తక్కువ ఖర్చుతో కాజల్ లా కనిపించడం సాధ్యమా?

తక్కువ మేకప్ తో ఎక్కువ అందంగా కనిపించాలని అమ్మాయిలకు ఉంటుంది. తక్కువ మేకప్ మాత్రమే కాదు, కాస్మొటిక్స్ విషయంలో తక్కువగా ఖర్చు పెట్టాలనే అమ్మాయిలు కూడా సింపుల్ గా కాజల్ ను ఫాలో అయిపోవచ్చు.…

తక్కువ మేకప్ తో ఎక్కువ అందంగా కనిపించాలని అమ్మాయిలకు ఉంటుంది. తక్కువ మేకప్ మాత్రమే కాదు, కాస్మొటిక్స్ విషయంలో తక్కువగా ఖర్చు పెట్టాలనే అమ్మాయిలు కూడా సింపుల్ గా కాజల్ ను ఫాలో అయిపోవచ్చు. తక్కువ కాస్మొటిక్స్ వాడుతూ, ఎక్కువ నిగారింపు సొంతం చేసుకోవడం ఎలానో కాజల్ చెబుతోంది. ఓ లుక్కేయండి.

చూడగానే ఎట్రాక్ట్ చేయాలంటే కళ్లకు రంగు వేయాల్సిందే. కంటి పైభాగంలో పాప్-ఐలైనర్స్ వాడితే ఎవర్నైనా ఇట్టే ఆకర్షించవచ్చు. దీనికి పెద్దగా మేకప్ అవసరం లేదు. ఐ-లైనర్ ఉంటే చాలంటోంది కాజల్. వీటిలో కూడా ఏ కలర్స్ వాడాలనే కన్ఫ్యూజన్ ఉంటే.. ఇక్కడ కూడా కాజల్ ను ఫాలో అయిపోవచ్చు. ఆమె బ్లూ, పర్పుల్ కలర్స్ నే ఎక్కువగా వాడుతుంది.

“నో మేకప్ లుక్”.. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న ట్రెండ్. ఇలా కనిపించాలనుకునే అమ్మాయిల కోసం ఓ సింపుల్ టెక్నిక్ చెబుతోంది కాజల్. చెంపలకు బ్లష్ చేస్తే చాలంటోంది. ఇలా చేయడం వల్ల ముఖం నిగారింపుగా కనిపిస్తుంది. మేకప్ లేకపోయినా అందం రెట్టింపు అవుతుంది.

చాలా తక్కువ టైమ్ ఉంది. మేకప్ కు టైమ్ లేదు. పార్టీకి వెళ్లాలి. మరేం చేయాలి. దీనికి కూడా కాజల్ దగ్గర ఓ చిట్కా ఉంది. సింపుల్ గా పింక్ కలర్ ను సెలక్ట్ చేసుకోమంటోంది కాజల్. పింక్ కలర్ లిప్ బామ్, పింక్ కలర్ ఐషాడో పెట్టుకుంటే చాలు, పార్టీ లుక్ వచ్చేస్తుందని చెబుతోంది.

ఇక అత్యంత తక్కువ ఖర్చుతో, ఎక్కువ  ఎట్రాక్షన్ సొంతం చేసుకోవాలనుకుంటే ఏకైక ఆప్షన్ కాటుక. కళ్లకు కాటుక పెట్టుకుంటే ఆకర్షణ దానంతట అదే వస్తుంది. కాటుక కళ్లతో ఓ ఊర చూపు చూస్తే, ప్రపంచంలో అంతకుమించిన ఆకర్షణ మరొకటి లేదంటోంది కాజల్.

ఈ టిప్స్ తో పాటు ఇంకాస్త ఖర్చు పెట్టగలిగితే, మేకప్ కు ఇంకాస్త సమయం దొరికితే కనుబొమలు, కనురెప్పలపై దృష్టిపెట్టాలని చెబుతోంది కాజల్. ఒకవేళ అదంతా సాధ్యంకాదని భావిస్తే, పైన చెప్పిన సింపుల్ టిప్స్ ను ఫాలో అయితే చాలంటోంది.