వింత వింత మాట‌లు చెప్తున్నారే!

చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వం హామీలు అమ‌లు చేయ‌కుండా, మాట‌ల‌తో మ‌భ్య‌పెడుతోంద‌ని ఆమె విరుచుకుప‌డ్డారు. హామీలు ఇచ్చే ముందు, రాష్ట్ర అప్పు గురించి తెలియ‌దా?

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల సోష‌ల్ మీడియా వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని నిగ్గ‌దీసి ప్ర‌శ్నించారు. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమంటే… త‌న అన్న వైఎస్ జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న లేకుండా సీఎంను ప్ర‌శ్నించ‌డం. ప్ర‌తిదానికి జ‌గ‌న్ పాల‌న‌తో లింక్ పెట్టి ష‌ర్మిల విమ‌ర్శించే సంగ‌తి తెలిసిందే. ఎందుకో తెలియ‌దు కానీ, ఇటీవ‌ల ఆమెలో కొంచెం మార్పు క‌న‌పిస్తుండ‌డం విశేషం.

చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వం హామీలు అమ‌లు చేయ‌కుండా, మాట‌ల‌తో మ‌భ్య‌పెడుతోంద‌ని ఆమె విరుచుకుప‌డ్డారు. హామీలు ఇచ్చే ముందు, రాష్ట్ర అప్పు గురించి తెలియ‌దా? అని ఆమె ప్ర‌శ్నించారు. బాబు స‌ర్కార్‌ను ష‌ర్మిల ఏ ర‌కంగా నిల‌దీశారంటే…

” ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తీరు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు గారు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం.

చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? రాష్ట్రాన్ని సహాయ పడనప్పుడు మోడీతో చెట్ట‌పట్టాలు దేనికోసం? ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో, వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్ప‌.. బాబు గారి పనితనం శూన్యం” అని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

అధికారంలో చంద్ర‌బాబు ఉన్న‌ప్ప‌టికీ, వ్య‌క్తిగ‌త కక్ష‌తో జ‌గ‌న్‌నే విమ‌ర్శిస్తున్నార‌ని ష‌ర్మిల‌పై ఆరోప‌ణ‌లున్నాయి. ష‌ర్మిల‌పై కాంగ్రెస్ నాయ‌కులు ఇదే ఆరోప‌ణ‌పై ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవ‌ల ఆమె ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వం ష‌ర్మిల‌కు హిత‌బోధ చేసి వుంటుంద‌ని, ఆమెలో వ‌చ్చిన మార్పు గ‌మ‌నించిన వాళ్లు అంటున్నారు.

24 Replies to “వింత వింత మాట‌లు చెప్తున్నారే!”

  1. జగన్ రెడ్డి ని షర్మిల తిడితే.. ఢిల్లీ లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి నొప్పి కలిగిందా.. అందుకు షర్మిల ని ఢిల్లీ కి పిలిపించుకుని మందలించారా..?

    వాబ్బో.. ఏందబ్బా సంగతి..

    అంటే యెలహంక పాలస్ లో జరిపిన మంతనాల గుసగుసలు వర్క్ అవుట్ అయినట్టేనా..!

    వైసీపీ ని కాంగ్రెస్ లో కలిపేసుకోవడం తధ్యమేనా..

    అయినా పిల్ల కాలువలను ముంచేసి కలిపేసుకోవడం కాంగ్రెస్ కి ఒక లెక్కా.. అదే జరుగుతోంది ఇక్కడ కూడా..

      1. గత నాలుగేళ్లుగా నీలాంటి పిచ్చి కుక్కల బాధే ఇది..

        అమ్మ నాన్న పెట్టిన పేరు కూడా చెప్పుకోలేని నువ్వు .. నా పుట్టుక గురించి మాట్లాడటం.. కామెడీ కదూ..

  2. సoక్షేమాలు మితిమీరిపోయాయి. ఇప్పుడున్నవే చాలా ఎక్కువ. వాటిని కూడా తగ్గించి రాష్ట్రానికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయండి చాలు.

    1. avuna .. super six adhikaram ichindi ani meru anukuntunnara ..ayithe navaratnalu 99% satham hamalu chesina odipoyaru emiti cheppama .. nayana palan ante panchudu kadhu .. ani eppatiki mee batch telusu kuntaru ..

    1. నా కామెంట్స్ కి కూడా భయపడుతున్నారా..?

      ఇక సింగల్ సింహాలు పార్టీ ఎలా నడపగలరు.. ఆలోచించుకోండి..

      నీలాంటి పిచ్చి కుక్కల కామెంట్స్ చూసినప్పుడే నాకు అనిపిస్తుంది.. వైసీపీ నో మోర్ ..

        1. రాష్ట్రం బాగుపడిపోతోందనే కడుపు ఉబ్బరం.. కడుపు మంట .. కళ్ళ లో నిప్పులు..

          ఒక్క ఆర్టికల్ రాయడానికి .. అస్సలు చేతులు రావడం లేదు..

          రేపు సాక్షి పేపర్ కోసం వెయిటింగ్..

          ఈ దరిద్రుల అసలు జీవితం ఎంత దారిద్రమో .. ఎంత నీచమో.. ఈ ఒక్క ఉదాహరణ చాలు..

          ..

          రేపు పోలవరం కాఫర్ డ్యామ్ పనులు మొదలవబోతోంది.. 35 లక్షల ఎకరాలకు జీవనాధారం..

          ..

          ఆంధ్ర రాష్ట్రం.. నిజం గా అన్నపూర్ణ గా మారబోతోంది..

          ఏడ్చేవాళ్ళు ఏడవనీ.. బొచ్చు కూడా ఊడదు ..

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. ప్లే బాయ్ వర్క్ :- ఏడు తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.