నర్తనశాల సినిమాను ఇలా ప్రారంభించి, అలా ఆపేయాల్సి వచ్చింది నందమూరి బాలకృష్ణకు. అప్పట్లో ఆ ఫుటేజ్ కొంత వచ్చింది.
ఇన్నాళ్ల తరువాత శ్రేయాస్ ఇటి లో ఈ ఫుటేజ్ ను దసరా నాడు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బైట్ ను బయటకు వదిలారు. దాదాపు అరగంట సేపు బాలయ్య తన స్టయిల్ లో మాట్లాడారు.
ఆ మాటల్లో వెల్లడి అయిన విషయం ఏమిటంటే, సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫుటేజ్ కొంత కొత్త నర్తనశాలకు యాడ్ చేసారని. బాలయ్య నర్తనశాల ఫుటేజ్ 10 నిమషాలు, సీనియర్ ఎన్టీఆర్ ఫుటేజ్ 7 నిమషాలు కలిసి 17 నిమషాల విడియో వదలుతున్నారని తెలుస్తోంది.
ఈ ఫుటేజ్ కు కనుక ఆదరణ లభిస్తే నర్తనశాల సినిమాను మళ్లీ తీస్తానని ప్రకటించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా శ్రీరామ రాజ్యం, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలను గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద ఓ మెయిన్ స్ట్రీమ్ ఫుల్ లెంగ్త్ సినిమాకు ఎంత ప్రచారం చేస్తున్నారో, అంత హడావుడి జరుగుతోంది నర్తనశాల ఫుటేజ్ విడుదలకు.