స్టార్ హీరో వేధింపులు.. క్లారిటీ ఇచ్చిన నిత్యామీనన్

ఓ వెబ్ సిరీస్ చేసింది నిత్యామీనన్. ప్రస్తుతం దాని ప్రచారం పనిలోనే ఉంది. ఇందులో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఓ సెక్షన్ మీడియా రాసుకొచ్చింది. అదేంటంటే.. Advertisement…

ఓ వెబ్ సిరీస్ చేసింది నిత్యామీనన్. ప్రస్తుతం దాని ప్రచారం పనిలోనే ఉంది. ఇందులో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఓ సెక్షన్ మీడియా రాసుకొచ్చింది. అదేంటంటే..

“తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ తమిళ ఫిలిం ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. మరీ మఖ్యంగా ఓ సినిమా షూటింగ్ లో  ఓ తమిళ హీరో నన్ను బాగా వేధింపులకు గురిచేశాడు.”

ఇలా నిత్యామీనన్, కోలీవుడ్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసినట్టు కొంతమంది రాసుకొచ్చారు. ఈ క్రమంలో ఆమెతో సినిమాలు చేసిన ధనుష్, దుల్కర్ సల్మాన్, అధర్వ, సూర్య లాంటి హీరోల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. ఇలా ఊహించని విధంగా తనపై జరుగుతున్న అసత్య ప్రచారంతో నిత్యామీనన్ ఉక్కిరిబిక్కిరైంది.

వెంటనే ఆమె ఇనస్టాగ్రామ్ లో స్పందించింది. ప్రతి ఒక్కరం ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలం ఉంటామని, ఈ కొద్ది కాలంలోనే ఒకరికి ఒకరం ఎంత బురద జల్లుకుంటామంటూ ప్రశ్నించింది. తనపై వచ్చిన కథనాల్ని ఖండించిన నిత్యామీనన్, ఈ పుకార్లను వ్యాప్తి చేసిన హ్యాండిల్స్ ను వెదికి పట్టుకుంది.

సదరు హ్యాండిల్స్ ను ట్యాగ్ చేసిన నిత్యామీనన్, అసలు నిందితులు వీళ్లేనంటూ అందరికీ బహిర్గతం చేసింది. ఇప్పటికైనా మనుషుల్లా ఉండాలంటూ క్లాస్ పీకింది. మొత్తమ్మీద నిత్యామీనన్ ప్రకటనతో, ఆమె చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఫేక్ అని తేలింది.