బన్నీ యూనిట్ ఖర్చుతో మహేష్ కవరేజ్

ఎవరో ఏదో చేస్తారు..మరెవరో లాభం చేసుకుంటారు. ఇదే జరిగింది సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల విషయంలో. పేపర్లు అన్నీ తెలుగు భాష..తెలుగు మాధ్యమం అంటుంటే, 'మా పిల్లలకు కూడా తెలుగు నేర్పిస్తున్నాం..నాన్నా అని…

ఎవరో ఏదో చేస్తారు..మరెవరో లాభం చేసుకుంటారు. ఇదే జరిగింది సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల విషయంలో. పేపర్లు అన్నీ తెలుగు భాష..తెలుగు మాధ్యమం అంటుంటే, 'మా పిల్లలకు కూడా తెలుగు నేర్పిస్తున్నాం..నాన్నా అని పిలిపించుకుంటున్నాం' అంటారు హీరోలు. కానీ ఇంగ్లీష్ మీడియా, నేషనల్ మీడియా అంటే మాత్రం కిందా మీదా అయిపోతుంటారు.

బన్నీ సినిమా అల వైకుంఠపురములో మ్యూజికల్ ఫంక్షన్ కవరేజ్ కోసం నేషనల్ మీడియాను నిర్మాత ఖర్చుతో ఫ్లయిట్ టికెట్ లు వేసి మరీ పిలిపించారు హైదరాబాద్ కు. రాను పోను ఫ్లయిట్ ఖర్చులు, పైగా ఇక్కడ హోస్టింగ్ ఖర్చులు. సరే, ఆ మేరకు బన్నీ సినిమాకు కవరేజ్ బాగానే వచ్చింది. సో హ్యాపీ.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, బన్నీ యూనిట్ ఖర్చులు పెట్టి నేషనల్ మీడియాను రప్పిస్తే, ఎలాగూ వచ్చాం కదా, అని అదే మీడియా మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరు వ్యవహారాలు కూడా తెలుసుకుని వెళ్లింది. పైసా ఖర్చు లేకుండా మహేష్ సినిమాకు కూడా నేషనల్ మీడియా కవరేజ్ వచ్చేసిందన్నమాట. అదృష్టం అంటే ఇదేనేమో?

త్రివిక్రమ్ ఫ‌వ‌ర్ పూల్ స్వీచ్