ఇదీ జగన్ దారి.. మరో సంక్షేమ పథకం అమలు

ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరో హామీని నిలబెట్టుకున్నారు.  Advertisement పేదలకు మరింత లబ్ది చేకూర్చేలా, వాళ్ల జీవనానికి మరింత భరోసా కల్పించేలా “వైఎస్ఆర్…

ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరో హామీని నిలబెట్టుకున్నారు. 

పేదలకు మరింత లబ్ది చేకూర్చేలా, వాళ్ల జీవనానికి మరింత భరోసా కల్పించేలా “వైఎస్ఆర్ బీమా” పథకాన్ని ప్రవేశపెట్టారు. బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం కింద లబ్ది చేకూరనుంది.

వైఎస్ఆర్ బీమా పథకం కింద లబ్దిదారులెవ్వరూ పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం ఏడాదికి 510 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో, కేంద్రం భాగస్వామ్యంతో ఈ పథకం అమలుకావాలి. కానీ కేంద్రం బీమా పథకం నుంచి తప్పుకుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కి తగ్గలేదు. 

ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వమే ప్రీమియం భరిస్తూ బీమా సదుపాయం కల్పించబోతోంది. దీనికోసం లబ్దిదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఎప్పట్లానే సచివాలయం సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి లబ్దిదారుల్ని ఎంపిక చేస్తారు. 

అర్హులకు ఈసారి బీమా కార్డుల్ని కూడా అందించబోతున్నారు. లబ్దిదారులంతా బ్యాంక్ ఎకౌంట్స్ కలిగి ఉండే మంచిది. తద్వారా బీమా పరిహారం వేగంగా సాగుతుంది. ఇక బీమా కవరేజీ విషయానికొస్తే.. ప్రమాదాల్లో మరణించిన లేదా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు బీమా కవరేజీ ఉంటుంది. 

సహజమరణానికి కూడా బీమా లభిస్తుంది. 18-50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు ప్రమాదవశాత్తూ మరణిస్తే 5 లక్షల బీమా అందిస్తారు. అదే సహజమరణమైతే 2 లక్షలు బీమా కింద చెల్లిస్తారు. అంగవైకల్యం సంభవిస్తే లక్షన్నర రూపాయలు చెల్లిస్తారు.

వైఎస్ఆర్ బీమా పథకం కింద లబ్దిదారుల జాబితాను అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఒకవేళ లబ్దిదారులు ఎవరైనా తమ పేరు మిస్సయినట్టు భావిస్తే, వారం రోజుల్లోగా పరిశీలించి వాళ్లను కూడా వైఎస్ఆర్ బీమా పథకం కింద చేరుస్తారు. 

తాజా పథకంతో కోటి 41 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరబోతోంది. ఇలా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాల్ని అమలు చేస్తూ.. ప్రజల మనిషి అనిపించుకుంటున్నారు జగన్.

మోదీకి చిక్కిన కేసీఆర్