ధనుష్ చాలా సింపుల్ గురూ

తమిళ హీరో ధనుష్ సినిమాలు ఎంత సింపుల్ గా వుంటాయో, అతగాడూ అంత సింపుల్ గానే వుంటాడు. చుట్టూ కండలు తిరిగిన బౌన్సర్లు పాతిక మంది వుండరు.  Advertisement జిగేల్ జిగేల్ మనే డ్రెస్…

తమిళ హీరో ధనుష్ సినిమాలు ఎంత సింపుల్ గా వుంటాయో, అతగాడూ అంత సింపుల్ గానే వుంటాడు. చుట్టూ కండలు తిరిగిన బౌన్సర్లు పాతిక మంది వుండరు. 

జిగేల్ జిగేల్ మనే డ్రెస్ లు ఏవీ వేసుకుని ఫంక్షన్లకు రాడు. హీందీలో నేరుగా సినిమాలు చేసిన హీరో. తమిళ, తెలుగు మార్కెట్ వున్న హీరో.

ఇలాంటి హీరో తన సినిమాకు కాస్ట్యూమ్స్ కోసం తీసుకునే అమౌంట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యంగా వుంటుంది. జస్ట్ ఏడెనిమిది లక్షలు. ఓ సినిమా డ్రెస్ లకు ఏడెనిమిది లక్షలా అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ మన హీరోల సంగతి తెలిస్తే ఆశ్చర్యపోవడం కాదు. ఏకంగా మూర్ఛ పోవడమే.

మన టాప్ హీరోల కాస్ట్యూమ్స్ ఖర్చు ఏకంగా కోటి వరకు వుంటుంది. మేకప్ ఖర్చే కోట్లలో వుంటుంది. మన హీరోలు కోట్లలో కాస్ట్యూమ్స్ కోసం తీసుకుంటే ధనుష్ లాంటి పాన్ ఇండియా హీరో జస్ట్ ఏడెనిమిది లక్షలు తీసుకోవడం అతని సింప్లిసిటీకి ఉదాహరణ.