సింహం వేటాడేస్తదీ…?

బాలయ్య డైలాగుల్లో చెప్పాలీ అంటే సింహం తనకు ఎదురుగా ఎవరు వచ్చినా లేక తాను ఎదురెల్లినా కూడా అవతల జంతువుకే యమ డేంజర్. ఎందుకంటే సింహం కసిగా వేటాడేస్తుంది. దాని సౌండ్ కే అవతలి…

బాలయ్య డైలాగుల్లో చెప్పాలీ అంటే సింహం తనకు ఎదురుగా ఎవరు వచ్చినా లేక తాను ఎదురెల్లినా కూడా అవతల జంతువుకే యమ డేంజర్. ఎందుకంటే సింహం కసిగా వేటాడేస్తుంది. దాని సౌండ్ కే అవతలి జంతువు హార్ట్ ఆగి  చస్తుంది.

కట్ చేస్తే సింహాన్ని పౌరుషానికి ప్రతీకగా సినిమాల్లో హీరోలకు ఆపాదించి మరీ రచయితల చేత భారీ డైలాగులను డైరెక్టర్లు రాయిస్తూంటారు. ఇపుడు రాజకీయాల్లో కూడా సింహాలు ఉన్నాయని వైసీపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ చెబుతున్నారు.

నిజానికి ఇప్పటికే సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వైసీపీకి ఒక క్యాచీ డైలాగ్  ఉంది. దాన్నే కాస్తా మార్చి జగన్ సింహం. రాజకీయాల్లో రారాజు అంటూ కితాబులు ఇచ్చారు ధర్మాన‌. జగన్ దారి రహ‌దారి. ఆయన ఒంటరిగాన బరిలోకి దిగుతారు. ఆయన్ని ఢీ కొట్టేందుకు ఎన్ని పార్టీలు గుంపులుగా కలసికట్టిగా వచ్చినా కూడా రిజల్ట్ చాలా బ్యాడ్ గా ఉంటుంది అంటున్నారు ధర్మాన.

జగన్ ని ఓడించాలని ఇప్పటికే ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు కలవాలని చూస్తున్నాయని ఆయన అంటున్నారు. బీజేపీ జనసేనలతో టీడీపీ పొత్తులు పెట్టుకుంటుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ధర్మాన కామెంట్స్ చేయడం ఆసక్తికరమైన పరిణామం.

సరే రాజకీయాల్లో  ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు, కానీ జగన్ ని ఓడించాలని చూస్తే ఆశాభంగం తప్పదు, ఎన్ని పార్టీలు ఏకమైనా కూడా అసలైన విజేత జగన్ మాత్రమే అని ధర్మాన తీర్పు చెప్పేశారు. ఇక జగన్ లాంటి సీఎం ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉందని ఆయన సూచించారు.

దుష్టశక్తులతో జగన్ పోరాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎపుడూ అండగా ఉంటారని, అదే టైమ్ లో ఆయనకు కూడా ప్రజలు అండగా ఉండాలని ధర్మాన సందేశం ఇచ్చారు. మొత్తానికి జగన్ ఏపీకి రాజకీయ సింహం అని మరోసారి పొలిటికల్ పార్టీలకు ఎలుగెత్తి చాటారు ధర్మాన.