్ఘటన లో చనిపోయిన వాళ్ళ ప్రాణాలు తెచ్చేయండి..

        కల్తీ సారా తాగి చనిపోయిన వేల మంది ప్రాణాలు వెనక్కి తెచ్చేయండి..

        ..

        సంతోషం గా జగన్ రెడ్డి కి అధికారం అప్పగించేస్తాం..

          1. అక్కర్లేదు.. జగన్ రెడ్డి చంపేసిన వివేకా రెడ్డి ప్రాణం తెచ్చి బతికిపొండి.. చాలు..

      2. మర్చిపోయా.. 2019 సెప్టెంబర్ లో గోదావరి నదిలో పడవ మునిగి సుమారు 20 మంది చనిపోయారు..

        వాళ్ళ ప్రాణాలు కూడా తెచ్చేయండి..

        సారీ ఫర్ ది లేట్ నోటీసు.. మీరు మర్చిపోకుండా అందరి ప్రాణాలు సూట్కేసు లో పెట్టుకుని వచ్చేయండి..

  10. What lessons did this government learn from Vijayawada floods that killed 45 people? That was also the result of utter negligence and now in Tirupathi also we see the same utter negligence. There is no meaning to the sorry without learning lessons from the mishap and also without making people accountable for their mistakes.

    1. Floods can’t be measured by anyone, even USA has this problems with climatic conditions, Yes it’s completely a very big mistake from TTD to do the needful arrangements, No doubt but at the same time people are also somehow responsible for this as we all know how senseless when we are outside, we don’t respect each other and these kind of mishaps keep happening all the time, first people need to change too

  11. క్షమించమని అడగడానికి కూడా దైర్యం కావాలి… చరిత్ర లో ఎంత మంది ఇలా చెప్పిన రాజకీయ నాయకులు ఉన్నారో చూడండి

    1. Naa department kakapoina sorry annaaru, santhosham.

      Aithe DCM gaaridi prabhutvam lo bhagam entha?

      TTD ni independent board cheddamu, Sanathana trust pedathaamu, daaniki TTD ninappagisthaamu annaaru. Adi chesi thana chithasudhini choopinchukovaali.

      Deekshalu, sorry lu saripovu.

      Inthaki laddu lo beef kalipaaraa ledaa. Kalipithe adi CBN kalipaadaa, jagan kalipaadaa, PK kalipaadaa?

Comments are closed.