వామ్మో.. ప‌వ‌న్‌కు బీఆర్ నాయుడు షాక్‌!

ఎవ‌రో ఏదో మాట్లాడార‌ని, వాట‌న్నింటికి స్పందించాల్సిన అవ‌స‌రం లేదని బీఆర్ నాయుడు ఘాటు వ్యాఖ్య చేశారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు గ‌ట్టి షాక్ ఇచ్చారు. క్ష‌మాప‌ణ చెప్ప‌డం త‌ప్ప‌, వేరే మార్గ‌మే లేద‌ని ప‌వ‌న్ అన్న కొద్ది గంట‌ల్లోనే, ఆయ‌న‌కు దిమ్మ తిరిగేలా బీఆర్ నాయుడు రియాక్ట్ కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పిఠాపురంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌సంగిస్తూ క్ష‌మాప‌ణ తానెందుకు చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. అయితే ఓట్లు అడిగిన కార‌ణంగా, బాధ్య‌త‌తో మీ అంద‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాన‌న్నారు.

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల‌రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రి, అలాగే బోర్డు స‌భ్యులంతా మీడియా స‌మావేశం నిర్వ‌హించి, మ‌రీ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అని ప‌వ‌న్ ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ మీడియా స‌మావేశం నిర్వ‌హించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడి దృష్టికి జ‌ర్న‌లిస్టులు ప‌వ‌న్ క్ష‌మాప‌ణ చెప్పాల‌నే సంగ‌తి తీసుకెళ్లారు.

బీఆర్ నాయుడు స్పందిస్తూ… క్ష‌మాప‌ణ చెప్ప‌డంలో త‌ప్పు లేదన్నారు. అయితే చెప్పినంత మాత్రాన చ‌నిపోయిన వాళ్లు బ‌తికి రారు క‌దా? అని ప్ర‌శ్నించారు. అంత‌టితో ఆయ‌న ఆగి వుంటే, టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన‌డానికి అవ‌కాశం వుండేది కాదేమో. కానీ ఎవ‌రో ఏదో మాట్లాడార‌ని, వాట‌న్నింటికి స్పందించాల్సిన అవ‌స‌రం లేదని బీఆర్ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప‌వ‌న్‌ను దారిన పోయే ఎల్ల‌య్యో, పుల్ల‌య్యో అన్న‌ట్టుగా బీఆర్ నాయుడు తీసి పారేశార‌ని జ‌న‌సేన శ్రేణులు మండిప‌డుతున్నాయి. త‌న‌ను ఖాత‌రు చేయ‌క‌పోవ‌డంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తిరుప‌తిలో తొక్కిస‌లాట‌పై ప‌వ‌న్ స్పంద‌న అంత న‌మ్మ‌ద‌గిన‌దిగా లేద‌ని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో, బీఆర్ నాయుడు పుండుపై కారం చ‌ల్లిన‌ట్టుగా మాట్లాడారని జ‌న‌సేన ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

26 Replies to “వామ్మో.. ప‌వ‌న్‌కు బీఆర్ నాయుడు షాక్‌!”

    1. ఏమి అబ్బీ మీ ఆవిడ ఇచ్చిన షాక్ కి చిప్ దొబ్బినట్లుంది, బొల్లి బాబోర్లగా వెక్కి వెక్కి ఏడవకుండా ధైర్యంగా ఉండు

  1. BR నాయుడు బేషరుత గ భక్తులందరికీ క్షమాపణ చెప్పాడు, అయన స్పీచ్ విను. అలానే పరిహారం అందచేసే టైం లో టీటీడీ రెప్రెసెంటేటివ్స్ మల్లి చెపుతారు. ఈ ప్రభుత్వాన్ని నువ్వు తప్పు పట్టలేవు. నిమ్మ కు నీరెత్తినట్ట్టు వ్యవహరించిన జగన్ తో అసలు పోల్చకు, ఇంకా ప్రజలు అవి గుర్తుకు తెచ్చుకుని వ్యతిరేకత పెరుగుతుంది.

    1. టీటీడీ చేసిన ఏర్పట్లులో తప్పేమి లేదు, ఇది ఒక దురధృష్ట కరమైన సంఘటన అని మాత్రమే అంటున్నాడు. మీకు కన్పించుటలేదా అతని ఇర్రెస్పాన్సిబులిటీ. జగన్ తో పోల్చి, కూటమి ప్రభుత్వం చేసిన తప్పు ని తప్పే కాదని ఎలా చెప్తారు.

      1. ఇక్కడ నేను ఇచ్చిన క్లారిఫికేషన్ క్షమాపణ అనే విషయం లో. పైన రాసి0ది తప్పు. జరిగింది దుర్ఘటన, తప్పెవరిది లేకపోతే ఇద్దర్ని సస్పెండ్ చేసి, ముగ్గురు ఐఏఎస్ లను ఎందుకు తప్పిస్తారు? టీటీడీ తప్పు లేదు అంటే, బాబు చేసిన సస్పెన్షన్స్, ట్రాన్స్ఫర్ తప్పు నా? నాయుడు స్టేట్మెంట్స్ ప్రభుత్వం తో అలైన్ అవ్వాలి, లేకపోతె దెబ్బ తింటాడు.

        జగన్ రుయా హాస్పిటల్ ఆక్సిజన్ లేక జరిగిన మరణాలు, వైజాగ్ లో బాయిలర్ పెలి చనిపోయిన మరణాల మీద కారణాలు వెతికి ఎవ్వరిని బాద్యుల్ని చెయ్యలేదు, పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు,ఈ ప్రభుత్వం పరిహారం తో పటు, క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంది, ఇదే నేను చెప్పింది.

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. BR Naidu should resign. He is getting bad name to Kootami. Wrong choice for this post. He is unable to coordinate and command the entire structure. Clearly negligence on his part. He should be moved to another post if need be but he is unfit in his current role.

Comments are closed.