టీడీపీ ఇన్‌చార్జ్‌పై ర‌గులుతున్న కూట‌మి నేత‌లు!

ముక్కా రూపానంద‌రెడ్డిపై ఆ నియోజ‌క వ‌ర్గానికి చెందిన టీడీపీ, జ‌న‌సేన‌కు చెందిన క‌మ్మ‌, బ‌లిజ నాయ‌కులు ర‌గులుతున్నారు.

అన్న‌మ‌య్య జిల్లా రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌, కుడా చైర్మ‌న్ ముక్కా రూపానంద‌రెడ్డిపై ఆ నియోజ‌క వ‌ర్గానికి చెందిన టీడీపీ, జ‌న‌సేన‌కు చెందిన క‌మ్మ‌, బ‌లిజ నాయ‌కులు ర‌గులుతున్నారు. రూపానంద‌రెడ్డి త‌మ‌ను పూర్తిగా విస్మ‌రించి, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో క‌లుపుకుని వెళ్ల‌డం లేద‌ని ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే త‌న వ‌ల్లే రైల్వేకోడూరులో వైసీపీని గ‌ద్దె దింపి, జ‌న‌సేన పార్టీని గెలిపించుకున్నామ‌ని రూపానంద‌రెడ్డి అంటున్నారు.

వైసీపీలో త‌న‌కు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గౌర‌వం ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో ఆ పార్టీని ముక్కా వీడారు. అనంత‌రం టీడీపీలో చేరారు. రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని జ‌న‌సేన‌కు కేటాయించారు. త‌న వ‌ర్గానికి చెందిన అర‌వ శ్రీ‌ధ‌ర్‌కు జ‌న‌సేన టికెట్‌ను రూపానంద‌రెడ్డి ఇప్పించుకోగ‌లిగారు. ఎన్నిక‌ల్లో విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

అంత వ‌ర‌కూ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కస్తూరి విశ్వ‌నాథ‌నాయుడిని కాద‌ని, రూపానంద‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ఆయ‌న‌కు రుచించ‌లేదు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌ను గెలిపించుకోవ‌డంతో రూపానంద‌రెడ్డి ప‌లుకుబ‌డి పెరిగింది. అందుకే ఆయ‌న‌కు క‌డ‌ప అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ఇచ్చారు. మ‌రోవైపు రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయ‌కుడు బ‌త్యాల చెంగ‌ల్రాయులు, విశ్వ‌నాథ‌నాయుడు, అలాగే జ‌న‌సేనకు చెందిన బ‌లిజ నాయ‌కుల్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టార‌న్న అసంతృప్తి వాళ్ల‌లో తీవ్రంగా వుంది.

మ‌రోవైపు త‌న‌కు వ్య‌తిరేకంగా టీడీపీ అనుకూల మీడియాలో క‌థ‌నాలు రాయిస్తున్నార‌ని కూట‌మి నేత‌ల‌పై రూపానంద‌రెడ్డి ఆగ్ర‌హంగా ఉన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వాళ్ల‌ను ద‌గ్గ‌రికి తీసుకునే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌ని ఆయ‌న తేల్చి చెబుతున్నారు. దీంతో రైల్వేకోడూరులో కూట‌మిలో వ‌ర్గ‌పోరు తీవ్ర‌స్థాయికి చేరింద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.

4 Replies to “టీడీపీ ఇన్‌చార్జ్‌పై ర‌గులుతున్న కూట‌మి నేత‌లు!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. తీరిగి పొట్ట చేతితో పట్టుకొని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపొండి మీ paytm డబ్బులు మీ మీ అకౌంట్లలలో పడతాయి..

Comments are closed.