సిట్ చిట్టా చూస్తే దందా బ్యాచ్ నెత్తిన తడిగుడ్డే?

విశాఖ మహా నగరం. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయంలేదు. ఇపుడు దానిని పాలనా రాజధానిని చేసి మరీ మరో కొత్త కిరీటం పెట్టింది వైసీపీ సర్కార్. ఇంతటి మెగా సిటీలో ప్రభుత్వ భూములు…

విశాఖ మహా నగరం. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయంలేదు. ఇపుడు దానిని పాలనా రాజధానిని చేసి మరీ మరో కొత్త కిరీటం పెట్టింది వైసీపీ సర్కార్. ఇంతటి మెగా సిటీలో ప్రభుత్వ భూములు మాత్రం పెద్దగా లేవంటే భూమాతే నవ్విపోతుంది.

అవును మరి పురాణాల‌ కాలం నాటి రాక్షసుడు  హిరణ్యాక్షుడి మాదిరిగా చాలా మంది పెద్దతల‌లు, పెత్తందార్లు ఆ భూములను చాప చుట్టేశారు. దాంతో విశాఖ రాజధాని అయితే సర్కార్ వారికి ఏ ప్రగతి పని తలపెట్టాలన్నా సెంటు జాగా కోసమైనా వెతుక్కోవాల్సిందే.

దాంతో వైసీపీ సర్కార్ సిట్ పేరిట విచారణ జరిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పెద్దల వద్ద  కబ్జా కామందుల చిట్టా అంతా రెడీగా ఉందిట. వారూ వీరూ అన్న తేడా లేకుండా ఎక్కడ భూమి ఆక్రమణ అయిందో చూసి మరీ గునపం దించేయడానికి అధికారులు రెడీ అవుతున్నారు.

దాంతో నడమంత్రం సిరిలా భూములను గుప్పిటపట్టిన వారికి గుండె దడ పుట్టొచ్చు అంటున్నారు. విశాఖ భూకంపం ప్రకంపనలు కూడా రాజకీయంగా పెద్ద సునామీకే దారి తీయవచ్చునని కూడా అంటున్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారీ గోడతో మొదలుపెట్టి, గీతం విద్యా సంస్థల దాకా వచ్చిన ఈ యాక్షన్ పార్టు ఇంకా ఎటువైపు సాగుతుందోనని అక్రమార్కులు తెగ టెన్షన్ పడుతున్నారుట.

అయితే ఇది అంతం కాదు ఆరంభం అని వైసీపీ నేతలు అంటున్నారు. గీతం విద్యా సంస్థ 800 కోట్ల రూపాయల విలువ చేసే 40 ఎకరాల భూములను కబ్జా చేతే ఊరుకోవాలా అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ గర్జిస్తున్నారు. మొత్తానికి సిట్ నివేదిక పూర్తిగా చేతికి వస్తే ఎన్ని భూముల్లో, మరెన్ని అక్రమ భవనాల్లో  గునపాలు దిగుతాయో లెక్కలు కట్టాల్సిందే.

అది బిహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారట