టీడీపీ ఎమ్మెల్సీ అనుచ‌రుడిని చిత‌క్కొట్టిన బీటెక్ వ‌ర్గీయులు!

మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ ర‌వి, అత‌ని అరాచ‌కాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ ర‌వి, అత‌ని అరాచ‌కాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చివ‌రికి సొంత పార్టీ, అలాగే కూట‌మి భాగ‌స్వామ్య ప‌క్ష‌మైన జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడికి తెగ‌బ‌డే దుస్థితిని బీటెక్ ర‌వి తీసుకొచ్చార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇసుక రీచ్ టెండ‌ర్ విష‌య‌మై క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌లో జ‌న‌సేన నాయ‌కుల‌పై బీటెక్ ర‌వి వ‌ర్గీయుల దాడిని మ‌రిచిపోక‌నే, పులివెందుల‌లో ఇవాళ సొంత పార్టీ కార్య‌క‌ర్త‌ను కిడ్నాప్ చేసి మ‌రీ చిత‌క్కొట్ట‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

బీటెక్ ర‌వి వ‌ర్గీయుల దాడిని నిర‌సిస్తూ, అధికార పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి భార్య ఉమాదేవి ధ‌ర్నాకు దిగాల్సి వ‌చ్చింది. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో 70కి పైగా రేష‌న్ షాపుల‌కు డీల‌ర్ల‌ను నియ‌మించేందుకు ప్ర‌భుత్వం రాత ప‌రీక్ష పెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా వేంప‌ల్లెలోని ఒక దుకాణానికి సంబంధించి ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అనుచ‌రుడు ప్ర‌కాశ్‌ పులివెందుల‌లోని ఒక పాఠ‌శాలలో ప‌రీక్ష రాయ‌డానికి వెళ్లాడు.

పాఠ‌శాల వ‌ద్ద కాచుక్కూచున్న బీటెక్ ర‌వి వ‌ర్గీయులు ప్ర‌కాశ్‌ను ఎత్తుకెళ్లి తీవ్రంగా కొట్టారు. దీంతో అత‌నికి గాయాల‌య్యాయి. ఈ విష‌యం తెలిసి ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి భార్య ఉమాదేవి ప‌రీక్ష కేంద్ర‌మైన పాఠ‌శాల వ‌ద్ద ధ‌ర్నాకు దిగారు. ప్ర‌కాశ్‌ను వ‌దిలి పెట్టాల‌ని ఆమె డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు భారీ సంఖ్య‌లో పాఠ‌శాల వ‌ద్ద‌కు వెళ్లారు.

ప‌ట్ట‌ప‌గ‌లు సొంత పార్టీ కార్య‌క‌ర్త‌ను బీటెక్ ర‌వి వ‌ర్గీయులు ఎత్తుకెళ్లి కొట్టినా దిక్కు లేదా? అని ఆమె పోలీసుల్ని నిల‌దీశారు. దీంతో బీటెక్ ర‌వి వ‌ర్గీయుల అదుపులో ఉన్న రాంగోపాల్‌రెడ్డి అనుచ‌రుడిని విడిపించుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌తో పులివెందుల టీడీపీలో విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌రోవైపు శాంతిభ‌ద్ర‌త‌లు ఎంత‌గా క్షీణించాయో అర్థం చేసుకోవ‌చ్చ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

7 Replies to “టీడీపీ ఎమ్మెల్సీ అనుచ‌రుడిని చిత‌క్కొట్టిన బీటెక్ వ‌ర్గీయులు!”

  1. future news – ja*** ని చితక్కొట్టిన పులివెందుల ప్రజలు!! అడ్డొచ్చిన సజ్జల, visa రెడ్డి , అవినా ‘ బావ లని కూడా రోడ్ల మీద పొర్లించి పొర్లించి కొట్టిన జనం, గోడ దూకి blore పారిపోయిన వైనం!!

  2. జనాలు ఎందుకు అధికారం ఇచ్చారు… దోచుకోవడానికే కదా… ఆ మాత్రం హక్కు లేదా… వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు అని నీ బాధా.. దోచుకోవడానికి మాకు ఎవరైనా ఓకే..

  3. అక్కడటీడీపీ కార్యకర్తలు ఉంటే ఇవ్వాలి అవకాశం..ఎవడు పడితే వాడు వేస్తా అంటే ఎవరూ ఒప్పుకోరు కదా..

    1. హ.. కదా.. మనం అధికారంలో ఉన్నప్పుడు … మనోళ్లకే అన్నీ ఇవ్వాలి.. అవతలోడు అధికారంలో ఉంటె నీతులు చెప్పాలి..

  4. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  5. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు,రెండు,ఐదు, ఐదు

Comments are closed.