మత్తువదలరా సినిమాతో తెరపైకి వచ్చాడు సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింహ కోడూరి. ఆ సినిమాకు మంచి అప్లాజ్ నే వచ్చింది. కానీ తరువాత మళ్లీ ఇంత వరకు సినిమా చేయలేదు.
ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నారు.ఈ సినిమా నిర్మాత ఎవ్వరో కాదు. కీరవాణి-రాజమౌళి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన సాయి కొర్రపాటి.
ఆయనతో పాట మరో నిర్మాత ముప్పనేని బెనర్జీ కూడా భాగస్వామిగా వుంటారు. ఈయన ఇటీవలే కలర్ ఫోటో సినిమాను నిర్మించారు.
కొత్త దర్శకుడు పని చేసే ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తారు. దసరాకు ప్రారంభమై, రెండు మూడు నెలల్లో షూట్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన కాస్టింగ్ వివరాలు తెలియాల్సి వుంది.