గీతం మీద గునపం దిగింది…!

విశాఖలో ప్రతిష్టాత్మకమైన గీతం విద్యా సంస్థల మీద రెవిన్యూ  గునపం దిగింది. దాదాపుగా 40.51 ఎకరాలు గీతం క్యాంపస్ పేరిట కబ్జా చేసినట్లుగా విశాఖ  రెవిన్యూ అధికారులు ఆధారాలతో సహా  లెక్క తేల్చడంతో  ఆక్రమ…

విశాఖలో ప్రతిష్టాత్మకమైన గీతం విద్యా సంస్థల మీద రెవిన్యూ  గునపం దిగింది. దాదాపుగా 40.51 ఎకరాలు గీతం క్యాంపస్ పేరిట కబ్జా చేసినట్లుగా విశాఖ  రెవిన్యూ అధికారులు ఆధారాలతో సహా  లెక్క తేల్చడంతో  ఆక్రమ నిర్మాణాలపైన గునపం వేటు పడింది.

గీతం క్యాంపస్ పరిసరాల్లో అక్రమణలను తొలగించే క్రమంలో అధికారులు రంగంలోకి దిగిపోయారు. అక్రమ కట్టడాలను తొలగించే పనిని శరవేగంగా  సాగిస్తున్నారు. నిజానికి గీతం విద్యా సంస్థల చరిత్ర నాలుగు దశాబ్దాల నాటిది. నాటి నుంచి నేడు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములకు ఆక్రమించారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.

అయితే వాటిని ఆధారసహితంగా తేల్చిన రెవిన్యూ యంత్రాంగం రంగంలోకి దిగి హుటాహుటిన తొలగించే పనులను మొదలెట్టింది. దీంతో టీడీపీ గుండేల్లో ఒక్కసారిగా రైళ్ళు పరిగెడుతున్నాయి.

గీతం వ్యవస్థాపకుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తి చంద్రబాబుకు చుట్టం. ఆయన విశాఖ నుంచి రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన మనవడు, సినీ నటుడు బాలక్రిష్ణ చిన్న అల్లుడు అయిన శ్రీ భరత్ గత ఏడాది ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన  ఇపుడు గీతం విద్యా సంస్థల అధినేతగా ఉంటున్నారు.

అయితే గీతం సంస్థ సమీపంలోని రుషికొండ, ఎండాడలలో పెద్ద ఎత్తున భూములు కబ్జా చేసిందని విశాఖ రెవిన్యూ అధికారులు నిర్దారించారు. దాంతో వాటి కూల్చివేత పనులు మొదలెట్టారు. ఇదిపుడు టీడీపీకి కొత్త పొలిటికల్ టాపిక్ గా మారనుంది మరి.

ఆర్ఆర్ఆర్ లో అదే ట్విస్ట్ అంట