ష‌ణ్ముక్‌కు దీప్తి సున‌య‌న షాక్‌

గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతున్నట్టే జ‌రిగింది. బిగ్‌బాస్ సీజ‌న్‌-5 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌కు ప్రేయ‌సైన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సున‌య‌న  కొత్త ఏడాది మొద‌టి…

గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతున్నట్టే జ‌రిగింది. బిగ్‌బాస్ సీజ‌న్‌-5 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌కు ప్రేయ‌సైన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సున‌య‌న  కొత్త ఏడాది మొద‌టి రోజు షాక్ ఇచ్చింది. ష‌ణ్ముక్‌తో ఐదేళ్ల ప్రేమ ప్ర‌యాణానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్టుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె ప్ర‌క‌టించారు. త‌మ దారులు వేర‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో దీప్తి పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది.

కొత్త ఏడాది 2022కు బ్రేక‌ప్‌తో దీప్తి స్వాగ‌తం ప‌ల‌క‌డం సోష‌ల్ మీడియాలో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ మేర‌కు దీప్తి సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు ఏంటో తెలుసుకుందాం.

'ఎంతో ఆలోచించి, ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. షణ్ముఖ్‌, నేను పరస్పర అంగీకారంతో విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. గత ఐదేళ్లలో మేము సంతోషంగా ఉన్నాం, అదే సమయంలో మాలోని రాక్షసులతో పోరాడాం. ఫైనల్‌గా మీరు కోరుకున్నట్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ బ్రేకప్‌ సోషల్‌ మీడియాలో కనిపించినంత ఈజీ అయితే కాదు. ఇద్దరం కలిసి ఉండటానికి ప్రయత్నించాం, కానీ జీవితానికి ఏవి అవసరమో వాటిని విస్మరించాం. మా ఇద్దరి దారులు వేరని తెలుసుకున్నాం. అందుకే ఇక్కడే ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించాం. ఇది మాకెంతో క్లిష్ట సమయం. ఈ పరిస్థితుల్లో మీరు మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుతున్నాను' అని దీప్తి భావోద్వేగంగా రాసుకొచ్చారు.

బిగ్‌బాస్ రియాల్టీ షో ష‌ణ్ముక్ కొంప ముంచింది. ఈ సీజ‌న్‌లో సిరితో ష‌ణ్ముక్ ప్రేమాయ‌ణం సాగించార‌నే ప్ర‌చారం వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఎడ‌బాటుకు కార‌ణ‌మైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ష‌ణ్ముక్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత‌, క‌నీసం మాట్లాడేందుకు కూడా దీప్తి ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే ఇదంతా కొన్ని రోజులే అని, అన్నీ స‌ర్దుకుంటాయ‌ని ష‌ణ్ముక్ ప్ర‌క‌టించారు. అయితే ఇద్ద‌రు క‌లిసి ప్ర‌యాణించ లేనంత‌గా దీప్తి హృద‌యాన్ని ష‌ణ్ముక్ గాయ‌ప‌రిచార‌ని తాజా పోస్టుతో నిరూపిత‌మైంది.

జీవితానికి ఏవి అవసరమో వాటిని విస్మరించామ‌ని దీప్తి త‌న పోస్టులో పేర్కొన‌డంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చివ‌రికి త‌మ ఇద్దరి దారులు వేరని తెలుసుకున్న‌ట్టు దీప్తి తేల్చి చెప్ప‌డంతో కొంత కాలంగా వాళ్ల ఎడ‌బాటుపై సాగుతున్న ప్ర‌చారానికి తెర‌ప‌డిన‌ట్టే.