చంద్ర‌బాబుకు ఢిల్లీ నుంచి ఝ‌ల‌క్..!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ఢిల్లీ నుంచి ఝ‌ల‌క్ త‌గిలింది. మాటెత్తితే రాష్ట్ర ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డుతూ, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల గురించి మాట్లాడే ధైర్యం చేయ‌ని టీడీపీ అధినేత‌కు కేంద్రం ఝ‌ల‌క్ ఇచ్చింది.…

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ఢిల్లీ నుంచి ఝ‌ల‌క్ త‌గిలింది. మాటెత్తితే రాష్ట్ర ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డుతూ, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల గురించి మాట్లాడే ధైర్యం చేయ‌ని టీడీపీ అధినేత‌కు కేంద్రం ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆయ‌న‌కు అతి భ‌ద్ర‌త అవ‌స‌రం లేద‌ని కేంద్రం నిర్ణ‌యించింది. చంద్ర‌బాబుకు ఎన్ఎస్జీ భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించుకుంది కేంద్ర ప్ర‌భుత్వం. దేశంలోనే బ్లాక్ క్యాట్ భ‌ద్ర‌ల‌ను క‌లిగి ఉన్న అతి త‌క్కువ‌మంది ప్ర‌ముఖుల్లో చంద్ర‌బాబు నాయుడు ఒక‌రుగా ఉన్నారు.

న‌క్స‌లైట్ల దాడిని ఎదుర్కొన్న‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు నాయుడు అపార‌మైన భ‌ద్ర‌త‌ను పొందుతూ ఉన్నారు. ప‌న్నెండేళ్ల కింద‌టి నుంచి ఎన్ఎస్జీ చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తూ ఉంది. దీని కోసం మొత్తం 25 మంది అధికారులు చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త‌గా ఉంటున్నారు. ఇలా దేశంలో అతి త‌క్కువ‌మంది ప్ర‌ముఖులు మాత్ర‌మే భ‌ద్ర‌త పొందుతున్నారు. వారిలో చంద్ర‌బాబు ఒక‌రు.

ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు సీఎం సీటు నుంచి దిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చాలా మంది ప్ర‌ముఖుల భ‌ద్ర‌త గురించి కేంద్ర హోం శాఖ స‌మీక్ష నిర్వ‌హిస్తూ ఉంది. అందులో భాగంగా ప‌లువురు ప్ర‌ముఖుల భ‌ద్ర‌త‌ను త‌గ్గిస్తూ వ‌స్తోంది. ఆ జాబితాలో చంద్ర‌బాబు  కూడా చేరారు. ఆయ‌న‌కు ఎన్ఎస్జీ భ‌ద్ర‌త‌ను ర‌ద్దు చేసింది కేంద్రం.

అధికారం కోల్పోయిన వెంట‌నే చంద్ర‌బాబుకు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ను త‌గ్గిస్తే చంద్ర‌బాబు అప్పుడు గ‌గ్గోలు పెట్టారు. అది అన్యాయం అంటూ మండిప‌డిపోయారు. కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త‌ను త‌గ్గిస్తూ కేంద్ర‌మే నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ఆధీనంలోని ఎన్ఎస్జీ సిబ్బందిని కేంద్రం వెన‌క్కు తీసుకుంది. మ‌రి దీనిపై తెలుగుదేశం ఏమంటుందో! ఇదంతా మోడీ కుట్ర అంటుందా?  లేదంటే అమిత్ షా కుట్ర అన‌గ‌ల‌దా? కేంద్రంపై మారు మాట్లాడ‌లేక‌.. దీన్ని కూడా జ‌గ‌న్ కు ఆపాదిస్తూ అక్క‌సు వెల్ల‌గ‌క్కుతుందా?