మరోసారి సోలోగా వస్తున్న భీష్మ

ఈ ఇయర్ స్టార్టింగ్ లో హీరో నితిన్ కు సోలో రిలీజ్ దొరికింది. సంక్రాంతి సందడి మొత్తం ముగిసిన తర్వాత తీరిగ్గా బాక్సాఫీస్ బరిలోకి వచ్చిన నితిన్.. భీష్మతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. లాక్…

ఈ ఇయర్ స్టార్టింగ్ లో హీరో నితిన్ కు సోలో రిలీజ్ దొరికింది. సంక్రాంతి సందడి మొత్తం ముగిసిన తర్వాత తీరిగ్గా బాక్సాఫీస్ బరిలోకి వచ్చిన నితిన్.. భీష్మతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. లాక్ డౌన్ పడకపోయి ఉంటే ఈ సినిమా మరిన్ని వసూళ్లు, రికార్డులు సాధించి ఉండేది. ఆ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు మరోసారి నితిన్ కు సోలో రిలీజ్ దొరికింది. ఈసారి బుల్లితెరపై.

దసరా కానుకగా రేపు భీష్మ సినిమాను ప్రసారం చేయబోతోంది జెమినీ ఛానెల్. రేపు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఉంది. ఇక్కడ కూడా స్టార్ మా ఛానెల్, జీ తెలుగు నుంచి భీష్మకు ఎలాంటి పోటీ లేదు.

ముందుగా స్టార్ మా విషయానికొద్దాం.. ఈ సినిమా కూడా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సిద్ధం చేసింది. కాకపోతే అదొక డబ్బింగ్ మూవీ. ఉదయనిధి స్టాలిన్, అదితిరావు, నిత్యామీనన్ నటించిన సైకో అనే మర్డర్ మిస్టరీ సినిమాను అది టెలికాస్ట్ చేస్తోంది. పైగా మధ్యాహ్నం వేళలో. కాబట్టి ఎలా చూసుకున్నా, భీష్మకు ఇది పోటీ కాదు.

ఇక జీ తెలుగు విషయానికొద్దాం. ఈ ఛానెల్ కూడా ఓ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను రెడీ చేసింది. అప్పుడెప్పుడో సుదీప్ చేసిన కోటికొక్కడు అనే సినిమాను ప్రసారం చేస్తోంది. ఇది కూడా మధ్యాహ్నమే వస్తోంది కాబట్టి.. కంటెంట్ పరంగా, స్లాట్ పరంగా భీష్మకు పోటీ కాదు.

నిజానికి ఇదే ఛానెల్ లో కొన్ని రోజుల కిందట సాహో సినిమా టెలికాస్ట్ అయింది. అదే సినిమాను దసరాకు షెడ్యూల్ చేసినట్టయితే బాగుండేది. కానీ ఎందుకో సదరు ఛానెల్ అత్యుత్సాహపడి, ఎలాంటి అకేషన్ లేని టైమ్ చూసి సినిమాను టెలికాస్ట్ చేసింది.

మొత్తమ్మీద భీష్మకు మరోసారి సోలో రిలీజ్ దక్కినట్టయింది. ఆ టైమ్ కు జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా ఛానెళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం కాబోతున్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మల్టీప్లెక్సుల్లో భీష్మ సినిమానే ఆడుతోంది. 

అది బిహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారట