బాబీ కి దొరికే హీరో ఎవరు?

ప్రస్తుతానికి మరే హీరో ఖాళీ లేరు. ప్రస్తుతానికి కాదు, కనీసం ఏడాది వరకు ఖాళీ లేరు.ఒకే ఒక్క చాన్స్ ఏమిటంటే రవితేజ.

వాల్తేర్ వీరయ్య సినిమా తరువాత ఢాకూ మహరాజ్ సినిమా చేతిలోకి రావడానికి ఎంతో టైమ్ పట్టలేదు దర్శకుడు బాబీ కి. నిజానికి అంతకు ముందు బాబీ కి బ్లాక్ బస్టర్ లేదు. పవర్ ఓకె సినిమా. జై లవకుశ గుడ్ హిట్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీ మామ డిజాస్టర్లు. వాల్తేర్ వీరయ్య పడడం అదృష్టం. పండగ సీజన్, రవితేజ కాంబినేషన్ తో మెగాస్టార్ సినిమా. ఫ్యాన్స్ స్టఫ్. బ్లాక్ బస్టర్ అయిపోయింది. డాకూ మహరాజ్ వచ్చింది.

సినిమా తొలిసగం బాగుందనే పేరు వచ్చింది. కారణం, ఫస్ట్ హాఫ్ లో వున్న టెక్నికల్ వర్క్. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సెకండాఫ్ వీక్ అనే టాక్ వచ్చింది. కారణం, సెకండాఫ్ లో రైటింగ్ ఫాల్ట్. ముఖ్యంగా ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ దగ్గర బాబీ ఇంకా బెటర్ గా చేసి వుండాల్సింది అనే టాక్ నడిచింది. సరే, మొత్తానికి డాకూ మహారాజ్ సంగతి అలా వుంచితే, తరువాత ఏంటీ? అన్నది పాయింట్?

ఈ సినిమా తరువాత మళ్లీ మెగాస్టార్ తో సినిమా చేయాలని అనుకున్నారు బాబీ. పీపుల్స్ మీడియా నిర్మాణం. కానీ కథ రెడీగా లేదు. దీంతో అనిల్ రావిపూడికి ఆ చాన్స్ దొరికింది. ప్రస్తుతానికి మరే హీరో ఖాళీ లేరు. ప్రస్తుతానికి కాదు, కనీసం ఏడాది వరకు ఖాళీ లేరు.

ఒకే ఒక్క చాన్స్ ఏమిటంటే రవితేజ. ప్రస్తుతం చేస్తున్న మాస్ మహారాజ్ దాదాపు పూర్తి కావస్తోంది. అందువల్ల బాబీ ప్లాన్ చేస్తే రవితేజ తో సెట్ కావచ్చు. లేదు, టాప్ రేంజ్ హీరోలు కావాలి అంటే మాత్రం ఓ ఏడాది వెయింటింగ్ లో వుండాల్సిందే.

7 Replies to “బాబీ కి దొరికే హీరో ఎవరు?”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.