ఆరు నూరైనా ఏజెంట్ డేట్ మారదట

అక్కినేని అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తయారవుతూనే వున్న సినిమా ఏజెంట్. అఖిల్ చేతిలో వున్న సినిమా ఇదొక్కటే. సురేందర్ రెడ్డి ప్రస్తుతానికి టేకప్ చేసిందీ ఇదొక్కటే. కానీ చిరకాలంగా చెక్కుతూనే వున్నారు.  Advertisement…

అక్కినేని అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తయారవుతూనే వున్న సినిమా ఏజెంట్. అఖిల్ చేతిలో వున్న సినిమా ఇదొక్కటే. సురేందర్ రెడ్డి ప్రస్తుతానికి టేకప్ చేసిందీ ఇదొక్కటే. కానీ చిరకాలంగా చెక్కుతూనే వున్నారు. 

నలభై కోట్లు అనుకున్న బడ్జెట్ ను ఎనభై కోట్లు చేసారు. నిర్మాత అనిల్ సుంకర అలా భరించుకుంటూ వస్తున్నారు. తన ఫ్రస్టేషన్ పీక్స్ కు వెళ్లి ఎక్కడ గొడవ అవుతుందో అని వీలయినంత దూరంగా వుంటూ వస్తున్నారు.

ఇప్పటికీ ఇంకా ఓ పాట, కొంత ప్యాచ్ వర్క్ మిగిలే వుందట. సినిమా తాజా డేట్ ఏప్రిల్ 28. అంటే దాదాపు నెల మీద పది రోజులు..అయినా కూడా సినిమా విడుదల వుంటుందా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీని మీద వాకబు చేస్తే, అటు సూర్యుడు ఇటు పొడిచినా సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తామని నిర్మాత అనిల్ సుంకర అంటున్నారని తెలుస్తోంది. అవసరం అయితే పాట లేకుండానే విడుదల చేసేస్తానని కూడా అంటున్నారట.

సినిమాలో వున్న ఒకే ఒక మాస్ సాంగ్ ఇది. ఇది బాగా రావాల్సి వుంది. మరి సురేందర్ రెడ్డి ఎందుకు నిర్మాతతో, సినిమాతో ఇలా ఆడేసుకుంటున్నారో ఆయనకే తెలియాలి. అసలు అక్కినేని అఖిల్ లక్ నే ఇలా వుందేమో? అటు సైరా సినిమా కూడా ఇలాగే ఓవర్ అంటే ఓవర్ బడ్జెట్ అయిందన్న టాక్ వుంది. 

ఇప్పుడు ఈ సినిమా ఇలా అవుతోంది. ఇలా చేస్తుంటే సురేందర్ రెడ్డి అంటే నిర్మాతలు భయపడిపోయే ప్రమాదం వుందేమో?