మిస్ ఇండియా..ఓ బ్రాండ్

కీర్తి సురేష్ కీలకపాత్రలో నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మిస్ ఇండియా. మహేష్ కోనేరు నిర్మాత. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 4న విడుదలవుతున్న సందర్భంగా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు. …

కీర్తి సురేష్ కీలకపాత్రలో నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మిస్ ఇండియా. మహేష్ కోనేరు నిర్మాత. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 4న విడుదలవుతున్న సందర్భంగా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు. 

ట్రయిలర్ ను థియేటర్ ట్రయిలర్ మాదిరిగా కాకుండా ఓటిటి ట్రయిలర్ మాదిరిగా కట్ చేయడం విశేషం. కథను ఎట్ ఎ గ్లాన్స్ నెరేట్ చేస్తున్నట్లుగా ట్రయిలర్ ను కట్ చేసారు. ట్రయిలర్ చూడగానే సినిమా కథ ఏమిటి అన్నది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

ఓ మధ్యతరగతి అమ్మాయి, ఓ బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదగాలనే తన కలను ఎలా నెరవేర్చుకున్నది అన్న కాన్సెప్ట్ తో సినిమా చేసినట్లు తెలుస్తోంది.

కీర్తి సురేష్ పక్కాగా ఓ యంగ్ బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్ మాదిరిగా కనిపించింది. జగపతిబాబుకు ఇలాంటి క్యారెక్టర్లు అలవాటైపోయాయి.  ట్రయిలర్ కలర్ ఫుల్ గా వుంది. ట్రయిలర్ కట్ కాస్త ఫ్లాట్ గా వున్నా, లోకేషన్లు, ఫ్రేమింగ్ ఇంట్రస్ట్ గా వుంది.