అదేంటో నాకు మాత్రమే అలా జరుగుతుంది: రష్మిక

తన కెరీర్ కు సంబంధించి ఓ గమ్మత్తయిన విషయాన్ని బయటపెట్టింది హీరోయిన్ రష్మిక. తను ఎన్ని సినిమాలు చేసినా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయిపోతుంటాయని, దాంతో మిగతా ఏడాదంతా తను ఖాళీగా ఉన్నట్టు…

తన కెరీర్ కు సంబంధించి ఓ గమ్మత్తయిన విషయాన్ని బయటపెట్టింది హీరోయిన్ రష్మిక. తను ఎన్ని సినిమాలు చేసినా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయిపోతుంటాయని, దాంతో మిగతా ఏడాదంతా తను ఖాళీగా ఉన్నట్టు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారని అంటోంది. తను మాత్రం సెట్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ఆడియన్స్ కు మాత్రం దూరమైపోతున్నట్టు తెలిపింది.

“జనవరిలో సరిలేరు నీకెవ్వరు వస్తోంది. ఫిబ్రవరిలో భీష్మ వస్తోంది. నా కెరీర్ ఎప్పుడూ ఇంతే. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు వచ్చేస్తుంటాయి. ఇక మిగిలిన ఏడాదంతా మిగతా సినిమాల పని చేసుకోవడమే. చూసేవాళ్లకు నా సినిమా వచ్చి చాలా రోజులైందేంటి అనిపిస్తుంది. నాకే ఎందుకిలా జరుగుతుందో.”

నితిన్ తో ఆమె చేస్తున్న భీష్మ సినిమాను డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అదే కనుక జరిగి ఉంటే 2020 మొత్తం తను ఖాళీగా ఉన్నానని, ప్రేక్షకులు అనుకునే ఛాన్స్ ఉందంటోంది రష్మిక. తను కేవలం సినిమాలకు సైన్ చేయడం మాత్రమే చేయగలనని, రిలీజ్ డేట్స్ విషయంలో తన ప్రమేయం అస్సలు ఉండదని, ఈ విషయంలో తను ఏం చేయలేనంటోంది ఈ బ్యూటీ.

ఇక అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి ప్రస్తుతం బన్నీతో సినిమాకు మాత్రమే కమిట్ అయినట్టు ప్రకటించింది రష్మిక. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తర్వాత పూర్తిగా బన్నీ-సుకుమార్ సినిమా వర్క్ మీద దృష్టిపెడతానని, ఆ సినిమా తప్ప మరో సినిమా తన చేతిలో లేదని స్పష్టంచేసింది.