మీడియం రేంజ్ దర్శకుల్లో మారుతి అంత మెటిక్యులస్ ఫ్లానింగ్ పెర్ ఫెక్ట్ గా వుంటుంది. అటు సినిమా మేకింగ్ లో కావచ్చు, సినిమాలు తీయడంలో కావచ్చు, క్రియేటివ్ వర్క్ సైడ్ కావచ్చు సూక్ష్మంలో మోక్షం అన్నట్లు వుంటుంది. అందుకే ఆయన సినిమాల ద్వారా పేరు తెచ్చుకున్నారు. మాంచి ఫేమూ తెచ్చుకున్నారు.
భలే భలే మగాడివోయ్ సినిమా తరువాత యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, విక్కీ, ప్రమోద్ కలిసి మాంచి జాగ్వార్ కారును మారుతికి బహుకరించారు. ఇప్పుడు మళ్లీ ప్రతి రోజూ పండగే సినిమా విజయంతో మరోసారి మారుతికి మాంచి బహుమతి ఇచ్చారు. రేంజ్ రోవర్ వెలార్ కారును మారుతికి బహుమతిగా అందించారు.
ప్రతిరోజూ పండగే సినిమాతో యువి, గీతా సంస్థలకు కలిపి 10 కోట్లకు పైగా లాభాలు అందించింది. ఇంకా మాంచి రన్ లో వుంది. ఈ లాభాలు ఇంకా పెరుగుతాయి. ఇలాంటి నేపథ్యంలో మారుతి తన తరువాత సినిమాను కూడా యువి/గీతా 2 బ్యానర్ కే చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా వీలయినంత త్వరలో పట్టాలు ఎక్కేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మారుతి స్క్రిప్ట్ వర్క్ లో వున్నారు. అది పూర్తయ్యాక దాన్నిబట్టి హీరోను డిసైడ్ చేస్తారు.