ఎన్టీఆర్ బాడీ చూస్తే..భీముడే

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ భీమ్ ఇంట్రడక్షన్ వీడియో వచ్చేసింది. కాస్త ఆలస్యంగా అయినా దర్శకుడు రాజమౌళి ఈ టీజర్ ను మొత్తానికి బయటకు వదిలారు. Advertisement టీజర్ లో అందరినీ…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ భీమ్ ఇంట్రడక్షన్ వీడియో వచ్చేసింది. కాస్త ఆలస్యంగా అయినా దర్శకుడు రాజమౌళి ఈ టీజర్ ను మొత్తానికి బయటకు వదిలారు.

టీజర్ లో అందరినీ ఆకట్టుకునేది ఎన్టీఆర్ బాడీ. ఆయన శరీర ధారుఢ్యం అద్భుతంగా ప్రొజెక్ట్ చేసారు. డైలాగులు మామూలే. ఎప్పుడో ఖలేజా టైమ్ లో త్రివిక్రమ్ రాసారు. హీరో మహేష్ గురించి రావు రమేష్ చేత చెప్పించారు. ఆ స్టయిల్ నే ఈ డైలాగులు కూడా గుర్తుకు తెచ్చాయి.అరవింద సమేతలో కూడా జగపతి బాబు ఇలాంటి డైలాగులు  చెప్పారు.

రామ్ చరణ్ క్యారెక్టర్ వీడియోలో ఎన్టీఆర్ గాంభీర్యంగా పలికినంతగా రామ్ చరణ్ పలకలేకపోయాడనే చెప్పాలి. వీడియో మొత్తంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేది కేవలం ఎన్టీఆర్ లుక్ కే. బేర్ బాడీతో కావచ్చు, లాల్చీ ఫైజామాతో కావచ్చు. అభిమానులనే కాదు అందరినీ అలరిస్తాడు ఎన్టీఆర్.  

వీడియోలో గ్రాఫిక్ వర్క్ నే ఎక్కవ వుంది. షూటింగ్ ఇంకా ఎక్కువ జరగలేదనే అనుమానాలను వీడియో చెప్పకనే చెబుతోంది. బల్గేరియాలో తీసిన అడవుల సీన్, అల్యూమినియం ఫ్యాక్టరీలో తీసిన టంగా కాలిపోయే సీన్ ఈ వీడియోలో కనిపించాయి. మొత్తం మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ విడియో మంచి దసరా కానుకే.