టీ సుబ్బరామిరెడ్డి, మహ్మద్ అలీ ఖాన్, తోట సీతారామలక్ష్మి, కే కేశవరావు.. గత ఆరేళ్లుగా ఏపీ కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన వాళ్లు. ఈ ఏడాది ఏప్రిల్ తో వీరి పదవీ కాలం గడువు ముగియబోతూ ఉంది. ఏపీ కోటాలో త్వరలో నలుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది.
ఆ తాజా రాజ్యసభ సభ్యులు ఎవరు అనేది ఆసక్తిదాయకమైన అంశం. కాంగ్రెస్ ఖాతాలో సుబ్బరామిరెడ్డి, మహ్మద్ అలీ ఖాన్ లు ఉన్నారు. తెలుగుదేశం నుంచి తోట సీతారామలక్ష్మి ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అయిన కేశవరావు ఏపీ కోటాలోకి వచ్చారు విభజ సమయంలో. ఇప్పుడు వీరందరి పదవీ కాలం ముగియబోతూ ఉంది.
తెలుగుదేశం పార్టీకి ఏపీ అసెంబ్లీలో బలం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఒక్క రాజ్యసభ సీటును కూడా ఆ పార్టీ పొందలేదు. మొత్తం నాలుగు సీట్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందుతాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేట్ చేసే నలుగురికే ఆ ఎంపీ సీట్లు దక్కబోతూ ఉన్నాయి. ఏప్రిల్ నాటికి కొత్త వారిని జగన్ ఖరారు చేయాల్సి ఉంది. రాజ్యసభ నామినేషన్లతో తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేకుండా పోనుంది.
ఇక తెలంగాణ కోటాలోని ఎంపీలు ఇద్దరు కూడా త్వరలోనే పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. కేవీపీ, గరికపాటిలు అక్కడ టర్మ్ ను పూర్తి చేసుకోబోతున్నారు. ఆ రెండు సీట్లూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికే దక్కబోతూ ఉన్నాయి. కేశవరావుకు కేసీఆర్ మరో టర్మ్ అవకాశం ఇస్తారా?