సల్మాన్ ఫ్రెండ్ లిస్ట్ లో చేరిన సౌత్ హీరో

తనకు ఇష్టమైన వాళ్లకు బహుమతులు ఇవ్వడం సల్మాన్ ఖాన్ హాబీ. తను పని చేసిన సినిమా యూనిట్ లో కీలక సభ్యులకు, లేదంటే తన ఫిల్మీ ఫ్రెండ్స్ కు ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ గిఫ్ట్…

తనకు ఇష్టమైన వాళ్లకు బహుమతులు ఇవ్వడం సల్మాన్ ఖాన్ హాబీ. తను పని చేసిన సినిమా యూనిట్ లో కీలక సభ్యులకు, లేదంటే తన ఫిల్మీ ఫ్రెండ్స్ కు ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇస్తుంటాడు ఈ కండల హీరో. ఇప్పుడీ లిస్ట్ లోకి ఓ సౌత్ హీరో కూడా చేరాడు. అతడి పేరు కిచ్చా సుదీప్.

అవును.. సల్మాన్ నుంచి ఊహించని బహుమతిని అందుకున్నాడు  ఈ కన్నడ నటుడు. సుదీప్ కు ఏకంగా బీఎండబ్ల్యూ ఎమ్-5 కారును గిఫ్ట్ గా అందించాడు సల్మాన్. అదేదో బహుమతిగా ఇచ్చి చేతులు దులుపుకోలేదు. నేరుగా సుదీప్ ఇంటికి వెళ్లి కారును అందించాడు. ఊహించని విధంగా సల్మాన్ తన ఇంటికి రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు మన “ఈగ” విలన్.

మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుందంటూ స్టార్ట్ చేసి, ఈరోజు తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు సుదీప్. కొత్త కారులో సల్మాన్ తో కలిసి దిగిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేశాడు. ఈ సిరీస్ కారు ప్రారంభ ధర కోటి 55 లక్షల రూపాయలు.

సల్మాన్ తో కలిసి దబంగ్-3 సినిమా చేశాడు సుదీప్. ప్రభుదేవా డైరక్ట్ చేసిన ఈ సినిమాలో విలన్ గా నటించాడు. అలా సల్మాన్-సుదీప్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సల్మాన్ నుంచి గిఫ్ట్ అందుకోవడం సుదీప్ కు ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకుముందు తన సొంత కలెక్షన్ నుంచి ఓ లెదర్ జాకెట్ ను సుదీప్ కు ఇచ్చాడు సల్మాన్.

ప్ర‌తి సీను ఒళ్ళు ద‌గ్గ‌ర పెట్టుకోని డైరెక్ట్ చేసాను